సంక్రాంతికి ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేస్తోన్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది అనిల్- వెంకటేశ్ కాంబోపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లి రాజు). తన క్యూట్ క్యూట్ మాటలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు మూవీ ఈవెంట్‌లో మాట్లాడిన బుల్లి రాజు మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్‌లో సందడి చేశాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా నాలా ఎవరూ కూడా పాడై పోవద్దంటూ పెద్ద సలహానే ఇచ్చాడు. ఇంతకీ అదేంటో చూద్దాం.
బుల్లి రాజు మాట్లాడుతూ..' అందిరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరు థియేటర్స్‌కు వెళ్లి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్స్. అలాగే నాలా ఓటీటీలు చూసి ఎవరూ పాడైపోవద్దు. ఒక మేసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశాం. ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో నా పాత్రను ఎవరూ ఫాలో అవ్వొద్దు. అందుకు మీ అందరికీ సారీ. అనిల్ సార్ మీరు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందరితో బాగా కలిసిపోయాను.' అని అన్నారు.
రేవంత్ పాత్రపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' బుల్లి రాజు నువ్వు బాగా చేశాం. యూఎస్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకో. మంచి సినిమాలు చేయి. ఈ బుడ్డోడి పాత్ర ఏంటంటే.. పిల్లలు ఓటీటీ చూస్తే పరిస్థితి ఏంటనేది చూపించాం. అక్కడ వినిపించే బూతులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే మేసేజ్ కోసమే అలా చేశాం. అంతేకానీ బుల్లిరాజుతో అలా మాట్లాడించాలని కాదు' అని క్లారిటీ ఇచ్చారు.
కాగా.. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment