రామ్ చరణ్ సినిమాకు రూ.200 కోట్ల భారీ ఆఫర్ | Ram Charan Shankar movie Got Huge Offer For Non Theatrical Rights | Sakshi
Sakshi News home page

రామ్ చరణ్ సినిమాకు రూ.200 కోట్ల భారీ ఆఫర్

Published Mon, Jan 17 2022 11:08 PM | Last Updated on Mon, Jan 17 2022 11:16 PM

Ram Charan Shankar movie Got Huge Offer For Non Theatrical Rights - Sakshi

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్‌ డైరక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం వస్తోన్న విషయం తెలిసిందే. ఇక దానికి తోడు ఆ చిత్రాన్ని దిల్ రాజు  నిర్మాణంలో వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ఏంటంటే ఆ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ఓ ప్రముఖ సంస్థ దాదాపు రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement