గేమ్ ఛేంజర్‌ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్‌ | Tollywood Director Ram Gopal Varma Tweet On Game Changer Collections | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: గేమ్ ఛేంజర్‌ మూవీ కలెక్షన్స్.. రాం గోపాల్ వర్మ ట్వీట్ వైరల్

Published Tue, Jan 14 2025 11:09 AM | Last Updated on Tue, Jan 14 2025 12:18 PM

Tollywood Director Ram Gopal Varma Tweet On Game Changer Collections

టాలీవుడ్  డైరెక్టర్  రాం గోపాల్ వర్మ స్టైలే వేరు. అందరికంటే భిన్నంగా తన అభిప్రాయాన్ని  చెబుతుంటారు.  ఏ విషయమైనా సరే తన మనసులో ఉన్నదే బయటికి చెప్పేస్తారు. అందువల్లే ఆర్జీవీకి సంచలన దర్శకుడిగా పేరు తెచ్చకున్నారు. తాజాగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్‌ మూవీపై ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

తాజాగా ఓ టాలీవుడ్ మూవీ గేమ్ ఛేంజర్‌పై తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్‌ను ఉద్దేశించి ఆర్జీవీ పోస్ట్ పెట్టారు. గేమ్ ఛేంజర్‌కు రూ.450 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ లెక్కన రాజమౌళి ఆర్ఆర్‌ఆర్‌కు రూ.4500 కోట్లు అయి ఉంటుందని రాసుకొచ్చారు. అలా గేమ్ ఛేంజర్‌కు మొదటి రోజు కలెక్షన్స్ రూ.186 కోట్లు వచ్చాయంటే.. అల్లు అర్జున్‌ పుష్ప-2 రూ.1860 కోట్లు రావాల్సిందని ట్విటర్‌లో రాశారు. ఇక్కడ ఏదైనా నిజానికి కావాల్సిన ప్రాథమిక సూత్రం ఏంటంటే నిజమనేది నమ్మదగినదిగా ఉండాలి.. అబద్ధం చెప్పినా కూడా నమ్మేలా ఉండాలి అంటూ రాం గోపాల్ వర్మ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ  పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తొలి రోజు రూ.186 కోట్లు..

రామ్ చరణ్- శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైంది. దిల్ రాజు నిర్మించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. గేమ్ ఛేంజర్ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ వసూళ్లను ఉద్దేశించి రాం గోపాల్ వర్మ ‍ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. 
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement