Acid Attack
-
విశాఖలో దారుణం.. అంగన్వాడీ టీచర్‌పై యాసిడ్ దాడి!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్‌పై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. విశాఖలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అంగన్వాడీ టీచర్ మున్నీసా బేగంపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనలో భాదితురాలికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఈ దారుణ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విశాఖలో మహిళలపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం
-
మహిళ దుస్తులు నచ్చలేదని ‘యాసిడ్ దాడి’ బెదిరింపు
బెంగళూరు: ఓ మహిళ తనకు నచ్చిన దుస్తులు వేసుకున్నందుకు.. యాసిడ్ పోస్తానని సోషల్ మీడియాలో బెదిరించిన ఓ వ్యక్తిని అతని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ‘‘అతనికి నచ్చని దుస్తులు వేసుకున్నందుకు యాసిడ్ పోస్తానని నా భార్యను నికిత్శెట్టి అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు, వెంటనే ఈ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి’’అని జర్నలిస్ట్ షాబాజ్ అన్సార్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనికి కర్ణాటక అధికారులను ట్యాగ్ చేశారు. దీంతో నెటిజన్స్ మహిళకు మద్దతుగా నిలిచారు. నికిత్ శెట్టిపై చర్యలు తీసుకోవాలని అతడు ఉద్యోగం చేస్తున్న సంస్థ ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై నికిత్ శెట్టి యాజమాన్యం స్పందించింది. అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ‘‘మా ఉద్యోగి మరో వ్యక్తి దుస్తుల ఎంపిక గురించి బెదిరించడం మాకు బాధ కలిగించింది. ఈ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఇది మా విలువలకు విరుద్దం. మేం నికిత్ శెట్టిని తొలగిస్తున్నాం. అతనిపై ఫిర్యాదు చేశాం. కేసు నమోదు అయ్యింది’’అని ఎటియోస్ డిజిటల్ సరీ్వసెస్ తెలిపింది. అయితే తన భార్యను బెదిరించిన వ్యక్తిపై చర్యలు తీసుకున్న కంపెనీకి, అందుకు మద్దతు తెలిపిన పలువురు నెటిజన్స్‌కు అన్సార్ కృతజ్ఞతలు తెలిపారు. -
ఈ ఛాయాచిత్రాలు...కన్నీటి కథలు...పోరాట రూపాలు
వన్య్రన ప్రాణులపై ఆసక్తితో సరదాగా కెమెరాను చేతపట్టింది నాన్కీ సింగ్.అయితే ఇప్పుడు ఆమె దృష్ణి కోణం మారింది.తన కెమెరా ఇప్పుడు బాధితుల చేతిలో ఆయుధం. వారి పోరాట పటిమకు నిదర్శనం. సరదాగా ‘రీల్స్’ చేసే వయసులో సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది 22 సంవత్సరాల నాన్కీ సింగ్.దిల్లీకి చెందిన నాన్కీ సింగ్ యాసిడ్–ఎటాక్ సర్వైవర్ల జీవితాలను ‘ఏ జర్నీ టు ది మిర్రర్’ పేరుతో డాక్యుమెంటేషన్ చేసింది.ఈ ఛాయాచిత్ర ప్రదర్శన దిల్లీలోని స్టెయిన్లెస్ గ్యాలరీలో జరుగుతోంది.అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది... అనే వార్త చదివి ‘అయ్యో’ అనుకుంటాం. దాడి చేసిన దుర్మార్గుడిని తిట్టుకుంటాం. వాడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటాం.ఎవరి పనుల్లో వారు బిజీ కావడం వల్ల, ఎవరి లోకంలో వారు ఉండిపోవడం వల్ల ‘ఘటన తరువాత యాసిడ్ బాధితురాలి పరిస్థితి ఏమిటి?’ అనేదానిపై దృష్టి మళ్లదు.‘సర్వైవర్’ అన్న సానుకూల మాటేగానీ యాసిడ్–సర్వైవర్లలో చాలామంది జీవితాలు నరక్రపాయంగా ఉంటాయి. సానుభూతికే పరిమితమైనవారు సహాయానికి ముందుకు రాకపోవచ్చు. అంతకుముందు వరకు ఆత్మీయులుగా ఉన్నవారు అందనంత దూరం జరగవచ్చు.‘బతికాను సరే, ఎలా బతకాలి’ అనేది వారికి ప్రధాన సమస్య అవుతుంది. ఉద్యోగం చేయడం నుంచి సొంతంగా చిన్నపాటి వ్యాపారం మొదలు పెట్టడం వరకు ఏదీ సులభం కాదు.యాసిడ్ దాడి బాధితుల గురించి ఎన్నో ఆర్టికల్స్ చదివిన నాన్కీసింగ్ తన కాలేజి అసైన్‌మెంట్‌లో భాగంగా వారి కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలను ప్రపంచానికి చూపించాలనుకుంది. అలా ‘ఏ జర్నీ టు ది మిర్రర్’ప్రాజెక్ట్ పట్టాలకెక్కింది. ఈ ప్రాజెక్ట్ కోసం నోయిడాలోని చాన్వ్ అనే ఫౌండేషన్ ప్రతినిధులను సంప్రదించింది. యాసిడ్ దాడి బాధితులకు వైద్య, ఆర్థిక సహాయాలు అందించడంతో పాటు పునరావాసం కలిగించే సంస్థ ఇది.నాన్కీ ఎంతోమంది సర్వైవర్స్‌తో మాట్లాడింది. మొదట్లో మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు.అయితే పరిచయం స్నేహంగా మారిన తరువాత మనసు విపారు ఒక్కొక్కరిది ఒక్కోకథ.కన్నీళ్లు తెప్పించే కథ.చుట్టూ చీకటి కమ్ముకున్న క్లిష్ట సమయంలోనూ వెలుగు దారుల వైపు అడుగులు వేసిన కథ.సబ్జెక్ట్‌తో ఫొటోగ్రాఫర్ మమేకం అయినప్పుడు చిత్రం ప్రేక్షకుల దగ్గరికి వేగంగా వెళుతుంది. తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌కు అనుగుణంగా సాంకేతిక జ్ఞానాన్ని వాడుకుంది నాన్కీ.ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ అండ్ వైట్‌లో ఫొటోలు తీసింది. దీనికి కారణం కలర్ ఫొటోలు సబ్జెక్ట్‌కు అతీతంగా వేరే అంశాలపై దృష్టి మళ్లిస్తాయి.బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు మాత్రం నేరుగా సబ్జెక్ట్‌పై దృష్టి పడేలా చేస్తాయి.‘అద్దంలో నా ముఖం చూసుకోవాలంటే అంతకుమించిన నరకం లేదు అని చాలామంది అమ్మాయిలు నాతో పదేపదే చెప్పారు’ అంటుంది నాన్కీ సింగ్.అలాంటి వారిలో ధైర్యం నింపింది నాన్కీ. ‘మీరేమీ తప్పు చేయలేదు. కష్టాలను తట్టుకొని మీరు చేస్తున్న జీవన పోరాటం సాధారణమైనదేమీ కాదు’ అని చెప్పింది.కాలేజి ప్రాజెక్ట్‌లో భాగంగా యాసిడ్ దాడి బాధితుల దగ్గరికి వచ్చిన నాన్కీ వారితో కలిసి ప్రయాణం చేస్తోంది. వారి కష్టాలను పంచుకుంటోంది.‘ఫొటోగ్రాఫర్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్మేకర్లు వారి దగ్గర రావడం కొత్తేమీ కాదు. అయితే నేను మాత్రం ప్రాజెక్ట్‌కు అతీతంగా వారితో అనుబంధం పెంచుకోవాలనుకున్నాను. వారికి ఏది నచ్చుతుందో, నచ్చదో తెలుసుకోవాలనుకున్నాను. వారిని కేవలం బాధితులుగా చూడడం నాకు ఇష్టం లేదు’ అంటుంది నాన్కీ సింగ్.తనకు ఎప్పుడు వీలైతే అప్పుడు వారి దగ్గరకు వెళ్లి మాట్లాడి వస్తుంది. వారి బర్త్‌డేకు కేక్ కట్ చేయించి ఫొటోలు దిగుతుంది.తన ఫొటో ఎగ్జిబిషన్ల ద్వారా యాసిడ్ దాడి బాధితుల కోసం నిధుల సేకరణ చేస్తోంది.వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా తన ప్రయాణం మొదలు పెట్టింది నాన్కీ. ఇందులో భాగంగా దక్షిణాఫ్రికాకు వెళ్లింది. అక్కడినుంచి తిరిగి వచ్చిన తరువాత దిల్లీలోని చాందిని చౌక్లాంటి ప్రాంతాల్లో స్ట్రీట్ ఫొటోగ్రఫీ చేసింది. ఫొటోగ్రఫీలోని సాంకేతిక విషయాలపై పట్టుకోసం న్యూయార్క్‌లోని ‘స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్’లో చేరింది.నాన్కీ సింగ్ ఇప్పుడు సామాజిక విషయాలపై దృష్టి పెట్టింది. మహిళల హక్కుల నుంచి వారిపై జరుగుతున్న హింస వరకు ఎన్నో అంశాలపై ఫోటో ప్రాజెక్ట్‌లు చేస్తోంది.వారి కుటుంబంలో భాగం అయింది...‘ఎ జర్నీ టు ది మిర్రర్’ప్రాజెక్ట్ పూర్తికాగానే ‘ఇక సెలవు’ అనే మాట నాన్కీసింగ్ నోట వినిపించలేదు.‘మళ్లీ మళ్లీ కలుస్తుంటాను’ అన్నది నాన్కీ. అనడమే కాదు తనకు సమయం దొరికినప్పుడల్లా యాసిడ్ దాడి బాధితుల దగ్గరికి వెళుతుంది. వారితో సరదాగా కబుర్లు చెబుతుంది. వారి కష్టసుఖాల్లో భాగం పంచుకుంటుంది.‘నాన్కీతో మాట్లాడుతుంటే కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లుగానే ఉంటుంది. ఆమెతో మాట్లాడితే సంతోషమే కాదు ఆత్మస్థైర్యం కూడా వస్తుంది’ అంటారు యాసిడ్ దాడి బాధితులు. -
ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
సాక్షి, హైదరాబాద్: శంకర్పల్లి ఇక్ఫాయి యూనివర్శిటీలో దారుణం చేసుకుంది. బీటెక్ విద్యార్థిని లేఖపై యాసిడ్ దాడి జరిగింది. కాలేజీలో జరుగుతున్న వేడుకల్లో యాసిడ్ దాడి జరిగింది. విద్యార్థిని లేఖ్యపై తోటి విద్యార్థులు యాసిడ్ దాడి చేశారు. రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్‌ను విద్యార్థులు నింపారు. రంగు నీళ్లు అనుకొని యాసిడ్‌ని తోటి విద్యార్థులు విద్యార్థినిపై పోశారు. విద్యార్థిని లేఖకు తీవ్రగాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. -
కర్ణాటకలో విద్యార్థినులపై యాసిడ్ దాడి
మంగళూరు: ప్రేమను తిరస్కరించిందన్న ఆవేశంతో ఒక యువకుడు ఒక అమ్మాయిపై కక్ష పెంచుకుని యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. యాసిడ్ దాడి సమయంలో ఆ బాధిత అమ్మాయి పక్కనే కూర్చున్న వేరే ఇద్దరు అమ్మాయిలపైనా యాసిడ్ పడి వారికీ ముఖంపై కాలిన గాయాలయ్యాయి. కర్ణాటకలో మంగళూరు సమీపంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని కడబ తాలూకాలో ఈ యాసిడ్ దాడి ఘటన జరిగింది. బాధిత అమ్మాయి ముఖంపై తీవ్రస్థాయిలో గాయాలయ్యాయి. దీంతో ఆమెను హుటాహుటిన సమీప ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కడబలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ప్రీ–యూనివర్సిటీ కోర్సు పరీక్షల కోసం కారిడార్‌లో కూర్చుని సిద్ధమవుతున్న ముగ్గురు టీనేజీ అమ్మాయిల ముఖంపైకి ఒక యువకుడు యాసిడ్ చల్లాడు. ఆ యాసిడ్ ద్రావకం పక్కనే ఉన్న మరో ఇద్దరు అమ్మాయిలపైనా పడింది. దాడి చేసి పారిపోతున్న యువకుడిని స్థానికులు వెంబడించి పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. అతడిని కేరళ మణప్పురం జిల్లా నీలాంబూర్‌కు చెందిన 23 ఏళ్ల అబిన్ షిబిగా పోలీసులు గుర్తించారు. తన ప్రేమను తిరస్కరించినందుకే బాధిత విద్యారి్థనిపై యాసిడ్ దాడికి పాల్పడినట్లు పోలీసుల ముందు యువకుడు నేరం అంగీకరించాడు. -
పరీక్షకు వచ్చిన విద్యార్థినిపై యాసిడ్ దాడి!
కర్ణాటకలోని మంగళూరులో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కడబా ప్రాంతంలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఓ యువకుడు యాసిడ్ దాడి చేశాడు. బాధితురాలు స్థానిక పాఠశాలలో 12వ తరగతి చదువుతోంది. ఆ బాలిక సోమవారం ఉదయం పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పరీక్షా కేంద్రం వద్ద కాపుగాసిన 23 ఏళ్ల అబిన్ ఆమెపై యాసిడ్ విసిరాడు. దీనిని గమనించిన అక్కడున్నవారు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అబిన్ కేరళకు చెందినవాడని, ఎంబీఏ చదువుకున్నాడని తెలిపారు. అతనికి బాధితురాలితో గతంలో పరిచయం ఉంది. నిందితుడు అబిన్ బాధితురాలు కేరళలో ఒకే ప్రాంతంలో ఉండేవారని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బాధితురాలికి వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
విశాఖజిల్లా పెందుర్తిలో రెచ్చిపోయిన టీడీపీ నాయకుడు
-
పెందుర్తిలో టీడీపీ నేత రాక్షసత్వం
పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో టీడీపీ నేతల దుశ్శాసన పర్వం కొనసాగుతోంది. చింతగట్ల పంచాయతీ నందవరపువానిపాలెంలో ఒంటరిగా నివసిస్తున్న ఓ మహిళపై పంచాయతీ టీడీపీ అధ్యక్షుడు చీపురపల్లి నరసింగరావు రాక్షసంగా దాడి చేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న రూ.5 లక్షలు, బంగారు ఆభరణాలను తస్కరించాడు. తీవ్ర గాయాలతో దాదాపు నాలుగు రోజుల పాటు నిందితుడు, అతడి కుటుంబ సభ్యుల చేతిలో బందీగా ఉండి సక్రమంగా చికిత్స అందక నరకయాతన అనుభవించిన ఆ అభాగ్యురాలు.. తెగించి శనివారం పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు.. బాధితురాలి కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మహిళ భర్తతో విభేదాల కారణంగా విశాఖ గోపాలపట్నం ప్రాంతంలో బ్యుటీషియన్‌గా పనిచేసేది. మూడేళ్ల కిందట నందవరపునవానిపాలెంలో చింతగట్ల పంచాయతీ టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చీపురపల్లి నరసింగరావు వద్ద ఇంటి స్థలాన్ని కొని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. ఈ క్రమంలో ఇంటి స్థలం కొన్న చనువుతో ఆమె వద్దకు తరచూ నరసింగరావు వస్తూ ఆమెను లోబరుచుకున్నాడు. ఎంతో ప్రేమ నటిస్తూ ఆరి్థక అవసరాలు కూడా తీర్చుకునేవాడు. ఈ వ్యవహారంలో నరసింగరావు భార్య చిన్ని కూడా ‘నువ్వు లేకపోతే నా భర్త ఉండలేడు.. మీ ఇద్దరూ కలిసి ఉండండి’ అంటూ బాధితురాలిని ఒప్పించడం గమనార్హం. ఇలా సహజీవనం సాగిస్తున్న తరుణంలో నరసింగరావు ప్రవర్తనలో మార్పు రావడంతో అతడిని దూరం పెట్టింది. యాసిడ్‌తో దాడి చేసి.. నరసింగరావుకు ఆమె దూరంగా ఉండటంతో అతడు సహించలేకపోయాడు. ఆమె ఇంటికి వెళ్లి కొడుతూ ఉండేవాడు. అలా నరసింగరావు వేధిస్తూ ఉంటుంటే.. అతడి భార్య చిన్ని వచ్చి బాధితురాలికి సర్ది చెబుతూ ఉండేది. ఈ క్రమంలో ఈ నెల 7 మధ్యాహ్నం 2.30 సమయంలో నరసింగరావు ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె దుస్తులు చింపేసి యాసిడ్‌ను ఆమెపై చల్లాడు. దీంతో ఆమె ఛాతి భాగం కాలిపోయింది. అంతటితో ఆగకుండా ఆమె పొత్తికడుపు, మెడపై పిడిగుద్దులు గుద్దుతూ పేట్రేగిపోయాడు. బాధితురాలు అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆమె బీరువాలోని నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించాడు. ఇంట్లో గొడవను గుర్తించిన స్థానికులు రావడంతో నిందితుడు నరసింగరావు గోడ దూకి పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అయితే బాధితురాలికి ఏదైనా అయితే తన మెడకు చుట్టుకుంటుందన్న భయంతో ఆమెను నరవలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. తన భార్య, కుటుంబ సభ్యులను ఆమె వద్ద కాపాలా ఉంచి అరకొర చికిత్సను అందించాడు. ఈ నాలుగు రోజుల పాటు ఆమె ఎక్కడుందో ఆమె బంధువులకు కూడా తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఆస్పత్రి నుంచి బాధితురాలు బయటికొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆమెను కేజీహెచ్‌కు తరలించినట్టు పోలీసులు చెప్పారు. -
విశాఖ: మహిళపై టీడీపీ నేత యాసిడ్ దాడి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నాయకుడు రెచ్చిపోయారు. మహిళపై టీడీపీ నేత నర్సింగరావు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సింగరావు.. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచరుడు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం!
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2002లో 14 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగింది. అయితే ఈ ఉదంతంపై పోలీసులు వెంటనే కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు న్యాయం కోసం పరితపించింది. అయితే 2014లో ఆమెకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగం వచ్చింది. ఒకరోజు ఆగ్రా జోన్ ఏడీజీ రాజీవ్ కృష్ణ ఈమె పనిచేస్తున్న కేఫ్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన యాసిడ్ బాధితురాలితో మాట్లాడారు. ఆమె తన కథను ఏడీజీ రాజీవ్ కృష్ణకు వివరించింది. దీంతో ఆయన ఈ ఉదంతంపై కేసు నమోదు చేయించారు. జనవరి 2023లో ఈ కేసు అలీఘర్‌లోని ఉపర్కోట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు ఆరిఫ్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 2002లో అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోరావర్ వాలీ ప్రాంతంలో ఉంటున్న బాలికపై ఆరిఫ్ అనే యువకుడు యాసిడ్ పోశాడు. యాసిడ్ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆరీఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014లో యాసిడ్ బాధితులకు ఆగ్రాలోని ఓ కేఫ్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. పోలీసు అధికారి రాజీవ్ కృష్ణ 2022, డిసెంబరులో ఈ కేఫ్‌కు వచ్చారు. అలీఘర్ బాధితురాలి కథ విన్న ఆయన కేసు దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకున్నారు. పోలీసుల విచారణలో ఆరిఫ్ దోషి అని తేలింది. ఈ నేపధ్యంలో పోలీసులు అతనిని జైలుకు తరలించారు. ఇది కూడా చదవండి: దేశ రాజకీయాల్లో మహరాణులెవరు? ఎక్కడ చక్రం తిప్పుతున్నారు? -
ఏలూరు యాసిడ్ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరులో మహిళపై యాసిడ్ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ కేవలం 117 రోజుల్లోనే తీర్పు వెలువరించారు. జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీ‹Ùకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, యాసిడ్ దాడికి పాల్పడిన ఏలూరుకు చెందిన బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్ విక్రయించిన ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కొల్లా త్రివిక్రమరావు (68)కు రూ.1,500 జరిమానా విధించారు. దాడి జరిగిందిలా.. మృతురాలు ఫ్రాన్సికా భర్తకు దూరంగా ఉంటూ నగరంలోని ప్రైవేట్ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. కాగా.. ఫ్రాన్సికా సోదరితో ఏలూరు వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన బోడ నాగసతీష్ సన్నిహితంగా ఉండేవాడు. దీనిని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో కక్ష పెంచుకున్న సతీ‹Ù.. ఫ్రాన్సికాను హతమార్చేందుకు నగరానికి చెందిన మోహన్, ఉషాకిరణ్ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. వారిద్దరూ ఈ ఏడాది జూన్ 13న రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్రాన్సికాపై యాసిడ్‌తో దాడి చేశారు. గాయపడిన ఆమెను ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ జీజీహెచ్‌కు, ఆ తరువాత మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. సీఐ ఇంద్ర శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్రాన్సికాను బతికించాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధితురాలి చికిత్స కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె జూన్ 21న మృతి చెందింది. సత్వర విచారణతో నిందితులకు కఠిన శిక్షలు డీజీపీ కేవీ రాజేంద్రనాద్‌రెడ్డి ఆదేశాలతో కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. నిందితుల్ని అరెస్ట్ చేసి కేవలం 21 రోజుల్లోనే చార్జ్ïÙట్ దాఖలు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సునీల్‌కుమార్ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.శ్రీవాణిబాయ్ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, విశ్వం, డీఎస్పీ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ దుర్గాప్రసాద్‌ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు. -
ధైర్యం పలికిన పేరు... దేవాన్షి! ఆమె ఒక సైన్యంలా..!
పద్నాలుగు సంవత్సరాల వయసులో యాసిడ్ దాడికి గురైంది ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన దేవాన్షీ యాదవ్. తాను బాధితురాలిగా ఉన్నప్పుడు ఒంటరి. ఇప్పుడు మాత్రం తానే ఒక సైన్యం. ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సోసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టి న్యాయసహాయం అందించడం నుంచి ఉపాధి అవకాశాలు కల్పించడం వరకు బాధితుల కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేపడుతున్న దేవాన్షి గురించి... కష్టాలన్నీ కలిసికట్టుగా వచ్చాయా! అన్నట్లుగా దేవాన్షీ యాదవ్ నెలల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పద్నాలుగు సంవత్సరాల వయసులో కుటుంబ స్నేహితుడిగా భావించే ఒకడు లైంగిక వేధింపులకు, యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వాళ్లు, బంధువులు మాత్రం దేవాన్షినే బోనులో నిలబెట్టారు. ‘మన జాగ్రత్తలో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా’ లాంటి మాటలు తనను ఎంతో బాధ పెట్టాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ పట్టణానికి చెందిన 31 సంవత్సరాల దేవాన్షి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి కష్టాలెన్నో కనిపిస్తాయి. అయితే వాటిని గుర్తు చేసుకుంటూ బాధను గుండెలో పెట్టుకోలేదు. తనలాంటి కష్టాలు వచ్చిన వారికి అండగా నిలబడాలనుకుంది. అలా మొదలైందే ‘షాహీద్ రామాశ్రయ్ వెల్ఫేర్ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థ. లైంగిక వేధింపులకు గురవుతున్న వారి నుంచి గృహహింస బాధితుల వరకు ఎంతోమందికి ఈ సంస్థ తరపున అండగా నిలబడింది దేవాన్షి. ‘ధైర్యసాహసాలలో మా అమ్మే నాకు స్ఫూర్తి. నాకు తొమ్మిది నెలలు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు. ఒకవైపు భర్త చనిపోయిన బాధ, మరోవైపు బిడ్డను ఎలా పోషించాలనే బాధ, అయోమయం ఆమెను చుట్టుముట్టాయి. ఆరోజు ఆమె ధైర్యం కోల్పోయి ఉంటే ఈ రోజు నేను ఉండేదాన్ని కాదు. జీవితంలో ప్రతి సందర్భంలో ధైర్యంతో ముందుకు వెళ్లింది. తల్లిగా ప్రేమానురాగాలను పంచడమే కాదు ధైర్యం అనే విలువైన బహుమతిని ఇచ్చింది’ అంటుంది దేవాన్షి. భారమైన జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికి, శక్తిమంతం కావడానికి సామాజిక సేవా కార్యక్రమాలు దేవాన్షికి ఎంతో ఉపయోగపడ్డాయి. దేవాన్షి దగ్గరకు సహాయం కోసం వచ్చే బాధితుల్లో ఏ కోశానా ధైర్యం కనిపించదు. అలాంటి వారిలో ధైర్యం నింపడం అనేది తాను చేసే మొదటి పని. తనని కుటుంబ సభ్యురాలిగా భావించుకునేలా ఆత్మీయంగా ఉండడం రెండో పని. కౌన్సెలింగ్ ద్వారా వారికి భవిష్యత్ పట్ల ఆశ రేకెత్తించడం మూడోపని. ‘ఈ సమాజం నన్ను చిన్నచూపు చూస్తుంది. నాకు ఎవరూ అండగా లేరు’ అనుకున్న ఎంతోమందికి ‘నాకు ఎవరి అండా అక్కర్లేదు. ఒంటరిగా పోరాడగలను. నా కోసం నేను పోరాడలేనా!’ అనే ధైర్యాన్ని ఇచ్చింది. ‘ఇంకేముంది నా భవిష్యత్ బుగ్గిపాలు అయింది’ అని జీవనాసక్తి కోల్పోయిన వారిలో ‘కష్టాలు నీ ఒక్కరికే కాదు. అందరికీ వస్తాయి. అదిగో నీ భవిష్యత్’ అంటూ ఆశావాహ దృక్పథాన్ని కలిగించింది. ‘పదా... పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దాం’ అని దేవాన్షి అన్నప్పుడు... ‘అమ్మో! నాకు పోలీస్ స్టేషన్ అంటే భయం’ అన్నది ఒక బాధితురాలు. ‘తప్పు చేసిన వాడు హాయిగా తిరుగుతున్నాడు. ఏ తప్పూ చేయని నువ్వెందుకు భయపడడం’ అని దేవాన్షి అనగానే ఆ బాధితురాలు పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో! సంస్థ అడుగులు మొదలుపెట్టిన కొత్తలో... ‘మీవల్ల ఏమవుతుంది’ అన్నట్లుగా ఎంతోమంది వ్యంగ్యంగా మాట్లాడేవారు. వారికి తన పనితీరుతోనే సమాధానం ఇచ్చింది దేవాన్షి. ‘దేవాన్షీ చాలా పట్టుదల గల వ్యక్తి. ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యదు. భర్త, అత్తమామల వేధింపులు తట్టుకోలేక నేను దేవాన్షి దగ్గరకు వచ్చాను. ఆమె నాకు ఆశ్రయం ఇచ్చింది. విషయం తెలుసుకున్న అత్తింటి వారు దేవాన్షిని బెదిరించడానికి వీధిరౌడీలను పంపించారు. ఆమె ధైర్యాన్ని చూసి వారు తోక ముడవడానికి ఎంతో సమయం పట్టలేదు’ అంటుంది బరేలీకి చెందిన రత్న. బరేలీ పట్టణానికి చెందిన వారే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఎంతోమంది మహిళలు దేవాన్షి సహాయం కోసం రావడం ప్రారంభించారు. ‘మా దగ్గరకు వచ్చేవాళ్లలో 60 నుంచి 70 శాతం గృహహింస బాధితులే. వారికి అండగా నిలిచినప్పుడు సహజంగానే బెదిరింపులు ఎదురయ్యాయి. అయితే నేను వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు. మీకు ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అనే ప్రశ్న అడుగుతుంటారు. ఒకప్పుడు నేను మీలాగే భయపడేదాన్ని... అంటూ నాకు ఎదురైన చేదు అనుభవాలను వారితో పంచుకుంటాను. అమ్మ నుంచి ధైర్యం ఎలా పొందానో చెబుతాను. ధైర్యం అనేది ఒకరు దయతో ఇచ్చేది కాదు. అది అందరిలోనూ ఉంటుంది. దాన్ని ఉపయోగించుకుంటున్నామా? లేదా? అనేదే ముఖ్యం అని చెబుతుంటాను’ అంటుంది దేవాన్షీ యాదవ్. ‘అత్తింటి బాధలు తట్టుకోలేక బయటికి వచ్చాను. ఇప్పుడు నేను ఒంటరిగా ఎలా బతకగలను’ అని దిక్కులు చూస్తున్న ఎంతోమందికి సంస్థ ద్వారా దిక్కు చూపించి సొంత కాళ్ల మీద నిలబడేలా చేసింది. బాల్యవివాహాలు జరగకుండా అడ్డుపడింది. ‘మంచిపని చేస్తే ఆ ఫలితం తాలూకు ఆనందమే కాదు అపారమైన శక్తి కూడా లభిస్తుంది. ఆ శక్తి మరిన్ని మంచిపనులు చేయడానికి వెన్నుదన్నుగా నిలుస్తుంది’ అంటుంది దేవాన్షీ యాదవ్. (చదవండి: "బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది! వైద్యులనే విస్తుపోయేలా చేసింది!) -
సబ్బులతో సాంత్వన! అదే యాసిడ్ బాధితులకు ఉపాధిగా..!
మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెబుతుంటారు. ఆదుకోవాలని మనసు ఉండాలేగానీ, సరికొత్త దారులు అనేకం కనిపిస్తాయని చేసి చూపెడుతోంది పదిహేడేళ్ల సీమర్ సంగ్లా. యాసిడ్ దాడి బాధితులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు సబ్బుల తయారీలో శిక్షణ ఇస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఢిల్లీకి చెందిన సీమర్ ఇంటర్మీడియట్ చదువుతోంది. ఒకసారి పూనమ్ అనే అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగింది. దీంతో ఆమె ముఖం మొత్తం కాలిపోయింది. అయితే ఆమె మామూలు సబ్బులతో స్నానం చేస్తే యాసిడ్ దాడి జరిగిన ప్రదేశంలో బాగా మంట పుట్టేది. ఈ విషయం తెలిసిన యాసిడ్ దాడి బాధితులకు సాయం చేసే సీమర్ తల్లి... పూనమ్‌ను ఆదుకునే క్రమంలో ... మంట రాని సబ్బు తయారు చేయాలనుకుంది. ఈ క్రమంలోనే సీమర్ అమ్మ, అమ్మమ్మలు కలిసి, సబ్బు తయారు చేశారు. యాసిడ్ దాడికి కాలిపోయిన పూనంకు ఈ సబ్బు స్వాంతన కలిగించింది. వాడుకోవడానికి చాలా అనువుగా అనిపించింది. ఇదంతా దగ్గర నుంచి చూసిన సీమర్ యాసిడ్ బాధితుల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టింది. పూనమ్లా ఎంతోమంది యాసిడ్ దాడికి గురైనట్లు తెలుసుకుని, వాళ్లందరికి తాను ఏదోరకంగా సాయపడాలనుకుంది. గతేడాది యాసిడి బాధితుల అవసరాలకు తగినట్లుగా ‘సేఫ్ కేవ్’ పేరిట సబ్బులు తయారు చేయడం ప్రారంభించింది. అలోవెర, తేనెలతో సబ్బులు తయారు చేసి యాసిడ్ బాధితులకు ఇచ్చేది. ఈ సబ్బులు బాధితులకు సాంత్వననిచ్చేవి. వారి ఆసక్తిని గమనించిన సీమర్... సబ్బుల తయారీలో శిక్షణ ఇవ్వడం మొదలు పెట్టింది. శిక్షణ తీసుకున్న వారంతా సబ్బులు తయారు చేసి మార్కెట్లో విక్రయించి డబ్బులు సంపాదిస్తున్నారు. దీంతో వాళ్లకంటూ ఒక గుర్తింపుతోపాటు, సాధారణ అమ్మాయిల్లా జీవించగలుగుతున్నారు. సీమర్.. ఇప్పటిదాక ఇరవైమందికిపైగా సబ్బుల తయారీలో శిక్షణ ఇచ్చింది. యాసిడ్ బాధితుల గురించి తన స్నేహితులు, ఇతర పిల్లలకు చెబుతూ వారికి సాయం చేయాలని కోరుతోంది. ఇది చిన్నపనే అయినప్పటికీ వారి జీవితాల్లో పెద్ద మార్పుని తీసుకొస్తుంది సీమర్. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన బాధితులంతా సీమర్ శిక్షణతో ధైర్యాన్ని కూడగట్టుకొంటూ జీవితంపై కొత్త ఆశలతో ముందుకు సాగుతున్నారు. -
వివాహేతర సంబంధం కారణంగా మహిళపై యాసిడ్ దాడి
సాక్షి ప్రతినిధి, విజయవాడ/భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వితంతు మహిళపై ఓ ఆటోడ్రైవర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలుడు, యువతి సహా ముగ్గురికి గాయాలయ్యాయి. ఆదివారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. కొద్దిగంటల్లోనే నిందితుణ్ణి అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా తెలిపిన వివరాల ప్రకారం.. ఐతవరం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళకు 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆమెకు ఓ కుమారుడున్నాడు. భర్త మరణించడంతో ఆ మహిళ ఐతవరం వచ్చేసి తల్లిదండ్రుల వద్ద ఆశ్రయం పొందుతోంది. సుమారు 8 నెలల క్రితం నెల్లూరుకు చెందిన రాణింగారం మణిసింగ్ (32)తో ఆ మహిళకు ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. నెల్లూరులోనే ఆటో నడుపుతూ జీవనం సాగించే మణిసింగ్‌కు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీయడంతో ఆ మహిళ ఐతవరంలోనే వేరే ఇంటికి మారింది. ఆమె వద్దకు మణిసింగ్ తరుచూ వస్తుండేవాడు. ఇద్దరు పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకోగా.. మణిసింగ్‌కు క్షయ వ్యాధి సోకినట్టు తెలుసుకున్న సదరు మహిళ అతన్ని దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో కక్ష పెంచుకున్న మణిసింగ్ ఆమెను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు. నెల్లూరు నుంచే యాసిడ్ తెచ్చుకుని.. ఈ నెల 8వ తేదీ శనివారం నెల్లూరులో 100 మిల్లీలీటర్ల యాసిడ్ బాటిల్ కొనుగోలు చేసిన మణిసింగ్ మహిళ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ఇంట్లో ఆమె కుమారుడితో పాటు ఆమె సోదరి కుమార్తె ఉన్నారు. వారితో కలిసి మణిసింగ్ భోజనం చేసి అక్కడే నిద్రించాడు. ఆదివారం వేకువజామున 4 గంటలకు అందరూ నిద్రమత్తులో ఉండగా మణిసింగ్ తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను మహిళ ముఖంపై పోసి పరారయ్యాడు. ఈ ఘటనతో మహిళ శరీరం 20 శాతం గాయపడగా, ఆమె కుమారుడుకి, ఆమె సోదరి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితుల ఆర్తనాదాలతో చుట్టుపక్కల వారు లేచి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నందిగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నందిగామ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్న మణిసింగ్ను ఉదయం 10 గంటలకు అరెస్ట్ చేశారు. అతడిపై నాన్‌బెయిలబుల్ కేసులు కట్టారు. బాధితులకు అండగా ప్రభుత్వం యాసిడ్ దాడిలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. గొల్లపూడి ఆంధ్రా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. స్థానిక ఎమ్మెల్యే జగన్మోహనరావు బాధితుల్ని పరామర్శించారు. -
ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది...
ఎనిమిది రోజులు ఆసుపత్రిలో మా అక్క నరకం చూసింది. మంగళవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. మీరంతా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. మాట్లాడటంతో మేం చాలా ఆనందపడ్డాం త్వరలో కోలుకుం టుందని ఆశపడ్డాం. రాత్రి 12.30 గంటలకు చనిపోయినట్లు డాక్టర్ చెప్పడంతో కన్నీరు ఆగలేదు. ఇలా జరుగుతుందని అనుకోలేదు. యాసిడ్ దాడితో ఊపిరితిత్తులు మొత్తం కాలిపోయాయి. ఓ కన్ను కూడా పోయింది. ఏలూరు టౌన్: ఏలూరు గ్జేవియర్ నగర్ మోనాస్ట్రీ ప్రాంతంలో ఉంటున్న యడ్ల ఫ్రాన్సికపై ఈనెల 13న ఇద్దరు వ్యక్తులు యాసిడ్ దాడికి పాల్పడగా.. బాధితురాలు గుంటూరు మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆమె స్వగ్రామం దెందులూరుకు తరలించారు. ఈ నేపథ్యంలో ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో కేసును హత్య కేసుగా మారుస్తూ పోలీసుల కేసు నమోదు చేశారు. ఈ కేసును సెక్షన్ 302, 120(బీ), 341, 326–ఏ, రెడ్‌విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్3(2)(4) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ (పీవోఏ) యాక్ట్ 1989 అండ్ సెక్షన్ 6(1) ఆఫ్ పాయిజన్ యాక్ట్ –1919 కింద కేసు నమోదు చేశారు. కేవలం 15 రోజుల్లోనే చార్జిషీట్ దాఖలు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. కేసులో ఇప్పటికే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన తర్వాత బాధితురాలిని మెరుగైన వైద్యానికి విజయవాడ జీజీహెచ్, ఆధునిక వైద్యచికిత్సకు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి ఎంత ఖర్చయినా భరించి మంచి వైద్యచికిత్స అందించాలని తీవ్రంగా శ్రమించారు. యాసిడ్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతో మృత్యువుతో పోరాడిన ఫ్రాన్సిక చివరికు ఓడిపోయింది. -
రెండేళ్లుగా భర్తకు దూరం.. దారికాచి ఫ్రాన్సికపై యాసిడ్‌తో దాడి
ఏలూరు టౌన్ : ఏలూరు గ్జేవియర్ నగర్‌లోని ఒక డెంటల్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న యడ్ల ఫ్రాన్సికా (35)పై గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దారికాచి యాసిడ్‌తో దాడి చేశారు. ఆమెకు వివాహమై ఏడేళ్లు కాగా, ఆమె భర్త దెందులూరు గ్రామానికి చెందిన ఆంజనేయులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కెమికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా భర్త నుంచి విడిగా ఉంటోంది. ఏలూరు నగరంలో ఉంటున్న ఆమె.. స్థానిక స్మార్ట్ డెంటిస్ట్రీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రిలో విధులు ముగించుకొని ఒంటరిగా స్కూటీపై ఇంటికి వెళుతుండగా, ఆమె నివాసానికి సమీపంలో దారికాచిన ఇద్దరు ఆగంతకులు తమ బైక్‌తో అటకాయించారు. వెంటనే ఆమైపె యాసిడ్‌తో దాడి చేశారు. యాసిడ్ ప్రభావంతో మంటలు తాళలేక ఆమె కేకలు వేయడంతో నిందితులు అకక్కడినుంచి పరారయ్యారు. స్థానికులు గుర్తించి వెంటనే ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడి సమాచారం అందుకున్న ఏలూరు రేంజి డీఐజీ జేవీజీ అశోక్‌కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులను పరామర్శించారు. సంఘటన వివరాలు వారి నుంచి ఆరా తీశారు. అనంతరం సంఘటనాస్థలానికి చేరుకొని దాడి జరిగిన ప్రదేశాన్ని బాధితురాలి స్కూటీని, ఆమె నివాసాన్ని పరిశీలించారు. వారి తల్లిదండ్రులతో ఇంటివద్ద ఈ ఘటనపై ఆరా తీశారు. ప్రాథమిక వైద్యం అనంతరం ఆమెను మెరుగైన వైద్య సేవల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై డీఐజీ మాట్లాడుతూ పూర్తి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఆమె భర్త వైపు నుంచి.. అలాగే పరిచయమున్న ఇతర వ్యక్తులెవరైనా ఈ దాడికి పాల్పడ్డారా అనే వివరాలు సేకరిస్తున్నట్టు చెప్పారు. బాధితురాలికి 40 శాతం ముఖం కాలిపోయినట్టు వైద్యుల ద్వారా అందిన సమాచారం. బాధితురాలు ఆమె చెల్లి కుటుంబంతో పాటు ఏలూరులో ఉంటోంది. బాధితురాలి స్వస్థలం కూడా దెందులూరు అని, తల్లిదండ్రులు అక్కడే ఉంటున్నారని సమాచారం. -
రాజస్తాన్‌లో ఘోరం.. మహిళపై రేప్.. ఆపై సజీవదహనం
జైపూర్: రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ దుర్మార్గుడు దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెకు నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచింది. బార్మెర్ జిల్లాకు చెందిన దళిత మహిళ(30) ఈ నెల 6న రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన షకూర్‌ఖాన్ అనే వ్యక్తి బలవంతంగా లోపలికి ప్రవేశించాడు. ఆమెపై లైంగికదాడికి పాల్పడిన అనంతరం యాసిడ్ వంటి ద్రావకాన్ని ఒంటిపై పోసి, నిప్పంటించి పరారయ్యాడు. 50 శాతం గాయాలపాలైన బాధితురాలు జోథ్‌పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు నిందితుడు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అనుమానం వచ్చింది.. ఇంట్లో నిద్రపోతుండగా కోడలి ముఖంపై
తిరువొత్తియూరు(చెన్నై): కడలూరు జిల్లాలో కోడలిపై ఆసిడ్ పోసి హత్యాయత్నం చేసిన అన్నాడీఎంకే మహిళా నాయకురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా విరుదాచలానికి చెందిన కలివరదన్ భార్య ఆండాళ్ విరుదాచలం అన్నాడీఎంకే ఉప కార్యదర్శిగా ఉన్నారు. వీరి కుమారుడు ముకేష్ రాజ్. ఇతని భార్య కృతిక (26). వీరికి రిషిత (5), రిషిక (1) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో కృతికపై అనుమానం పెంచుకున్న అత్త ఆండాలు కోడల్ని తరచూ వేధింపులకు గురి చేసేది. ఆదివారం రాత్రి ఆండాళ్కు కృత్తికకు గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కృత్తిక ఇంటిలో నిద్రపోతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆండాలు టాయిలెట్‌కు ఉపయోగించే ఆసిడ్‌ను కృత్తిక ముఖంపై పోసి నోటిలో కూడా పోసి హత్య చేయడానికి ప్రయత్నించింది. కృత్తిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు దీనిపై విరుదాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృత్తికను చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఆండాలును అరెస్టు చేశారు. చదవండి: ఆర్టీసీ బస్సు బీభత్సం.. కండక్టర్ భర్తపై దూసుకెళ్లి.. -
25 ఏళ్లుగా సహజీవనం.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన మహిళ.. కోపంతో ఆమెపై..
ముంబై: 25 ఏళ్లుగా తనతో సహజీవనం చేసిన మహిళపై యాసిడ్ దాడి చేశాడు 62 ఏళ్ల వ్యక్తి. ఆమె ఇంట్లో నుంచి వెళ్లగొట్టిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో మహిళకు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మహారాష్ట్ర ముంబైలోని గిర్గావ్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది. నిందితుడి పేరు మహేశ్ పూజారి. బాధితురాలితో 25 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఆమెకు అప్పటికే పెళ్లై భర్త నుంచి విడిపోయింది. మహేశ్ కూడా ఆమె భార్య నుంచి విడిపోయాడు. దీంతో ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్‌ను తన ఇంట్లో నుంచి వెళ్లగొట్టింది మహిళ. రెండు రోజుల తర్వాత అతడు ఇంటికి యాసిడ్ బాటిల్‌తో తిరిగివచ్చాడు. శుక్రవారం వేకువజామున 5:30 గంటల సమయంలో ఆమె నీళ్లు తోడుకునేందుకు బయటకు రాగా యాసిడ్ చల్లాడు. దీంతో ఆమె తీవ్రగాయాలపాలైంది. పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్‌సభ సభ్యత్వం రద్దు.. -
ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయినా యువతి భయపడకుండా కారు ఎక్కేందుకు నిరాకరించింది. దీంతో అతడు ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పాండవ్ నగర్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో వరుసగా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 1న అంజలి అనే యువతి స్కూటీని ఢీకొట్టి ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనవరి 2న ఆదర్శ్ నగర్లో జరిగిన మరో దారుణ ఘటనలో శివకుమార్ అనే 20 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యవతిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటీకీ ఏదో విషయంలో గొడవపడి అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు -
నడి రోడ్డుపై అడ్డగించి మరీ..మహిళపై ఓ వ్యాపారి యాసిడ్ దాడి..
ఓ వ్యాపారి మహిళపై యాసిడ్ దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడింది. ఆ మహిళ రాకను గమనించి రోడ్డుపై కాపుకాసి మరీ దాడి చేశాడు నిందితుడు. ఈ ఘటన అస్సాంలోని ధేకియాజులిలోని రాఖ్యస్మారి రోడ్డు వద్ద ఆదివారం 3 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...నిందుతుడికి సదరు మహిళకి ఒకరికొకరు సుపరిచితులే. నిందితుడు వివాహితుడు కాగా ఆమె అవివాహితురాలు. ఇరువురు కొద్దిరోజులు సహజీవనం చేశారు. ఐతే గత కొద్దిరోజులుగా ఇరువురి మధ్య డబ్బుల విషయమై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు ఆ 30 ఏళ్ల మహిళపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను తేజ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. దాడికి పాల్పడిన నిందితుడు వ్యాపారి వాస్తుకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ బిశ్వ శర్మ తెలిపారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే భవనంలో విద్యార్థి ఆత్మహత్య.. ఏం జరిగింది?) -
నాపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందేమో: కంగనా రనౌత్
యువతులపై యాసిడ్ దాడులు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. దీంతో నటి కంగనా రనౌత్‌కు యాసిడ్ భయం పట్టుకుంది. బాలీవుడ్‌తో పాటు తమిళం, తెలుగు వంటి దక్షిణాది భాషల్లో నటిస్తూ సంచలన నటిగా ముద్ర వేసుకున్న కంగనా రనౌత్ తాజాగా తమిళంలో చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తున్నారు. ఏ విషయంలోనైనా ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అయితే ఎంత ధైర్యం కలిగిన వ్యక్తి అయినా తమ జీవితంలో జరిగిన భయంకర సంఘటనలు ఆందోళనకు గురి చేస్తూనే ఉంటాయి. నటి కంగనా రనౌత్ అందుకు అతీతం కాదు. ఈమె తన కుటుంబంలో జరిగిన యాసిడ్ దాడి గురించి తన ఇన్‌స్టా స్టోరీలో పేర్కొంటూ తన సోదరి మాదిరిగానే తనపైనా యాసిడ్ దాడి జరుగుతుందేమోనని భయపడుతున్నట్లు పేర్కొంది. తన సోదరి రంగోలి యాసిడ్ దాడికి గురైందని, ఆమెకు 52 శస్త్ర చికిత్సలు జరిగినట్లు గుర్తు చేసింది. ఆ సంఘటనలో తన సోదరి శారీరకంగా, మానసికంగా ఎంతో బాధింపునకు గురైందని చెప్పింది. ఆ సంఘటన తర్వాత తనపై కూడా యాసిడ్ దాడి జరుగుతుందేమేనని ప్రతిక్షణం భయపడుతున్నట్లు పేర్కొంది. దీంతో ఎవరైనా తన పక్కన వస్తుంటే ముఖం దాచుకుంటున్నానని తెలిపింది. -
Pratibha Naithani: యాసిడ్ సమాజానికి సర్జరీ
పిల్లలను దృష్టిలో పెట్టుకొని టీవీ కార్యక్రమాల్లో అసభ్యత, హింస చూపడాన్ని వ్యతిరేకించడంలో పేరొందారు ముంబై వాసి డాక్టర్ ప్రతిభా నైతాని. యాసిడ్ దాడి బాధితులకు ఉచితంగా కాస్మెటిక్ వైద్యం అందించడంతో పాటు, వారికి తగిన న్యాయం జరగాలంటూ ఆయా మంత్రిత్వ శాఖల చుట్టూ తిరుగుతూ, దోషులకు శిక్ష పడేలా చేశారు, చేస్తున్నారు. డాక్టర్ ప్రతిభ కష్టానికి ఫలితంగా చట్టం మారింది, దోషులకు శిక్షలు పెరిగాయి. యాసిడ్ దాడి బాధితుల జీవితాలు కాస్త తేలికయ్యాయి. అయితే, గడిచిన ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా యాసిడ్ దాడులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రతిభా నైతాని ఎన్నో విషయాలను మీడియా ముందుంచారు. ‘‘పంతొమ్మిదేళ్ల క్రితం.. ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ పద్మశ్రీ డాక్టర్ అశోక్ గుప్తాతో కలిసి పనిచేయడం ప్రారంభించాను. డాక్టర్ అశోక్ అప్పటికే తన పనితో పాటు సామాజిక సేవ కూడా చేస్తుండేవారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి పేద, గిరిజనులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా కాస్మెటిక్ సర్జరీలు చేస్తుండేవారు. వారి నుంచి స్ఫూర్తి పొందిన నేను, ఈ సర్జరీలలో సహాయంగా ఉండేదాన్ని. యాసిడ్ దాడి కేసులు మొదట్లో ఒకటో రెండో వచ్చేవి. తర్వాత్తర్వాత వీటి సంఖ్య పెరుగుతుండటం గమనించాను. వీరికి ఉచితంగా సర్జరీలు చేయడమొక్కటే సమస్యకు పరిష్కారం కాదనుకున్నాను. వీటిని అరికట్టేందుకు ఏదైనా చేయాలనుకున్నాను. దోషులకు శిక్షను పెంచాలి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖ, లా కమిష¯Œ వరకు ప్రదక్షిణలు చేశాను. ముంబై నుంచి ఢిల్లీకి తరచూ ప్రయాణించేదాన్ని. గతంలో యాసిడ్ దాడి దోషులకు శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. నిందితులకు కేవలం ఆరు నెలలు మాత్రమే బెయిలబుల్ శిక్ష ఉండేది. కానీ అమ్మాయి జీవితమంతా నరకమే. దీంతో పాటు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే మరిన్ని ఇబ్బందులు తప్పవని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించేవారు. దీంతో వారికి న్యాయం జరిగేది కాదు. కత్తి గాయం, యాసిడ్ మంట ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఒకరి శరీరంపై యాసిడ్ పోయడం హత్య కంటే ఘోరమైన నేరం. ఈ విషయంలో చేసిన సుదీర్ఘ పోరాటం తర్వాత, 2013లో ఐపిసి లో 32-6A, 32-6B సెక్షన్లు చేర్చబడ్డాయి. దీని ప్రకారం, నిందితుడు దోషిగా తేలితే, ఏడేళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడుతుంది. అపరాధి నుండి జరిమానా కూడా వసూలు చేయబడుతుంది. దీంతో బాధితురాలి కోసం ఎంతో కొంతైనా చేయగలిగామనే ధీమా వచ్చింది. బాధితులకు పునరావాసం ‘‘యాసిడ్ దాడి బాధితులు సమాజంలో జీవించడం కష్టం. ఈ అమ్మాయిలకు పని ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడరు. చాలా సందర్భాల్లో చికిత్స ఖర్చులు పెరిగి, ఇంటి నుంచి వెళ్లగొట్టడం వంటి ఘటనలు కూడా తెలిశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. యాసిడ్ దాడి బాధితులను వికలాంగుల కేటగిరీలో చేర్చాలని, విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ వంటి వికలాంగుల కోటాలో వచ్చే అన్ని సౌకర్యాలు వారికి కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ డిమాండ్‌ను నెరవేర్చడంలోనూ విజయం సాధించాం’’. ఉచిత వైద్య చికిత్స ‘‘యాసిడ్ దాడి బాధితులకు ప్రతి నగరంలో ఉచితంగా చికిత్స అందించాలన్నది మరో డిమాండ్. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి కేసులకు ప్రత్యేకంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం లేదు. ఏ ఆసుపత్రి అయినా, ఎక్కడ ఉన్నా ఉచితంగా ప్లాస్టిక్ సర్జరీ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశాం. ఈ మేరకు యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ సుప్రీంకోర్టులో పిటిష¯Œ దాఖలు చేశారు. వారికి ఉచితంగా శస్త్ర చికిత్స సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అందుబాటులో ఉండకూడదు బహిరంగంగా విక్రయించే యాసిడ్‌కు సంబంధించి, దాని విక్రయాలను నియంత్రించాలని డిమాండ్ చేశాం. సాధారణ దుకాణాల్లో యాసిడ్ ఉండకూడదు. ఎప్పుడు, ఎవరు కొన్నారు, దేనికి వినియోగిస్తున్నారనేదానిపై ఓ కన్నేసి ఉంచాలి. ఈ విధానం వల్ల యాసిడ్ దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ప్రాణాలతో పోరాటం యాసిడ్ దాడి బాధను భరిస్తూ జీవితంలో ముందుకు సాగిన అమ్మాయిలు ఎందరో ఉన్నారు. అలాంటి అమ్మాయిలలో లలిత ఒకరు. దాడి జరిగి, తీసుకువచ్చినప్పుడు, ఆమె గాయాల వాసనకు, జనం క్లినిక్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనేక శస్త్రచికిత్సల తర్వాత కోలుకుంది. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతోంది. పెళ్లి చేసుకొని, ఒక బిడ్డకు తల్లి అయ్యింది. ఏ అమ్మాయీ యాసిడ్ బారిన పడకుండా అందరూ ఆనందంగా జీవించాలి’ అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తారీ వైద్యురాలు. -
యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు ఇవ్వాలి.. హైకోర్టు ఆదేశం
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. యాసిడ్ దాడి బాధితురాలికి రూ.35 లక్షలు పరిహారంగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమెకు అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని 2017లోనే చెప్పింది న్యాయస్థానం. యూఎస్ నగర్ జిల్లాకు చెందిన ఈ యువతిపై 2014లో ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. అప్పడు ఆమె 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ చెవి పూర్తిగా కాలిపోయింది. మరో చెవి 50 శాతం దెబ్బతింది. మొహం కూడా కాలిపోయింది. అయితే ప్రభుత్వం ఈమెకు సరైన పరిహారం అందించలేదు. అయితే బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు వైద్య ఖర్చులు ఎంతైనా, దేశంలో ఎక్కడ చికిత్స అందించినా ప్రభుత్వమే భరించాలని 2017లోనే కోర్టు ఆదేశించింది. కానీ ఈమెకు పరిహారం కూడా అందించాలని 2019లో ఓ న్యాయవాది పిటిషన్ దాఖలు చేసింది. యువతికి ప్రభుత్వం భద్రత కల్పించలేకపోయిందని, సాయం అందించాలని కోరింది. రాజకీయాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం యాసిడ్ దాడి బాధితురాలికి రూ.లక్షలు సాయంగా సమకూర్చలేదా? అని పిటిషన్లో పేర్కొంది. వాదనలు విన్న న్యాయస్థానం యాసిడ్ దాడి బాధితురాలికి ప్రభుత్వం రూ.35 లక్షలు సాయంగా అందించాలని చెప్పింది. ఆమెకు అయిన వైద్య ఖర్చులతో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. దేశంలో యాసిడ్ దాడులకు గురవుతున్న ఇతర మహిళలకు కూడా ఇదే విధంగా పరిహారం అందించాలని బాధితురాలి తరఫు న్యాయవాది స్నిగ్ధ తివారి డిమాండ్ చేశారు. చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో సహజీవనం.. పెళ్లి చేసుకోమని అడిగితే..