మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది.
ఇప్పటికే రిలీజైన గేమ్ ఛేంజర్ సాంగ్స్, టీజర్‌కు ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో మేకర్స్ మరో అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రంలోని హ్యాపీ లైఫ్‌కు మైక్రో మంత్ర అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఫుల్ సాంగ్ ఈనెల 22న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా రిలీజైన ప్రోమో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీతమందించారు.
కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో అభిమానుల్లో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యూఎస్ ప్రీమియర్స్‌కు సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment