సాక్షి, విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. ఓ అనుమానపు భర్త భార్యపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లిని కాపాడేందుకు వెళ్లిన కుమార్తె కూడా గాయపడింది. అదృష్టవశాత్తూ యాసిడ్ బాత్ రూం క్లీనింగ్‌కు ఉపయోగించేది కావడంతో గాయాల తీవ్రత తగ్గింది. వివరాల్లోకెళ్తే.. విశాఖలోని శివాజీ పాలెంలో ఈశ్వరరావు అనే వ్యక్తి భార్య దేవి, కుమార్తె గాయత్రి కలిసి జీవిస్తున్నాడు. కాగా ఈశ్వరరావుకు భార్యపై అనుమానం. దీంతో నిత్యం ఇంట్లో గొడవలు జరిగేవి. (మరదలితో రెండో పెళ్లి.. నిప్పంటించిన మొదటి భార్య)
ఇదే తరుణంలో శనివారం ఉదయం భార్య దేవిపై ఈశ్వరరావు దాడికి పాల్పడ్డాడు. బాత్రూమ్ క్లీనింగ్‌కు ఉపయోగించే యాసిడ్‌ను భార్యపై పోశాడు. ఆ సమయంలో తల్లిని కాపాడేందుకు కుమార్తె గాయత్రి ప్రయత్నించగా ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా పెయింటింగ్ పని చేసే ఈశ్వరరావు మద్యానికి బానిసై 500 రూపాయలను అడిగారు. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదంతో అప్పటికే భార్యపై అనుమానం ఉన్న ఈశ్వరరావు హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై ఫిర్యాదును అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment