విక్టరీ వెంకటేశ్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది పొంగల్ కానుకగా థియేర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈనెల 14న విడుదలైన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్లతో దూసుకెళ్తోంది. కేవలం 12 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.260 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ వెల్లడించింది.
సంక్రాంతికి వస్తున్నాం మూవీకి మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. పొంగల్ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలతో పోటీపడి రాణిస్తోంది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్ సిసిరోలియో సంగీతమందించారు.
(ఇది చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)
ఈ సినిమా కథేంటంటే..
డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్‌కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు.
కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు.
ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్‌ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ.
#BlockbusterSankranthikiVasthunam continues it's Box Office Sambhavam 💥💥💥
260crores+ worldwide gross in just 12 days for #SankranthikiVasthunam 🔥🔥
ALL TIME HIGHEST FOR A REGIONAL FILM ❤️🔥❤️🔥❤️🔥
Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl #BheemsCeciroleo… pic.twitter.com/rgDgmuI2GW— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025
Comments
Please login to add a commentAdd a comment