గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రామ్ చరణ్(Ram Charan) మాట్లాడుతూ.. ‘శంకర్ గారితో సినిమా చేయడం నా అదృష్ణం. ఆర్ఆర్ఆర్ టైంలో ఉన్నప్పుడే దిల్ రాజు గారు నాకు శంకర్ గారి సినిమా గురించి చెప్పారు. శంకర్ గారు కథ చెబుతారు వినండి అని దిల్ రాజు గారు అన్నారు. నేను వెంటనే షాక్ అయ్యాను. శంకర్ గారు చెప్పిన కథ అద్భుతంగా అనిపించింది. ఆయన ప్రతీ విషయంలో ఎంతో పర్టిక్యులర్‌గా ఉంటారు. ప్రతీ దాన్ని ఎంతో పర్ఫెక్ట్‌గా చేయాలని చూస్తుంటారు.
(చదవండి: 72 రోజుల్లోనే షూటింగ్ పూర్తి.. ఐదు నిమిషాలే వృథా!)
రాజమౌళి గారు, శంకర్ గారు ఇద్దరూ కూడా టాస్క్ మాస్టర్లే. సెట్‌లోకి నేను వచ్చినప్పుడు నన్ను కాకుండా నా హెయిర్‌ను చూశారు. ఆయన అనుకున్న దాని కంటే ఓ ఐదు శాతం తగ్గింది. అంత తీక్షణంగా ఆయన ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలిస్తుంటారు. ఆయనతో పని చేయడాన్ని నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య గారు అద్భుతంగా నటించారు. కియారా(kiara advani)తో నేను చేసిన డ్యాన్సులు, పాటలు అందరినీ అలరిస్తాయి. మేం డల్లాస్‌లో చేసిన ఈవెంట్‌కు అంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. డల్లాస్‌లో మాకు అపరమితమైన ప్రేమ లభించింది. గేమ్ చేంజర్ సినిమా జనవరి 10న రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది’ అని అన్నారు.
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ కోసం ఏదైనా కొత్తగా చేద్దామని డల్లాస్‌లో ఈవెంట్‌ను ప్లాన్ చేశాం. డల్లాస్ ఈవెంట్ బ్లాక్ బస్టర్ అయింది. గేమ్ చేంజర్ చిత్రంలో ఐదు పాటలుంటాయి. ఈ పాటలకు 75 కోట్లు ఖర్చు అయ్యాయి. ఒక్కో పాట పది రోజులకు పైగా చిత్రీకరించారు. అన్నీ కూడా శంకర్ మార్క్‌లోనే ఉంటాయి. నా బ్యానర్‌లో ఇది 50వ సినిమా. అందుకే ఈ చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా భారీ ఎత్తున నిర్మించాలని అనుకున్నాం. ఈ కథ విన్నప్పుడే పెద్ద హిట్ అవుతుందని ఫిక్స్ అయ్యాను. అప్పుడే ఈ సినిమా రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని అనుకున్నా. ఈ సినిమా కోసం సపోర్ట్ చేసిన ప్రతీ ఆర్టిస్ట్‌కు థాంక్స్’ అని అన్నారు.
ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో పని చేయడం ఆనందంగా ఉంది. శంకర్ గారు, రామ్ చరణ్ గారితో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్‌గా ఎదిగారు. చాలా మంచి యాక్టర్. ఈ చిత్రంలో ఐఏఎస్ రామ్ నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. కియారా, రామ్ చరణ్ చేసిన పాటలు, డ్యాన్సులు అదిరిపోతాయి. ఈ చిత్రంలో నేను హిందీలో డబ్బింగ్ చెప్పాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. మేం సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు. జనవరి 10న ఈ సినిమా ఏంటో మీకు తెలుస్తుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment