సచిన్ వీడియోకు అపూర్వ స్పందన
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ముంబై పోలీసులపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. భారీ వర్షంలో పోలీసులను నిర్వహిస్తున్న విధులను వీడియో తీసి తన ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ‘ఎండావాన లెక్క చేయకుండా మన భద్రత కోసం పోలీసులు అంకిత భావంతో పనిచేస్తున్నారని కామెంట్ పెట్టాడు. పోలీసులకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నాడు. పోలీసులు భారీ వర్షంలో ట్రాఫిక్ నియంత్రిస్తున్న దృశ్యాలు, ‘మీ భద్రతకు మేము అంకితం’ అంటూ ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు సచిన్ చిత్రీకరించిన వీడియోలో ఉన్నాయి.
సచిన్ ఫేస్ బుక్ లో షేర్ చేసిన వీడియాకు అపూర్వ స్పందన వచ్చింది. 15 గంటల్లో 6 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 40 వేల మందిపైగా స్పందించారు. ట్విట్టర్ లో 1600 సార్లు రీట్వీట్ చేశారు. 7800 మంది లైక్స్ కొట్టారు. తమ పనితీరుకు మెచ్చుకుంటూ సచిన్ వీడియో షేర్ చేసినందుకు అతడికి ముంబై పోలీసులు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. వాతావరణం మారినా, ముంబై నగరానికి తమ సేవల్లో ఎటువంటి మార్పు ఉండబోదని ట్వీట్ చేశారు.
Come rain or shine @mumbaipolice is truly dedicated to our safety&well being (even in the rains) I salute them all! pic.twitter.com/jHpmCdzBPk
— sachin tendulkar (@sachin_rt) 20 September 2016
@sachin_rt Thank You Mr Tendulkar . The weather may change, but, our commitment to serve the city will remain unaffected. https://t.co/dbhAo2N3NY
— Mumbai Police (@MumbaiPolice) 20 September 2016