గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన పొలిటికల్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా ఈనెల 10న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్.. రెండో రోజు కాస్తా తగ్గనట్లు తెలుస్తోంది. మొదటి రోజు రూ.51 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ మూవీ.. రెండవ రోజు రూ. 21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో కలిపి రూ. 72.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ దూసుకెళ్తోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాకు తెలుద రాష్ట్రాల్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధిస్తోంది. రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ. 12.7 కోట్లు, హిందీలో రూ. 7 కోట్లు, తమిళం రూ. 1.7 కోట్లు, కన్నడలో రూ. 10 లక్షలు వసూలు చేసింది. తొలి రోజు తెలుగులో థియేటర్లలో మొత్తం 31.19 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి. ఉదయం షోలకు 20.66 శాతం ఆక్యుపెన్సీతో నడవగా.. సాయంత్రం షోలలో 36.48 శాతానికి పెరిగింది. సంక్రాంతి పండుగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది.
కాగా.. శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్ నందన్ పాత్రలతో రామ్ చరణ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రలో అదరగొట్టారు. ఎవరైనా సరే చరణ్ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు. ఇప్పటికే అప్పన్న పాత్రకు సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు శంకర్, ఎస్.జె. సూర్య, కియారా అద్వానీ, అంజలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆపై సాయి దుర్గాతేజ్, ఉపాసన కూడా చరణ్ నటనకు ఫిదా అయ్యారు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం కావడంతో గేమ్ ఛేంజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2019లో బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ (VVR) చిత్రంతో సోలోగా బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగాడు. ఆ సినిమాలో కూడా హీరోయిన్ కియారా అద్వానీ కావడం విశేషం. కాగా... చిత్రంలో కోలీవుడ్ హీరోలు ఎస్‌జే సూర్య, జయరామ్ కీలకపాత్రలో కనిపించారు. వీరితో పాటు శ్రీకాంత్, సముద్రఖని, అంజలి, నాసర్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, మురళీ శర్మ కూడా ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించగా.. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
పాటలకే రూ.75 కోట్లు..
దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలకే రూ.75 కోట్లు వెచ్చించినట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమా విడుదలకు ముందు రిలీజ్ చేసిన ఈ సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయి వ్యూస్‌తో గేమ్ ఛేంజర్ సాంగ్స్ దూసుకెళ్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment