video share
-
దయచేసి అలా చేయకండి, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవు
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది. చదవండి: మెగా ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'! ‘‘కథ రీత్యా ఎక్కువమంది జనం ఉండే ఓపెన్ ఏరియాల్లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో మా సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి సహకరించండి’’ అని శంకర్ అండ్ కో ఓ నోట్‌ను విడుదల చేసింది. -
ఆ బాలుడి ఆత్మవిశ్వాసం నచ్చింది
జగిత్యాల: జగిత్యాలకు చెందిన ఓ బాలుడి మాటలకు కేటీఆర్ ఫిదా అయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియోను షేర్ చేశారు. జగిత్యాలకు చెందిన బండివారి ప్రకాశ్ ఓల్డ్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. చదువుకుంటూనే ఉదయం సమయంలో ఇంటింటా దినపత్రికలు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రకాశ్‌ను ప్రశంసించి.. చదువుకునే వయస్సులో పనిచేస్తున్నావని అడుగగా, తప్పేముందని తిరిగి ప్రశ్నించాడు. ‘ఈ వయస్సులో నీవు కష్టపడాల్సి వస్తోంది’అని సదరు వ్యక్తి అనగా, కష్టపడితే ఏమవుతుంది, భవిష్యత్‌లో నాకే మేలు జరుగుతుందని’బదులిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ధైర్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, ప్రకాశ్ ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ కూడా ముగ్ధుడయ్యారు. ఆ చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరారు. కష్టపడుతూ చదువుకోవడం అభినందనీయమని, బాలుడి ఆత్మవిశ్వాసం తనకు ఎంతో నచ్చిందని ట్వీట్ చేశారు. బాలుడి తండ్రి క్యాబ్ నడుపుతుండగా, తల్లి అనూష టైలరింగ్ చేస్తుంటుంది. -
2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి
న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం నుంచైనా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కోరారు. డయ్యూలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఘోగ్లా బీచ్‌లో జాగింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు. ఒక కష్టతరమైన ఏడాదిని పూర్తిచేసుకొని 2021లోకి అడుగుపెడుతన్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని ట్వీట్ చేశారు. (సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు ) Jogged on the pristine Ghoghla beach in Diu this morning. As we enter 2021, after a difficult year that has tested us all, let us rise together and make an endeavour to remain fit and healthy. May the coming year bring good health and prosperity in our lives. pic.twitter.com/dcQjZxB4Xk — President of India (@rashtrapatibhvn) December 28, 2020 ఆదివారం ఘోగ్లా బీచ్‌ను సందర్శించిన ఆయన డయ్యూలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా డయ్యూలో కల్చరల్ హెరిటేజ్‌ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రామ్‌నాథ్ కోవింద్ ప్రశంసించారు. ఇటీవలే నిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాంతానికి "బ్లూ ఫ్లాగ్" ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా రామ్‌నాథ్ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్తాపన చేశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం నేడు ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. (ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్ పవార్) -
పాతాళానికి టిక్ టాక్ రేటింగ్స్
బెంగళూరు: సోషల్ మీడియా దిగ్గజం టిక్‌టాక్ రేటింగ్స్ గూగుల్ ప్లేస్టోర్‌లో భారీగా పడిపోయాయి. టిక్‌టాక్ రేటింగ్ 4.6 నుంచి రెండుకు దిగిరాగా, టిక్ టాక్ లైట్ రేటింగ్ 1.1కి పడింది. యూట్యూబ్ లో ఫాలోయింగ్ ఉన్న కారీ మినాటి యూట్యూబ్ వర్సస్ టిక్ టాక్ ది ఎండ్ పేరుతో ఓ వీడియో పోస్ట్ చేశారు. దీనితోపాటు టిక్ టాక్ స్టార్ ఫైజల్ సిద్ధిఖి మహిళలను కించపర్చేలా ఉన్న ఓ వీడియో పోస్ట్ చేశారు. టిక్ టాక్ ను నిషేధించాలంటూ భారత యూజర్లు ట్విట్టర్లో ట్వీట్లుచేయడం టిక్‌టాక్‌కు నష్టం చేకూర్చాయి. టిక్ టాక్‌ను నిషేధించాలంటూ ప్రధానికి లేఖలు రాస్తామని జాతీయ మహిళా కమిషన్ ప్రకటించడమూ రేటింగ్స్ పడటానికి మరో కారణం. -
చెట్టులెక్కగలను
లాక్ డౌన్ సమయాన్ని కూతురితో సరదాగా గడుపుతున్నారు మంచు లక్ష్మి. ఇంటి ముందు ఉన్న మామిడి చెట్టు ఎక్కిన వీడియోను పోస్ట్ చేశారామె. ‘‘నా చిన్నప్పటి నుంచి ఈ మామిడి చెట్టు మా ఇంటి ముందే ఉంది. కానీ ఎప్పుడూ హాయ్ చెప్పి, మా పరిసరాలను చల్లగా ఉంచుతున్నందుకు థ్యాంక్స్ చెప్పే వీలు దొరకలేదు. ఈ లాక్ డౌన్ లో ఆ చాన్స్ దొరికింది. ఇన్ని రోజులూ మన చుట్టూ ఉన్నా మనం పట్టించుకోకుండా ఉన్నవాటికి కృతజ్ఞతలు తెలపాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు లక్ష్మి. సరదాగా చెట్టు ఎక్కి, కుమార్తె విద్యా నిర్వాణకు మామిడికాయలు కోసిపెట్టారామె. ‘చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా’ అని ‘చెంచులక్ష్మి’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుని అంజలీదేవి అడిగితే... ‘చెట్టులెక్కగలనే ఓ చెంచిత..’ అంటారాయన. లక్ష్మి కూడా చెట్టులెక్కగలను అని నిరూపించుకున్నారు. -
లాక్డౌన్ చెఫ్‌లు
లాక్డౌన్ సమయాల్లో ఇంట్లోనే ఉండిపోవడంతో ఇంటి పనుల్లో తమ వంతు సహాయం చేస్తున్నారు స్టార్స్. తమ ప్రతిభను బయటకు తీసుకొస్తున్నారు. ఈ మధ్యే రామ్‌చరణ్, మంచు విష్ణు చెఫ్‌లుగా మారారు. తన మిసెస్ కోసం రామ్‌చరణ్ డిన్నర్ తయారు చేస్తే, ఫ్యామిలీ కోసం సరదాగా కోకోనట్ చికెన్ తయారు చేశారు మంచు విష్ణు. ‘‘భర్తలందరూ వినండి, మిస్టర్ సి. (చరణ్‌ని ఉపాసన అలానే పిలుస్తారు) నాకోసం డిన్నర్ తయారు చేశారు. డిన్నర్ పూర్తయిన తర్వాత అవి శుభ్రం కూడా చేశారు. ఇలాంటి చిన్న చిన్న పనులే అతన్ని నా హీరోని చేస్తాయి’’ అని ట్వీట్ చేయడంతో పాటు చరణ్ వంట చేస్తున్న వీడియోను ఉపాసన షేర్ చేశారు. లాక్డౌన్ పూర్తయ్యేలోగా వంటలో మాస్టర్ అవుతానేమో? అంటున్నారు విష్ణు. వంట చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, ‘‘కొబ్బరి బోండం లోపల చికెన్ రైస్‌ని బేక్ చేశాను. లాక్డౌన్ పూర్తయ్యేసరికి కొత్త కొత్త వంటకాల రెసిపీల పేటెంట్ హక్కులు తీసుకోవాల్సి ఉంటుందేమో?’’ అన్నారు విష్ణు. తనయుడు వంట చేస్తుంటే మోహన్‌బాబు పక్కనే ఉండి చూస్తున్నారు. -
నన్ను రక్షించండి – ఆండ్రూ
లాక్ డౌన్ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొచీవ్. ఈ మధ్యే ఆండ్రూ గిన్నెలు శుభ్రం చేస్తున్న వీడియో షేర్ చేసి ‘‘ఈ ఖాళీ సమయంలో భర్తలందరూ గిన్నెలు శుభ్రం చేయాలి’’ అనే సరదా ఛాలెంజ్ విసిరారు శ్రియ. తాజాగా మరో సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో ‘‘నా భార్య నుంచి నన్ను రక్షించండి’’ అంటున్నారు ఆండ్రూ. విషయం ఏంటంటే... ‘‘అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు పాటించండి, ఈ సమయాల్లోనూ మా కోసం పని చేస్తున్న అందరికీ ధన్యవాదాలు, దయచేసి బయటకు రావద్దు’’ అనే సందేశాలను పేపర్ మీద రాసి , చూపిస్తున్న వీడియోను పంచుకున్నారు శ్రియ. ఈ వీడియోలో శ్రియ ఆ పేపర్లను చూపిస్తున్నప్పుడు ఆమె భర్త ఆండ్రూ ఆమె వెనకే ఉండి ‘‘శ్రియ ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది, రోజంతా నాతో పనులు చేయిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఆమె నుంచి నన్ను రక్షించండి. లాక్డౌన్ త్వరగా ముగిస్తే బావుండు’’ అని రాసి ఉన్న పేపర్ని చూపించారు. లాక్ డౌన్ సమయాన్ని ఇద్దరూ ఇలా సరదా సరదాగా గడిపేస్తున్నారు. -
ఇంట్లో ఉండండి
‘‘ఇప్పటికైనా మీకు అర్థం అయ్యుంటుంది.. ప్రకృతిని గౌరవించాలని. ఏదో ఒక మహత్తర శక్తి మనల్ని నడిపిస్తోందని అర ్థం అయ్యుంటుంది. పెద్దల మాటల్ని గౌరవించకపోతే ఏం నష్టం జరుగుతుందనేది మీకు తెలిసి ఉంటుంది. అయినా కూడా ఓ చిన్న కథ’’ చెబుతా అంటూ సోమవారం ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఓ వీడియో షేర్ చేశారు. దాని సారాంశం ఈ విధంగా... ‘‘భారతం, భాగవతం, రామాయణంలను మీరు చదివి ఉంటారు. రామాయణంలో అన్నదమ్ములైన వాలి, సుగ్రీవుడు గొడవపడ్డారు. సుగ్రీవుడు ఓడిపోయాడు.. వెంటనే మళ్లీ వాలిని యుద్ధానికి పిలిచాడు సుగ్రీవుడు. ‘ఏవండీ.. ఇప్పుడే యుద్ధంలో ఓడి వెళ్లాడు సుగ్రీవుడు. రక్తపు మరకలు కూడా ఆరకముందే మళ్లీ మిమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో ఒక మర్మం ఉంది.. వద్దు’ అని వాలి భార్య అతనితో చెబుతుంది. భార్య అంటే అర్ధాంగి.. ఆమె మాట వినాలి. కానీ వినకుండా యుద్ధానికి వెళ్లాడు వాలి. అంటే.. వినాశకాలే విపరీత బుద్ధి. మంచి రుచించలేదు. వాలి వెళ్లాడు.. యుద్ధంలో ఓడిపోయాడు.. చనిపోయాడు. సీతాదేవి కూడా అంతే.. లక్ష్మణుడు గీసిన గీత దాటొద్దు అంటే వినలేదు.. దాటింది.. కష్టాలు పడింది. అందుకే పెద్దల మాటలు గౌరవించాలి. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదిగారి నుంచి ప్రతి ఒక్కరూ చెబుతున్నట్లు మీరు ఇంట్లో ఉండండి.. సుఖంగా ఉండండి. ఈ కరోనా వ్యాధి వెళ్లిపోవాలని భగవంతుణ్ణి ప్రార్థించండి. బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు నడుచుకోవద్దని చెబుతున్నా ఎవరూ వినకుండా వాళ్ల ఇష్టప్రకారం నడుచుకుంటున్నారు.. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పెద్దల మాటల్ని గౌరవించినప్పుడే మనం బాగుంటాం, మన ఇరుగు పొరుగు వారు బాగుంటారు, రాష్ట్రం బాగుంటుంది.. మొత్తం ప్రపంచం బాగుంటుంది. అతి త్వరలో ఈ కరోనా నుంచి మనందరం తప్పించుకుని క్షేమంగా ఉండాలని, పెద్దల మాటల్ని గౌరవించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా. -
కొత్త లుక్
ఇస్రోకి (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) చెందిన ప్రముఖ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. టైటిల్ రోల్లో మాధవన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బీజీగా ఉన్నారాయన. ఈ మేకోవర్‌కు చెందిన ఓ వీడియోను మాధవన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘నా క్యారెక్టర్‌కు చెందిన కొత్త లుక్ కోసం రెడీ అవుతున్నాను. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. కాగా అనంత్ మహాదేవన్‌తో పాటు హీరో మాధవన్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండటం విశేషం. ఈ చిత్రాన్ని సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా కాకుండా మాధవన్, అనుష్క ప్రధాన తారలుగా ‘సైలెన్స్’ అనే కొత్త చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. -
గొడ్డలితో హెయిర్ కట్.. షాకింగ్ వీడియో!
-
గొడ్డలితో హెయిర్ కట్.. షాకింగ్ వీడియో!
సాధారణంగా హెయిర్ కట్ అంటే ఎలా చేస్తారు? కత్తెర, దువ్వెన పట్టుకుని చేస్తారు. అదే గుండు గీయాలంటే బ్లేడు ఉపయోగిస్తారు. అంతవరకు మాత్రమే మనకు తెలుసు. కానీ, ఎక్కడో తెలియదు గానీ ఒక దేశంలో గొడ్డలి, సుత్తి పట్టుకుని హెయిర్ కట్ చేస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా షేర్ అవుతోంది. ఒక కుర్రాడు హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లి కూర్చుంటే, అక్కడి వ్యక్తి ఒక గొడ్డలికి బాగా పదును పెట్టి, దాన్ని సుత్తితో కొడుతూ కుర్రాడికి హెయిర్ కట్ చేస్తాడు. అతడు కూడా ఏమాత్రం భయం లేకుండా అలాగే చేయించుకుంటాడు. ఏమాత్రం గొడ్డలి కోణం మారినా, సుత్తి దెబ్బ కాస్త గట్టిగా తగిలినా కుర్రాడి ప్రాణాలకే ప్రమాదం. అయినా కూడా ఇద్దరూ ఏమాత్రం చలించకుండా అలాగే హెయిర్ కట్ మొత్తం పూర్తి చేసేశారు. అది కూడా చుట్టూ బాగా తక్కువ జుట్టు ఉంచి, మంచి షేప్‌లో కట్ చేయడం విశేషం. గత కొంత కాలంగా ఈ వీడియో షేర్ అవుతోందని ఫేస్బుక్ యూజర్లు చెబుతున్నారు. అయితే ఎప్పుడూ ఇలా గొడ్డలి సాయంతో హెయిర్ కట్ చేసేవాళ్లను మాత్రం ప్రత్యక్షంగా చూడలేదని అంటున్నారు. -
సచిన్ వీడియోకు అపూర్వ స్పందన
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ముంబై పోలీసులపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. భారీ వర్షంలో పోలీసులను నిర్వహిస్తున్న విధులను వీడియో తీసి తన ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘ఎండావాన లెక్క చేయకుండా మన భద్రత కోసం పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని కామెంట్ పెట్టాడు. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నాడు. పోలీసులు భారీ వర్షంలో ట్రాఫిక్ నియంత్రిస్తున్న దృశ్యాలు, ‘మీ భద్రతకు మేము అంకితం’ అంటూ ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు సచిన్ చిత్రీకరించిన వీడియోలో ఉన్నాయి. సచిన్ ఫేస్ బుక్ లో షేర్ చేసిన వీడియాకు అపూర్వ స్పందన వచ్చింది. 15 గంటల్లో 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 40 వేల మందిపైగా స్పందించారు. ట్విట్టర్ లో 1600 సార్లు రీట్వీట్ చేశారు. 7800 మంది లైక్స్ కొట్టారు. తమ పనితీరుకు మెచ్చుకుంటూ సచిన్ వీడియో షేర్ చేసినందుకు అతడికి ముంబై పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. వాతావరణం మారినా, ముంబై నగరానికి తమ సేవల్లో ఎటువంటి మార్పు ఉండబోదని ట్వీట్ చేశారు. Come rain or shine @mumbaipolice is truly dedicated to our safety&well being (even in the rains) I salute them all! pic.twitter.com/jHpmCdzBPk — sachin tendulkar (@sachin_rt) 20 September 2016 @sachin_rt Thank You Mr Tendulkar . The weather may change, but, our commitment to serve the city will remain unaffected. https://t.co/dbhAo2N3NY — Mumbai Police (@MumbaiPolice) 20 September 2016