2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి | President Kovind Shares Video Of Jog On Diu Beach | Sakshi
Sakshi News home page

జాగింగ్‌  వీడియోను షేర్‌ చేసిన కోవింద్‌

Published Mon, Dec 28 2020 2:19 PM | Last Updated on Tue, Dec 29 2020 9:48 AM

President Kovind Shares Video Of Jog On Diu Beach - Sakshi

న్యూఢిల్లీ : వచ్చే సంవత్సరం నుంచైనా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ కోరారు.  డయ్యూలో నాలుగు రోజుల పర్యటనలో ఉన్న ఆయన సోమవారం ఘోగ్లా బీచ్‌లో జాగింగ్ చేస్తున్న వీడియోను పంచుకున్నారు.  ఒక కష్టతరమైన ఏడాదిని పూర్తిచేసుకొని 2021లోకి  అడుగుపెడుతన్న సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ప్రయత్నం చేద్దాం అని ట్వీట్‌ చేశారు.  (సీఎం రావత్‌కు అస్వస్థత, ఎయిమ్స్‌కు తరలింపు )

ఆదివారం ఘోగ్లా బీచ్‌ను సందర్శించిన ఆయన డయ్యూలో లైట్ అండ్ సౌండ్ షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా డయ్యూలో కల్చరల్ హెరిటేజ్​ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, స్వచ్ఛత కోసం స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను  రామ్​నాథ్​ కోవింద్ ప్రశంసించారు. ఇటీవలే నిష్ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాంతానికి "బ్లూ ఫ్లాగ్" ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సంగతి తెలిసిందే.  పర్యటనలో భాగంగా రామ్​నాథ్ శనివారం పలు  అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్తాపన చేశారు. నాలుగు రోజుల పర్యటన అనంతరం నేడు ఆయన  ఢిల్లీకి బయలుదేరనున్నారు. (ఆ పదవిపై ఆసక్తి లేదు: శరద్‌ పవార్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement