Game Changer: రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇదేదో ముందే చెప్పొచ్చుగా! | Game Changer Movie: Naanaa Hyraanaa Song Removed Temporarily in Film | Sakshi
Sakshi News home page

Game Changer: రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇన్నాళ్లేం చేశారు?

Published Fri, Jan 10 2025 9:22 AM | Last Updated on Fri, Jan 10 2025 10:04 AM

Game Changer Movie: Naanaa Hyraanaa Song Removed Temporarily in Film

ఈ సారి సంక్రాంతికి మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి. అందులో మొదటగా రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ (Game Changer Movie) నేడే (జనవరి 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్‌, జనవరి 14న విక్టరీ వెంకటేశ్‌ సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రాబోతున్నాయి. శుక్రవారం రిలీజైన గేమ్‌ ఛేంజర్‌కు మిక్స్‌డ్‌ టాక్‌ వస్తోంది.

ఆ కారణం వల్లే..
డైరెక్టర్‌ శంకర్‌ పాత ఫార్ములానే వాడారని కొందరు అంటుంటే.. ఇండియన్‌ 2 కంటే బెటర్‌గానే ఉందని మరికొందరు అంటున్నారు. ఇకపోతే థియేటర్‌లో నానా హైరానా పాట (#NaanaaHyraanaaSong) కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. సినిమాలో ఆ పాటనే కనిపించలేదట! దీనిపై గేమ్‌ ఛేంజర్‌ టీమ్‌ స్పందించింది. సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను మూవీలో యాడ్‌ చేయలేకపోయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, జనవరి 14 నుంచి నానా హైరానా సాంగ్‌ను థియేటర్‌లో ప్లే చేస్తామని పేర్కొంది. 

కోట్లు పెట్టి తీసింది ఇందుకేనా?
చిత్రయూనిట్‌ నిర్లక్ష్యంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టింది ఇలా ఎడిటింగ్‌లో తీసేయడానికేనా? చెత్త నిర్ణయాలు.., ఇదేదో ముందే చెప్పొచ్చుగా.. ఈ పాట కోసమే టికెట్‌ బుక్‌ చేసుకున్నా.., కనీసం ఆ పాట పెట్టుంటే గేమ్‌ ఛేంజర్‌పై నెగెటివిటీ కాస్త తగ్గేదేమో.. ఈ ఒక్కటైనా బాగుందని సంతృప్తి చెందేవారేమో అని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు మాత్రం.. ఏం పర్లేదు, జనవరి 14 తర్వాత మరోసారి టికెట్లు కొని సినిమా చూస్తామని కామెంట్లు చేస్తున్నారు.

గేమ్‌ ఛేంజర్‌ విశేషాలు..
ఈ ఏడాది రిలీజవుతున్న మొదటి భారీ బడ్జెట్‌ చిత్రం గేమ్‌ ఛేంజర్‌. రామ్‌చరణ్‌, కియారా అద్వానీ (Kiara Advani), అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. తమన్‌ సంగీతం అందించాడు. అనిత సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది. భారతీయుడు 2 డిజాస్టర్‌ తర్వాత శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఫస్ట్‌ డే ఫస్ట్‌ ఫోనే సినిమా బాలేదంటూ ఎక్కువ నెగెటివ్‌ రివ్యూలు వస్తున్నాయి. ఇదే టాక్‌ కొనసాగితే సినిమా గట్టెక్కడం కష్టమే!

పాటల కోసమే రూ.75 కోట్లు
అసలే సినిమాలోని ఐదు పాటల కోసమే రూ.75 కోట్లు ఖర్చు పెట్టానని గర్వంగా చెప్పుకున్నాడు నిర్మాత దిల్‌రాజు. తీరా థియేటర్‌లో చూస్తే మెలోడీ సాంగ్‌ నానా హైరానా వేయనేలేదు. సాంకేతిక సమస్యలంటూ ఏదో సాకు చెప్పారు. నాలుగు రోజుల తర్వాతే థియేటర్‌లో నానా హైరానా పాట వినిపిస్తుందని సమాధానం చెప్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సాంగ్‌ను ఇంత లైట్‌ తీసుకోవడం ఏమీ బాగోలేదంటున్నారు చరణ్‌ ఫ్యాన్స్‌

కథేంటంటే?
ఓ నిజాయితీ గల ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతిపరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే యుద్ధమే గేమ్ చేంజర్‌. గేమ్‌ ఛేంజర్‌ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి
 

 

 

 

చదవండి: Game Changer: రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కు నిరాశ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement