
బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ రేటింగ్స్ గూగుల్ ప్లేస్టోర్లో భారీగా పడిపోయాయి. టిక్‌టాక్ రేటింగ్ 4.6 నుంచి రెండుకు దిగిరాగా, టిక్ టాక్ లైట్ రేటింగ్ 1.1కి పడింది. యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉన్న కారీ మినాటి యూట్యూబ్ వర్సస్ టిక్ టాక్ ది ఎండ్ పేరుతో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనితోపాటు టిక్ టాక్ స్టార్ ఫైజల్ సిద్ధిఖి మహిళలను కించపర్చేలా ఉన్న ఓ వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్ ను నిషేధించాలంటూ భారత యూజర్లు ట్విట్టర్లో ట్వీట్లుచేయడం టిక్‌టాక్‌కు నష్టం చేకూర్చాయి. టిక్ టాక్‌ను నిషేధించాలంటూ ప్రధానికి లేఖలు రాస్తామని జాతీయ మహిళా కమిషన్ ప్రకటించడమూ రేటింగ్స్ పడటానికి మరో కారణం.
Comments
Please login to add a commentAdd a comment