గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ పాటలకు సంబంధించి మూవీ టీమ్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
ఈ చిత్రంలోనే నాలుగు పాటల కోసం ఏకంగా రూ.75 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు. కేవలం పాటలకే ఇంత భారీ బడ్జెట్ ఖర్చు చేయడంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ చిత్రం మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాగా.. గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటికే నాలుగు పాటలను విడుదల చేశారు. రిలీజైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. మొదటి సాంగ్ జరగండి.. జరగండి అనే పాట ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 600 డ్యాన్సర్లు పాల్గొన్నారు. దాదాపు 13 రోజుల పాటు షూటింగ్ చేశారు. ఈ సాంగ్‌లో విజువల్స్ ఫ్యాన్స్‌ను అలరించాయి.
1000 మంది డ్యాన్సర్లతో..
సెకండ్ సింగిల్ రా మచ్చా రా.. అంటూ సాగే రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగించింది. ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంది. గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో 1000 మందికిపైగా జానపద కళాకారులు పాల్గొన్నారు.
గేమ్ ఛేంజర్ నుంచి మరో సాంగ్ 'నానా హైరానా' కూడా సినీ ప్రియులను అలరించింది. తొలిసారి ఇన్‌ఫ్రారెడ్ కెమెరాతో తీసిన తొలి ఇండియన్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ సాంగ్‌ను పచ్చదనానికి కేరాఫ్ అడ్రస్ అయిన న్యూజిలాండ్‌లో తెరకెక్కించారు. దాదాపు ఆరు రోజుల పాటు ఈ పాటను షూట్ చేశారు.
ఇటీవల యూఎస్‌లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'దోప్' అనే నాలుగో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట కోసం రష్యాకు చెందిన 100 మంది ప్రొఫెషనల్ డ్యాన్సర్లను ఇండియాకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ సిటీలో ఈ పాటను తెరకెక్కించారు.
కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సంక్రాంతి బాక్సాఫీస్ సినిమాలతో పోటీ పడనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు.
RAM CHARAN - KIARA ADVANI: 'GAME CHANGER' FOUR SONGS, ₹ 75 CR *MUSIC BUDGET* - A BREAKDOWN... 10 JAN 2025 RELEASE... #GameChanger - the PAN-India biggie starring #RamCharan and #KiaraAdvani - has unveiled four songs to date.
Take a look at the #NewPoster, featuring the stunning… pic.twitter.com/SY49ygs74H— taran adarsh (@taran_adarsh) January 2, 2025
Comments
Please login to add a commentAdd a comment