శ్రియ, ఆండ్రూ కొచీవ్
లాక్ డౌన్ సమయాన్ని సరదాగా గడుపుతున్నారు శ్రియ, ఆమె భర్త ఆండ్రూ కొచీవ్. ఈ మధ్యే ఆండ్రూ గిన్నెలు శుభ్రం చేస్తున్న వీడియో షేర్ చేసి ‘‘ఈ ఖాళీ సమయంలో భర్తలందరూ గిన్నెలు శుభ్రం చేయాలి’’ అనే సరదా ఛాలెంజ్ విసిరారు శ్రియ. తాజాగా మరో సరదా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో ‘‘నా భార్య నుంచి నన్ను రక్షించండి’’ అంటున్నారు ఆండ్రూ. విషయం ఏంటంటే... ‘‘అందరూ ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తలు పాటించండి, ఈ సమయాల్లోనూ మా కోసం పని చేస్తున్న అందరికీ ధన్యవాదాలు, దయచేసి బయటకు రావద్దు’’ అనే సందేశాలను పేపర్ మీద రాసి , చూపిస్తున్న వీడియోను పంచుకున్నారు శ్రియ. ఈ వీడియోలో శ్రియ ఆ పేపర్లను చూపిస్తున్నప్పుడు ఆమె భర్త ఆండ్రూ ఆమె వెనకే ఉండి ‘‘శ్రియ ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది, రోజంతా నాతో పనులు చేయిస్తూ ఉంటుంది. ప్లీజ్ ఆమె నుంచి నన్ను రక్షించండి. లాక్‌డౌన్ త్వరగా ముగిస్తే బావుండు’’ అని రాసి ఉన్న పేపర్‌ని చూపించారు. లాక్ డౌన్ సమయాన్ని ఇద్దరూ ఇలా సరదా సరదాగా గడిపేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment