కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గురువారం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కైతే గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీ సినీ ప్రియులను అలరించనుంది.
రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాలుగు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయనున్నారు. ఏపీలోని రాజమండ్రిలో జనవరి 4న భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
అయితే గేమ్ ఛేంజర్ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా.. అక్కడ మాత్రం ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కర్ణాటకలో సినిమాకు ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ కొందరు సినిమా పోస్టర్లపై స్ప్రే కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఎస్‌జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment