టాలీవుడ్ హీరో వెంకటేశ్ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికిందని టాలీవుడ్ సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్నాడు ఓ బుడ్డోడు. వెంకటేశ్ కుమారుడిగా ఈ మూవీలో కనిపించిన రేవంత్ భీమల(బుల్లి రాజు) అనే చైల్డ్ ఆర్టిస్ట్ సంక్రాతికి వస్తున్నాం మూవీ ఈవెంట్‌లో సందడి చేశాడు. సినిమాలో మాత్రమే కాదు.. వేదికపై కూడా తన మాటలతో అందరికీ నవ్వులు తెప్పించాడు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏమన్నాడో మీరు చూసేయండి.
సక్సెస్ మీట్‌లో రేవంత్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం.. నేను ఈ మూవీలో వెంకటేశ్ గారికి కుమారుడిగా చేశాను. వెంకటేశ్ లాంటి గొప్ప యాక్టర్‌తో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేసిన క్షణాలను నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన అనిల్ సార్‌కు థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను. మీనాక్షి మేడం, ఐశ్వర్య మేడంతో నేను చాలా ఎంజాయ్ చేశాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు సార్, శిరీష్ సార్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. మేము సంక్రాంతికి వస్తున్నాం.. మీరు సంక్రాంతికి రండి అని మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ బుడ్డోడి స్పీచ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment