
రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రసుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ లొకేషన్స్ ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై చిత్రబృందం స్పందించింది.
చదవండి: మెగా ఫాన్స్‌కు గుడ్ న్యూస్.. అక్కడ కూడా రిలీజ్ కానున్న 'ఆచార్య'!
‘‘కథ రీత్యా ఎక్కువమంది జనం ఉండే ఓపెన్ ఏరియాల్లో మా సినిమా షూటింగ్ జరుగుతోంది. దీంతో మా సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీసి, చట్టవిరుద్ధంగా షేర్ చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి. ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడినట్లయితే మేం తీసుకోబోయే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారు. దయచేసి సహకరించండి’’ అని శంకర్ అండ్ కో ఓ నోట్‌ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment