ఏలూరు యాసిడ్‌ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు | Life imprisonment for three in Eluru acid attack case | Sakshi
Sakshi News home page

ఏలూరు యాసిడ్‌ దాడి కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

Published Thu, Oct 12 2023 5:31 AM | Last Updated on Thu, Oct 12 2023 5:52 AM

Life imprisonment for three in Eluru acid attack case - Sakshi

ఏలూరు టౌన్‌: ఏలూరులో మహిళపై యాసిడ్‌ దాడికి తెగబడిన కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు జిల్లా ఎస్సీ, ఎస్టీ స్పెషల్‌ కోర్టు న్యాయమూర్తి ఎం.సునీల్‌కుమార్‌ సంచలన తీర్పు వెలువరించారు. యాసిడ్‌ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎడ్ల ఫ్రాన్సికా కుటుంబానికి సత్వర న్యాయం అందిస్తూ కేవలం 117 రోజుల్లోనే తీర్పు వెలువరించారు.

జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి మీడియాకు బుధవారం వెల్లడించారు. ఏలూరు కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు బోడ నాగసతీ‹Ùకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా, యాసిడ్‌ దాడికి పాల్పడిన ఏలూరుకు చెందిన బెహరా మోహన్, బూడిద ఉషాకిరణ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.15 వేల చొప్పున జరిమానా విధించారు. యాసిడ్‌ విక్రయించిన ఏలూరు గడియార స్తంభం ప్రాంతానికి చెందిన కొల్లా త్రివిక్రమరావు (68)కు రూ.1,500 జరిమానా విధించారు. 

దాడి జరిగిందిలా.. 
మృతురాలు ఫ్రాన్సికా భర్తకు దూరంగా ఉంటూ నగరంలోని ప్రైవేట్‌ దంత వైద్యశాలలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. కాగా.. ఫ్రాన్సికా సోదరితో ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన బోడ నాగసతీష్‌ సన్నిహితంగా ఉండేవాడు. దీనిని ఫ్రాన్సికా వ్యతిరేకించింది. దీంతో కక్ష పెంచుకున్న సతీ‹Ù.. ఫ్రాన్సికాను హతమార్చేందుకు నగరానికి చెందిన మోహన్, ఉషాకిరణ్‌ అనే వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు. వారిద్దరూ ఈ ఏడాది జూన్‌ 13న రాత్రి 8.30 గంటల సమయంలో ఫ్రాన్సికాపై యాసిడ్‌తో దాడి చేశారు.

 గాయపడిన ఆమెను ఏలూరు జీజీహెచ్‌లో చేర్పించగా.. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని విజయవాడ జీజీహెచ్‌కు, ఆ తరువాత మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తల్లి ధనలక్ష్మి ఏలూరు దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. సీఐ ఇంద్ర శ్రీనివాస్‌ కేసు నమోదు చేశారు. కాగా, ఫ్రాన్సికాను బతికించాలనే తపనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితురాలి చికిత్స కోసం రూ.20 లక్షలు మంజూరు చేశారు. అయితే.. 8 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ఆమె జూన్‌ 21న మృతి చెందింది.

సత్వర విచారణతో నిందితులకు కఠిన శిక్షలు 
డీజీపీ కేవీ రాజేంద్రనాద్‌రెడ్డి ఆదేశాలతో కేసు సత్వర విచారణ బాధ్యతను ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులుకు అప్పగించారు. నిందితుల్ని అరెస్ట్‌ చేసి కేవలం 21 రోజుల్లోనే చార్జ్‌ïÙట్‌ దాఖలు చేసి, పటిష్టమైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. సునీల్‌కుమార్‌ కేవలం 117 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.శ్రీవాణిబాయ్‌ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రవేశ పెట్టడంతో కీలకంగా వ్యవహరించిన దిశ సీఐ ఇంద్ర శ్రీనివాస్, విశ్వం, డీఎస్పీ శ్రీని­వాసులు, డీసీఆర్‌బీ సీఐ దుర్గాప్రసాద్‌ను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement