రామ్ చరణ్‌ దంపతులపై క్యూట్ వీడియో.. స్పందించిన ఉపాసన! | Ram Charan Wife Upasana Reacts On A Fan Made Video Created With Game Changer Song, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Upasana: రామ్ చరణ్- ఉపాసనలపై గేమ్ ఛేంజర్ సాంగ్.. వీడియో వైరల్!

Published Thu, Nov 28 2024 12:40 PM | Last Updated on Thu, Nov 28 2024 1:07 PM

Ram Charan Wife Upasana Responds On A Video Created with Game Changer Song

మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గ్లోబల్ స్టార్ సతీమణిగా మాత్రమే కాదు.. మెడికల్ రంగంలో ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. అయితే రామ్ చరణ్, ఉపాసనపై ఓ అద్భుతమైన వీడియోను రూపొందించాడు ఓ నెటిజన్. గేమ్ ఛేంజర్‌ సాంగ్‌తో ఎడిట్ చేసిన ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఉపాసన స్పందించింది. ఎడిటింగ్‌ చాలా ముద్దుగా ఉంది.. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. శంకర్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలై సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ నానా హైరానా అంటూ సాంగే థర్డ్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్‌ తమన్‌ అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. ఈ రొమాంటిక్ సాంగ్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా.. గేమ్ ఛేంజర్‌లో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ కనిపించనుంది. కోలీవుడ్ స్టార్‌ ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. వెంకటేశ్ మూవీ సంక్రాంతి వస్తున్నాం కూడా పొంగల్ బరిలో నిలిచింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement