Child artist
-
చైల్డ్ ఆర్టిస్ట్‌గా 50 సినిమాలు.. దత్తత తీసుకున్న లారెన్స్.. మందుకు బానిసై..
రవిరాజ్ రాథోడ్.. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అదరగొట్టాడు. ఈ ఒక్కటే కాదు ఆంధ్రవాలా, ఖడ్గం, జెమిని, మాస్, బొమ్మరిల్లు, డాన్, హైదరాబాద్ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్.. ఇలా దాదాపు యాభైకి పైగా సినిమాల్లో బాలనటుడిగా చేశాడు. ప్రస్తుతం కెమెరా ముందు కాకుండా సినిమా సెట్లో పనిచేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో తన బాధలను పంచుకున్నాడు.నిప్పంటించుకుని..రవిరాజ్ మాట్లాడుతూ.. నాది మిర్యాలగూడ. చిన్నప్పుడు నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు. మా ఆయన బంగారం మూవీలో సౌందర్య ఎత్తుకునే చిన్న బాబును నేనే! చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేను నటించిన చివరి సినిమా ఎస్ఎమ్ఎస్. అప్పుడే అమ్మానాన్న, బామ్మ ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. నేను షూటింగ్‌కు వెళ్లొచ్చేసరికి అందరూ శవాలై ఉన్నారు. మా ఇంటిని పిన్నిబాబాయ్ వాళ్లకు ఇచ్చేసి బయటకు వచ్చేశాను.లారెన్స్ దత్తత తీసుకున్నాడునన్ను రాఘవ లారెన్స్ దత్తత తీసుకున్నాడు. హాస్టల్ సౌకర్యం ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. నెలకు రూ.1 లక్ష ఫీజు కట్టాడు. వినాయక చవితి సెలవులు వచ్చినప్పుడు నేను ఫ్రెండ్స్ అంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాను, తిరిగి వెళ్లలేదు. మొన్నామధ్య సెట్లో రాజమౌళి సర్ నన్ను చూసి వీపుపై రెండు దెబ్బలు వేశాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అన్ని సినిమాలు చేసి సెట్లో ఎందుకు పని చేస్తున్నావని తిట్టాడు. ఆరోజు షెడ్యూల్ అయ్యాక ఓసారి కలవమన్నారు కానీ నేనే వెళ్లలేదు.అడుక్కోవడం ఎందుకని?నటుడిగా కొనసాగకపోవడానికి కారణం.. అవకాశాల కోసం వెళ్తే రేపు రా, ఎల్లుండి రా.. అని తిప్పించుకున్నారు. ఇలా ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని నటుడిగా ప్రయత్నించడం మానేశాను. అలాగే నేను మద్యానికి బానిసయ్యాను తాగకపోతే ఏవేవో జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తాగకుండా ఒక్క రోజు ఉండలేను అని చెప్పుకొచ్చాడు.చదవండి: ఏంటి సైఫ్? అర లక్ష ఏం సరిపోతుంది? కనీసం రూ.11 లక్షలైనా..: సింగర్ -
సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా?
సంక్రాంతికి ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్టైన్ చేస్తోన్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం పొంగల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది అనిల్- వెంకటేశ్ కాంబోపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.అయితే ఈ సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్(బుల్లి రాజు). తన క్యూట్ క్యూట్ మాటలతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. అంతకుముందు మూవీ ఈవెంట్లో మాట్లాడిన బుల్లి రాజు మరోసారి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ మీట్లో సందడి చేశాడు. ఈ సందర్భంగా అనిల్ రావిపూడిపై ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా నాలా ఎవరూ కూడా పాడై పోవద్దంటూ పెద్ద సలహానే ఇచ్చాడు. ఇంతకీ అదేంటో చూద్దాం.బుల్లి రాజు మాట్లాడుతూ..' అందిరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మీరందరు థియేటర్స్‌కు వెళ్లి సినిమాను ఆదరించినందుకు థ్యాంక్స్. అలాగే నాలా ఓటీటీలు చూసి ఎవరూ పాడైపోవద్దు. ఒక మేసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశాం. ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ సినిమాలో నా పాత్రను ఎవరూ ఫాలో అవ్వొద్దు. అందుకు మీ అందరికీ సారీ. అనిల్ సార్ మీరు నాకు మంచి ఛాన్స్ ఇచ్చారు. మీ గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అందరితో బాగా కలిసిపోయాను.' అని అన్నారు. రేవంత్ పాత్రపై అనిల్ రావిపూడి మాట్లాడుతూ..' బుల్లి రాజు నువ్వు బాగా చేశాం. యూఎస్‌తో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను మెచ్చుకుంటున్నారు. నువ్వు బాగా చదువుకో. మంచి సినిమాలు చేయి. ఈ బుడ్డోడి పాత్ర ఏంటంటే.. పిల్లలు ఓటీటీ చూస్తే పరిస్థితి ఏంటనేది చూపించాం. అక్కడ వినిపించే బూతులు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే మేసేజ్ కోసమే అలా చేశాం. అంతేకానీ బుల్లిరాజుతో అలా మాట్లాడించాలని కాదు' అని క్లారిటీ ఇచ్చారు. కాగా.. వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఏడాది పొంగల్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సంక్రాంతికి సరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదరగొట్టింది. ఈ చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా వెంకటేశ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. -
వెంకటేశ్ మూవీలో బుడ్డోడు.. క్యూట్ స్పీచ్‌తో అదరగొట్టేశాడు!
టాలీవుడ్ హీరో వెంకటేశ్ సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 14న విడుదలైన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. ఈ సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికిందని టాలీవుడ్ సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్నాడు ఓ బుడ్డోడు. వెంకటేశ్ కుమారుడిగా ఈ మూవీలో కనిపించిన రేవంత్ భీమల(బుల్లి రాజు) అనే చైల్డ్ ఆర్టిస్ట్ సంక్రాతికి వస్తున్నాం మూవీ ఈవెంట్లో సందడి చేశాడు. సినిమాలో మాత్రమే కాదు.. వేదికపై కూడా తన మాటలతో అందరికీ నవ్వులు తెప్పించాడు. ఇంతకీ ఆ బుడ్డోడు ఏమన్నాడో మీరు చూసేయండి.సక్సెస్ మీట్లో రేవంత్ మాట్లాడుతూ..'అందరికీ నమస్కారం.. నేను ఈ మూవీలో వెంకటేశ్ గారికి కుమారుడిగా చేశాను. వెంకటేశ్ లాంటి గొప్ప యాక్టర్‌తో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయనతో పనిచేసిన క్షణాలను నేను లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన అనిల్ సార్‌కు థ్యాంక్స్. పటాస్ మూవీ నుంచి మీకు నేను పెద్ద ఫ్యాన్‌ను. మీనాక్షి మేడం, ఐశ్వర్య మేడంతో నేను చాలా ఎంజాయ్ చేశాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దిల్ రాజు సార్, శిరీష్ సార్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ చాలా థ్యాంక్స్. మేము సంక్రాంతికి వస్తున్నాం.. మీరు సంక్రాంతికి రండి అని మాట్లాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ బుడ్డోడి స్పీచ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. -
'డాకు మహారాజ్' సినిమాలోని పాప ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
డాకు మహారాజ్లో నటనతో కట్టిపడేసిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie). బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో విడుదల కాగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. హీరోకు బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.డాకు మహారాజ్‌లోని చిన్నారి ఎవరు?ఈ సినిమాలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఈ పాప సినిమా సెట్స్‌లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఎవరని పలువురూ ఆరా తీస్తున్నారు. ఈ బేబీ వైష్ణవి పేరు వేద అగర్వాల్ (Veda Agrawal). తను నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రముఖ గాయకుడు మాధవ్ అగర్వాల్ కూతురే వేద.(డాకు మహారాజ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఉప్పొంగిపోయిన సింగర్తన గారాలపట్టి ఇంత పెద్ద సినిమాలో భాగం కావడంతో తండ్రిగా ఉప్పొంగిపోయాడు మాధవ్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఆగ్రాలో పుట్టినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నా ఎనిమిదేళ్ల కూతురు తెలుగులో నటించిన పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను పెరిగిన హైదరాబాద్‌లోని థియేటర్లలో ఆడుతోంది. ఎంత యాదృచ్చికం.కల నెరవేరినట్లుగా ఉందిఈ ప్రయాణం నాకు సంపూర్ణమైన అనుభూతినిస్తోంది. మా భావోద్వేగాలు ఆగడం లేదు. హైదరాబాద్ నగరంలో బిగ్ స్క్రీన్‌పై తనను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లుగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. డాకు మహారాజ్లో వైష్ణవిగా కట్టిపడేసింది వేద. ఈ సినిమాతో తనకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.డాకు మహారాజ్ సినిమా విశేషాలుడాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌తో మెరిసింది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ముందుకు వచ్చిన ఈ మూవీకి తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. సక్సెస్ పార్టీపైగా జనవరి 10న రిలీజైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీకి వస్తున్న మిక్స్డ్ టాక్ డాకు మహారాజ్‌కు కలిసొచ్చినట్లైంది. తొలి రోజే బాలకృష్ణ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. అటు ఆన్ స్క్రీన్‌లో, ఇటు ఆఫ్ స్క్రీన్‌లో బాలకృష్ణ.. ఊర్వశిని దబిడి దిబిడి ఆడేసుకున్నారు. View this post on Instagram A post shared by Madhav Agrawal (@abmadhav) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) View this post on Instagram A post shared by Veda Agrawal (@veda.agrawal) చదవండి: పవన్ సినిమా..ఆ హీరోయిన్ పాలిట శాపమైందా ? -
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ.. హీరోయిన్గా దూసుకెళ్తున్న అతిరా (ఫోటోలు)
-
Divya Arundati : అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి
20 ఏళ్ల క్రితం బాలనటిగా బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న జనక్ శుక్లా పెళ్లి చేసుకుంది. ఎప్పటినుంచో ప్రేమిస్తున్న స్వప్నిల్ సూర్యవంశీతో ఏడడుగులు వేసింది. డిసెంబరు 12న ఈ వివాహం జరగ్గా.. తాజాగా పెళ్లి వీడియోని సోషలో మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు పరారీలో ఉన్నాడా?)'కుంకుమ భాగ్య' సీరియల్ నటిగా అందరికీ తెలిసిన సుప్రియ శుక్లా కూతురే జనక్ శుక్లా. 'సన్ పరి' సీరియల్‌తో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిన్నది.. షారుక్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమాలో ప్రీతి జింటా చెల్లిగా అద్భుతమైన యాక్టింగ్ చేసింది. అయితే కొన్నాళ్లకు యాక్టింగ్ పక్కనబెట్టేసింది. చదువు పూర్తయిన తర్వాత నటనపై ఆసక్తి లేకపోవడంతో లైట్ తీసుకుంది.ఎంబీఏ చేసిన జనక్.. కొన్నేళ్లుగా స్వప్నిల్‌తో ప్రేమలో ఉంది. ఇతడు మెకానికల్ ఇంజినీర్. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన వీళ్లిద్దరూ ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.(ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?) View this post on Instagram A post shared by Kamlesh Pithava (@bhagvati_photostudio) -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న ‘చార్లీ 777’ చైల్డ్ ఆర్టిస్ట్
చార్లీ 777, జాగ్వార్ లాంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఐశ్వర్య గౌడ..ఇప్పుడు హీరోయిన్గా మారబోతుంది. మహేష్ బాబు, నాగార్జున, రవితేజ వంటి ప్రముఖ కథానాయకులతో ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ఇనావర్స్ సినిమా ఫ్యాక్టరీ మరియు రాస్ర ఎంటర్ టైన్మంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఏ రోజైతే చూశానో నిన్ను’ సినిమాలో ఐశ్వర్య హీరోయిన్గా నటించగా.. మరో చైల్డ్ ఆర్టిస్ట్ భరత్ రామ్(బుర్రకథ, రంగ రంగ వైభవంగా) హీరోగా పరిచయం అవుతున్నాడు. రాజు బొనగాని దర్శకత్వం వహించబోతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘ఈ డిసెంబర్ నెలలోనే 'ఏ రోజైతే చూశానో నిన్ను' షూటింగ్ ప్రారంభం కానుంది. భరత్ రామ్, ఐశ్వర్య గౌడ లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్.. ఏకంగా 100 మూవీస్
తెలుగు సినిమాల్లో నటులు లెక్కలేనంత మంది. ఎప్పటికప్పుడు కొత్తోళ్లు వస్తూనే ఉంటారు. పాత వాళ్లు కనుమరుగైపోతూనే ఉంటారు. కానీ కొందరు మాత్రం హిట్ సినిమాలు చేసినా సరే కొన్ని కారణాలతో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. ఈమె కూడా సేమ్ అలాంటి వ్యక్తే. అప్పట్లో ఎన్టీఆర్, చిరంజీవి పక్కన నటించింది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమెని గుర్తుపట్టారా? ఎవరో మమ్మల్నే చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్రేష్ఠ. అరె ఈ పేరు ఎప్పుడు వినలేదే ఎవరబ్బా అనుకుంటున్నారా? 80-90ల్లో తెలుగులో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టు బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. దాదాపు 100కి పైగా తెలుగు సినిమాల్లో బాలనటిగా చేసింది.(ఇదీ చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది?)'సమరసింహారెడ్డి' సినిమాలో హీరోకి నడవలేక ఇబ్బంది పడే చెల్లి ఉంటుంది. ఆ పాత్ర పోషించింది శ్రేష్ఠనే. ఇదే ఈమెకి చివరి మూవీ కూడా. దీని తర్వాత పూర్తిగా చదువుపై దృష్టి పెట్టింది. బీటెక్, ఎమ్ టెక్, ఎమ్ఎస్ చేసి అమెరికాలో జాబ్ చేసింది. తర్వాత తిరిగి స్వదేశానికి తిరిగొచ్చేసింది. ప్రస్తుతం తండ్రికి చెందిన కన్స్ట్రక్షన్ వ్యవహారాలు చూసుకుంటోంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ఈమెని చూసి చాలామంది షాకయ్యారు. ఎందుకంటే అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది.ఇక ఈమె నటించిన సినిమాల విషయానికొస్తే.. సమర సింహారెడ్డి, రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, హిట్లర్ తదితర చిత్రాలున్నాయి. ఈమెకు మంచు మనోజ్‌తో కూడా పెళ్లి చేయాలని అనుకున్నారట. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ప్రస్తుతానికైతే ఈమె సింగిల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఓ బాలనటి ఇలా చాన్నాళ్ల తర్వాత కనిపించడం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: 'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా?) -
మురిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు ఫేం అవికా గోర్ (ఫోటోలు)
-
చిన్నప్పుడేమో క్యూట్.. ఇప్పుడేమో హీరోయిన్లని మించిన అందంతో (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్
ఇప్పుడు తగ్గిపోయారు గానీ ఒకప్పుడు తెలుగులో దాదాపు ప్రతి సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండేవారు. హీరోహీరోయిన్లలానే వీళ్లు కూడా మంచి క్రేజ్ సంపాదించేవారు. అలా 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీలో స్వీటీగా యాక్ట్ చేసిన బేబీ వర్ణిక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఏకంగా 'పుష్ప 2' పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఇంతకీ ఇప్పుడెలా ఉందో తెలుసా?(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)బేబి వర్ణిక గురించి పెద్దగా డీటైల్స్ అయితే తెలియవు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో, బంగారు బాబు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చదువు కోసం పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పుష్ప కపుల్ సాంగ్‌కి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.చిన్నప్పుడు చబ్బీగా బూరె బుగ్గలతో ఉన్న వర్ణిక కాస్త ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చేసింది. ఒడ్డు పొడుగు చూస్తే హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గలేదు. స్టెప్పులు అవి చూస్తుంటే త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చేస్తుందేమో అనిపిస్తుంది. మరి బేబీ వర్ణిక లేటెస్ట్ వీడియో మీరు చూసేయండి.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ) View this post on Instagram A post shared by Doe Cinema (@thedoecinema)S/O satyamurthy kid Vernika got transformed into a grown up one and is looking like this now!!#Pushpa2TheRule #Pushpa2 pic.twitter.com/Nm8jEMxtZ5— Vamc Krishna (@lyf_a_zindagii) June 13, 2024 -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
తెలుగు సినిమాల్లో ఎప్పటికప్పుడు కొత్త యాక్టర్స్ వస్తూనే ఉంటారు. అప్పటికే ఫామ్‌లో నటీనటులు సైలెంట్‌గా సైడ్ అయిపోతుంటారు. కొన్నిసార్లు మాత్రం హిట్ మూవీస్ చేసి చాలా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఎందుకో ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అలా దాదాపు 22 ఏళ్ల క్రితం తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఓ పాప ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు యామిని శ్వేత. డైరెక్టర్ తేజ తీసిన హిట్ సినిమా 'జయం'లో హీరోయిన్ సదా చెల్లెలిగా నటించిన పాప గుర్తుందా? ఆమెనే ఈమె. సీరియల్ నటి జయలక్ష్మి కూతురు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమాల రావడానిక ముందు 10 సీరియల్స్‌లో చేసింది. అలా నటిస్తున్న టైంలో 'జయం' ఆడిషన్స్ కోసం ప్రకటన రావడంతో ఈమె తండ్రి డైరెక్టర్ తేజకు ఫొటోలు పంపారు. అలా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంపికైంది.'జయం'త పాటు ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు సినిమాల్లోనూ బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. చదువు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని స్థిరపడిపోయింది. విదేశాల్లో మాస్టర్స్ పూర్తి చేసిన యామిని.. తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుని ఫారెన్‌లో సెటిలైంది. తాజాగా ఈమెని చూసిన కొందరు.. 'జయం' నటి ఏంటి ఇంతలా మారిపోయిందని మట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు) -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
సినిమాల్లో నటించి హిట్స్ కొట్టినా సరే కొందరు యాక్టర్స్ కనుమరుగైపోతుంటారు. కొన్నాళ్ల పాటు పూర్తిగా కనిపించకుండా పోతుంటారు. ఈ బ్యూటీ సేమ్ అలానే. తెలుగు, తమిళంలో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో బాలనటిగా చేసింది. ఆ తర్వాత పూర్తిగా ఒక్క భాషకే పరిమితమైపోయింది. ఇప్పుడేమో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య నగేశ్. తమిళనాడుకి చెందిన ఈమె.. 'అపరిచితుడు' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో 'అరుంధతి'లో అనుష్క చిన్నప్పటి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. వీటితో మంచి ఫేమ్ వచ్చినప్పటికీ ఎక్కువగా తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చింది.రీసెంట్గా తమిళంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన దివ్య నగేశ్.. తన కెరీర్ గురించి చెప్పుకొచ్చింది. అయితే అప్పట్లో ఈమెని బాలనటిగా చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు పూర్తిగా మారిపోయిన దివ్యని చూసి షాకవుతున్నారు. ఇద్దరూ ఒకరేనా కాదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటున్నారు. మరి మీరేమైనా గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య) -
అబ్బాయిగా ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోయిన్గా సంచనలం, ఎవరీ బ్యూటీ? (ఫొటోలు)
-
తెలుగులో ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్.. హీరోయిన్‌గానూ చేసింది!
సినిమాల్లో అందరూ నిలదొక్కుకోలేరు. కొందరిది షార్ట్ జర్నీ అయితే మరికొందరిది లాంగ్ జర్నీ.. అయితే కొందరు తక్కువ సినిమాలు చేసినా ఎప్పటికీ గుర్తుండిపోతారు. పైన కనిపిస్తున్న బ్యూటీ అలాంటి చిత్రాలే చేసింది. 'తూనీగా.. తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ మనసంతా నువ్వేలో ఆడిపాడింది. చైల్డ్ ఆర్టిస్టుగా ఈ మూవీతో పాటు గణేశ్, ప్రేమంటే ఇదేరా, హిందుస్తాన్: ద మదర్, ఎలా చెప్పను, ఆనందమానందమాయె వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. తర్వాత హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఈ క్రమంలో సవాల్, స్నేహగీతం వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళంలోనూ రెండు సినిమాలు చేసింది. కానీ ఏవీ తనకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేకపోయాయి. దీంతో సడన్‌గా సినీ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. 2011లో అప్పవి(తమిళ మూవీ) ఆమె నటించిన చివరి చిత్రం. ఆ తర్వాత మరే సినిమా చేయలేదు. 2022లో ఎంటర్ప్రెన్యూర్, సంగీతకళాకారుడు విభర్ హసీజాను పెళ్లాడింది. అప్పటినుంచి ఇద్దరూ తెగ టూర్లు చుట్టేస్తున్నారు. సుహానీ అయితే ట్రావెల్ ఇన్ఫ్లూయెన్సర్గా మారిపోయింది! ఇటీవలే ఈ దంపతులు దుబాయ్ వెళ్లారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది నటి. గత నెలలో అమెరికాలో పారిస్, వాషింగ్టన్ ప్రాంతాలను చుట్టేసింది. పెళ్లయ్యాక సుహానీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోందంటున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Suhani Kalita (@suhani.kalita) చదవండి: పెళ్లయి ఎనిమిదేళ్లు.. ఇంకా పిల్లల్ని కనరా? వితికా ఆన్సరిదే! -
నాడు చిరంజీవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడో ప్రముఖ లాయర్
'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైన శ్రియా శర్మ గుర్తుందా..? ఆ సినిమాతో ఆమెకు భారీగా అవకాశాలు వచ్చాయి. ఒకే ఒక్క చిత్రంతో ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం జై చిరంజీవా చిత్రంలో ఆమె మెగాస్టార్‌కు మేనకోడలిగా నటించడమే అని చెప్పవచ్చు. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్) మూవీలో యాక్ట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది. మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్ గర్ల్‌గా కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నటనతో అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 26 ఏళ్లు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలైన తన ప్రయాణం హీరోయిన్గా తన మొదటి చిత్రం గాయకుడుతో ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. 2016లో నిర్మలా కాన్వెంట్ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. కానీ పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం పెద్దపెద్ద కార్పోరేట్ కంపెనీలకు అడ్వకేట్‌గా కొనసాగుతుంది. View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) -
తెలుగుమ్మాయిని.. సపోర్ట్ చేయాలి కానీ ట్రోలింగ్..: అవంతిక
అవంతిక వందనపు.. ఈ మధ్య బాగా మార్మోగిపోతున్న పేరు. 'బ్రహ్మోత్సవం' అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఇందులో మహేశ్‌బాబు చెల్లిగా కనిపించిన అవంతిక తర్వాత 'మనమంతా', 'ప్రేమమ్' సినిమాల్లో కనిపించింది. అలా తెలుగులో బాలనటిగా కొన్ని సినిమాలు చేసిన ఈమె 2021లో హీరోయిన్గా స్పిన్ అనే మూవీ చేసింది. అప్పటినుంచి అన్నీ హాలీవుడ్ సినిమాలే చేస్తోంది. ఇటీవలే మీన్ గర్ల్స్ అనే చిత్రంలో కనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో అవంతిక అమెరికా యాక్సెంట్లో మాట్లాడటంతో చాలామంది తనను ట్రోల్ చేశారు. పదేళ్ల వయసులో.. దీనిపై అవంతిక స్పందిస్తూ.. 'అమ్మది హైదరాబాద్, నాన్నది నిజామాబాద్.. కానీ నేను పుట్టిపెరిగింది అమెరికాలో! నాకు 10 ఏళ్లు ఉన్నప్పుడు హైదరాబాద్‌కు షిఫ్టయ్యాం. ఇక్కడికి వచ్చాక సినిమా అవకాశాలు రావడంతో ఐదేళ్లు ఇక్కడే ఉన్నాం. అమ్మ నాకోసమే ఉద్యోగం వదిలేసింది. నేను అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతుంటే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకో నాకే అర్థం కావడం లేదు. నేను అక్కడే పుట్టిపెరిగాను కాబట్టి నాకు యాస అలాగే వస్తుంది. తెలుగమ్మాయి హాలీవుడ్లో సక్సెస్ అవుతుందంటే సపోర్ట్ చేయాలి కానీ ఇలా విమర్శించడం కరెక్ట్ కాదు. హీరోయిన్గా.. ట్రోల్స్‌ను మనం ఎప్పుడూ కంట్రోల్ చేయలేం. కానీ ఇంత దారుణమైన ట్రోలింగ్‌ను నేనింతవరకు చూడలేదు. అయితే అమెరికాలో నెపోటిజం లేదు. టాలెంట్‌ను బట్టే ఛాన్సులు ఇస్తారు. కానీ నాకు ఇక్కడ హీరోయిన్గా రాణించాలనుంది. సౌత్‌లో, బాలీవుడ్లో సినిమాలు చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది. అవంతిక నటించిన 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆమె యాక్ట్ చేసిన హాలీవుడ్ హారర్ మూవీ 'టారో' సమ్మర్లో రిలీజ్ కానుంది. చదవండి: ఏడాదికే భార్యకు విడాకులు.. హీరోయిన్‌తో నటుడి రెండో పెళ్లి -
Avantika Vandanapu Photos: హాలీవుడ్లో హాట్ టాపిక్‌గా అవంతిక వందనపు (ఫొటోలు)
-
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
సినిమాల్లో గుర్తింపు రావడం సులభమే. కానీ దాన్ని నిలబెట్టుకోవడమే కష్టం. హిట్ సినిమాలో నటించినా సరే క్రేజ్ అనేది కొనసాగాలంటే మరికొన్ని సక్సెస్ఫుల్ చిత్రాలు కూడా దక్కాల్సి ఉంటుంది. ఈ బ్యూటీది దాదాపు ఇలాంటి సమస్యే. అప్పట్లో తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో సెన్సేషన్ సృష్టించిన మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా. ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? (ఇదీ చదవండి: లోక్‌సభ ఎన్నికల బరిలో టాలీవుడ్ హీరోయిన్.. ఆ స్థానంలో పోటీ?) పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు ప్రహర్షిత. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు. 'చంద్రముఖి' సినిమాలో 'అత్తిందోమ్' పాటలో ఓ పాప కనిపిస్తుంది కదా! ఆమెనే ఈమె. అవును మీరు విన్నది నిజమే. అప్పట్లో బొద్దుగా ఉండే ఈ చిన్నారి.. ఈ మూవీ తర్వాత తమిళంలోనే వేలన్, రాజరాజేశ్వరి, సెల్వి చిత్రాల్లోనూ బాలనటిగా చేసింది. కాకపోతే 'చంద్రముఖి'కి వచ్చినంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. 2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకుంది. 2022లో ఓ పాప కూడా పుట్టింది. 18 ఏళ్లపాటు బుల్లితెరకు దూరమైన ఈమె.. ప్రస్తుతం ఓ తమిళ సీరియల్లో నటిస్తోంది. తాజాగా ఈమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈమె ఎవరబ్బా అని అందరూ అనుకున్నారు. కాసేపటి తర్వాత 'చంద్రముఖి' చైల్డ్ ఆర్టిస్టా అని గుర్తుపట్టి షాకయ్యారు. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) View this post on Instagram A post shared by Praharshetha (@official_bommi) -
ఒకప్పుడు ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఐఏఎస్‌గా..
సినిమాల మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవాళ్లను చూశాం.. అలాగే ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సినిమాలు వదిలేసి రోడ్డునపడ్డవాళ్లమూ చూశాం.. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ మాత్రం చిన్న వయసులో సినిమాలు చేసింది. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఏఎస్ సాధించింది. బాలనటిగా బోలెడు సినిమాలు.. ఆవిడే హెచ్ఎస్ కీర్తన.. బాల్యంలో నటనతో అందరినీ కట్టిపడేసింది. అటు బుల్లితెర, ఇటు వెండితెర.. రెండింటిపైనా తళుక్కుమని మెరిసింది. కన్నడలో సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది. కర్పూరద గోంబే, గంగ-యమున, ముద్దిన అలియ, ఉపేంద్ర, ఎ, కనూర్ హెగ్గడటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగె, లేడీ కమిషనర్, హబ్బ, డోరె, సింహాద్రి, జనని, చిగురు, పుతని ఏజెంట్.. ఇలా పలు చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. ఆరో ప్రయత్నంలో.. రానురానూ తనకు చదువుపై మక్కువ ఎక్కువైంది. ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంది, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దేశంలోనే అతి క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. కానీ ఫెయిలైంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. వరుసగా రాస్తూనే ఉంది. అలా ఆరోసారి(2020లో) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆలిండియా లెవల్లో 167వ ర్యాంకు సంపాదించింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా అపాయింట్ అయింది. రెండేళ్లు ఆ పని చేశాక ఐఏఎస్ అయితే దీనికంటే ముందు 2011లో ఆమె కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్(KAS) కూడా రాసింది. ఈ పరీక్షలో పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా సాధించింది. రెండేళ్లపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా సేవలందించింది. ఆ తర్వాత ఐఏఎస్ జాబ్ కొట్టింది. మొదటి ప్రయత్నంలోనే ఫెయిలయ్యామని చతికిలపడేవారికి కీర్తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! చదవండి: చులకన, వేధింపులు.. చాలా ఏళ్లు బాధపడ్డా.. ఇకపై అస్సలు ఊరుకోను! -
19 ఏళ్లకే ప్రాణాలు కోల్పోయిన 'దంగల్' నటి.. అదే కారణమా?
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'దంగల్' సినిమా గుర్తుందా? ఇందులో బబిత కుమారిగా నటించిన బాలనటి చిన్న వయసులోనే కన్నుమూసింది. ప్రస్తుతం ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో విషాదం నింపింది. మరీ 19 ఏళ్ల వయసులోనే ప్రాణాలు వదిలేయడంపై అందరూ షాక్‌కి గురవుతున్నారు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) సుహానీ భట్నాగర్.. 'దంగల్' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. రెండో కూతురు బబిత కుమారి ఫోగట్ పాత్రలో ఆకట్టుకుంది. దీని తర్వాత 'బల్లే ట్రూప్' అనే మరో చిత్రంలో నటించింది. ఆ తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టి చదువుకుంటోంది. తాజాగా ఈమెకు ప్రమాదం జరగ్గా కాలు విరిగింది. చికిత్స తీసుకునే క్రమంలోనే ఈమె ఉపయోగించిన మెడిసన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని, ఈ క్రమంలోనే దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతికి కారణాలు ఏంటనేది క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా మరీ 19 ఏళ్ల చిన్న వయసులోనే ఇలా నటి సుహానా ప్రాణాలు విడవటంతో పలువురు నటీనటులు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: రాజధాని ‘ఫెయిల్స్’.. బాబు ‘భ్రమరావతి’) Actor #SuhaniBhatnagar, who played #AamirKhan’s on-screen daughter in Dangal, passed away on Saturday morning at the age of 19 due to complications after an accident. She will be cremated at the Ajronda crematorium in Sector 15, Faridabad. pic.twitter.com/A7gGwam2F5 — Bollywood Buzz (@BollyTellyBuzz) February 17, 2024 -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?
తెలుగు మూలలున్న అమ్మాయి. పుట్టిపెరిగింది అంతా అమెరికాలోనే అయినప్పటికీ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. పర్లేదు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడేమో సడన్‌గా హాలీవుడ్లో వరస మూవీస్ చేస్తూ బిజీ అవుతోంది. ఇంకా టీనేజీలోనే ఉన్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అవంతిక వందనాపు. ఈమె తల్లిదండ్రులది హైదరాబాద్. కాకపోతే కాలిఫోర్నియాలో సెటిలైపోయారు. ఆ తర్వాత 2005లో ఈమె పుట్టింది. పదేళ్ల వయసులోనే ఈమెకి తెలుగు సినిమాల్లో ఛాన్సులొచ్చాయి. నాని 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాల్లో ఓ చైల్డ్ ఆర్టిస్టుగా అవంతికనే చేయాల్సింది గానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయింది. అలా మహేశ్ 'బ్రహ్మోత్సవం' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) మహేశ్ సినిమాలో నటించిన తర్వాత ఈమెకు వరస ఛాన్సులొచ్చాయి. మనమంతా, ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి తదితర చిత్రాల్లో పలు క్యారెక్టర్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యలో కొన్ని యాడ్స్‌లోనూ నటించింది. వీటి తర్వాత తెలుగు చిత్రాలకు టాటా చెప్పేసిన అవంతిక.. పూర్తిగా కాలిఫోర్నియా షిఫ్ట్ అయిపోయింది. 2020 నుంచి హాలీవుడ్‌లోనే పలు సినిమాలు, ఆల్బమ్ సాంగ్స్ లాంటివి చేస్తూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం ఈమె వయసు 18 ఏళ్లు. కాకపోతే లేటెస్ట్ ఫొటోలు చూస్తుంటే మాత్రం అలా కనిపించట్లేదు. అలానే చైల్డ్ ఆర్టిస్టు ఫొటోలతో పోల్చి చూస్తే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. అందుకే ఈమెని తెలుగు ఆడియెన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఈమె ఎవరో తెలిసేసరికి అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?) View this post on Instagram A post shared by avantika (@avantika) -
సలార్ చైల్డ్ ఆర్టిస్ట్.. రవితేజ బంధువా? నటుడు ఏమన్నాడంటే?
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతకు ముందు వరకు డార్లింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోలేకపోయిన ప్రభాస్.. సలార్ మూవీతో జెండా పాతాడు. ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సినిమాలంటే చాలా ఇష్టం.. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్నప్పటి పాత్రను కార్తికేయ దేవ్ అనే కుర్రాడు పోషించాడు. జూనియర్ వరదరాజ మన్నార్‌గా ఇతడు నటించగా తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ పిల్లాడు మరెవరో కాదు.. రవితేజ బంధువే అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై కార్తికేయ దేవ్ స్పందిస్తూ.. 'నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మూవీస్ ఎక్కువగా చూస్తుంటాను. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. నేను సలార్ సినిమాలో నటిస్తున్నానని చెప్పినప్పుడు మా స్కూల్లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు వాళ్లంతా కూడా భలే చేశావ్ అంటున్నారు. నాకెవరూ తెలియదు సినీ ఇండస్ట్రీలో నాకెవరూ తెలియదు. అయితే కొందరు.. నాకు, రవితేజకు దగ్గరి పోలికలున్నాయన్నారు.. మరికొందరేమో అడివి శేష్ పోలికలు ఉన్నాయన్నారు. పోలికలున్నంత మాత్రాన వారికి బంధువైపోతానా? పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్ర చేస్తే అతడికి చుట్టమైపోతానా? పెద్ద సినిమాలో కనిపించేసరికి కచ్చితంగా నాకు ఏదో బ్యాగ్రౌండ్ ఉందనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. మా కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి పరిచయం లేదు. నేను రవితేజ బంధువుని అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు' అని క్లారిటీ ఇచ్చాడు కార్తికేయ. చదవండి: హీరోయిన్గా చేస్తూనే ఆ రిస్క్ చేయబోతున్న కీర్తి సురేశ్ -
ఓన్లీ సూపర్‌స్టార్
1970లలో బొంబాయి మొత్తంలో 10 ఇంపాలా కార్లు ఉంటే వాటిలో ఒకటి జూనియర్ మెహమూద్ది. 1960–70ల మధ్య సినిమాల్లో జూనియర్ మెహమూద్ ఒక సూపర్స్టార్లా వెలిగాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అతని ప్రాభవం వైరల్‌గా ఉండేది. శుక్రవారం జూనియర్ మెహమూద్ కన్నుమూశాడు. అభిమానులు అతని పాత పాటలను, సన్నివేశాలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. ‘హమ్ కాలే హైతో క్యా హువా దిల్ వాలే హై’... పాట ‘గుమ్నామ్’ (1965)లో పెద్ద హిట్. కమెడియన్ మెహమూద్ ఈ పాటకు డాన్స్ చేశాడు. సరిగ్గా మూడేళ్ల తర్వాత 1968లో అదే పాటకు ‘బ్రహ్మచారి’లో జూనియర్ మెహమూద్ డాన్స్ చేశాడు. అతని అసలు పేరు నయీమ్ సయీద్. అప్పటికి అతనికి ఏడెనిమిదేళ్లు కూడా లేవు. తనను ఇమిటేట్ చేసిన నయీమ్ సయీద్‌కు మెహమూద్ ‘జూనియర్ మెహమూద్’ అనే బిరుదు ఇచ్చి ఆశీర్వదించాడు. చనిపోయే వరకూ నయీమ్ అసలు పేరుతో కాకుండా జూనియర్ మెహమూద్గానే గుర్తింపు పొందాడు. 1968–70ల మధ్యకాలంలో జూనియర్ మెహమూద్ సూపర్‌స్టార్‌గా వెలిగాడు. సినిమాకు లక్ష రూపాయలు తీసుకునేవాడు. 1969లో రోజుకు 3000 రూపాయలు చార్జ్ చేసేవాడు. రాజేష్ ఖన్నా, జితేంద్ర, సంజీవ్ కుమార్లాంటి పెద్ద పెద్ద హీరోలతో కలిసి పని చేశాడు. ఇంపాలా కారులో తిరిగేవాడు. ఇతను స్టార్ అయ్యే ముందు వరకూ కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. అతని తండ్రి రైల్వే డ్రైవర్. కాని ఆ తర్వాత జూనియర్ మెహమూద్ సంపాదనతో అందరూ స్థిరపడ్డారు. రిలీజైన సినిమాకు ఫ్లాప్ టాక్ వస్తే జూనియర్ మెహమూద్తో పాట తీసి యాడ్ చేసి ఆడించిన సందర్భాలున్నాయి. శుక్రవారం 67 ఏళ్ల వయసులో జూనియర్ మెహమూద్ ముంబైలో కన్నుమూశాడు. భారతీయ చలనచిత్ర చరిత్రలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్‌డమ్‌ను చూసిన జూనియర్ మెహమూద్‌ను అభిమానులు తలచుకుని అతని సినిమా సన్నివేశాలను వైరల్ చేస్తున్నారు. -
ఈ ఫోటోలోని చిన్నారి ఓ సూపర్ స్టార్.. ప్రభాస్ ప్రాజెక్ట్-కెలో కీ రోల్!
నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. 1960లో తమిళ భాషా చిత్రం కలతుర్ కన్నమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత అతని ప్రయాణం ఇంత సుదీర్ఘంగా సాగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అతనే ఇప్పుడొక సూపర్ స్టార్. ఏకంగా ఆరు భాషల్లో నటించిన చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఏకంగా 232 చిత్రాలతో 64 సంవత్సరాల పాటు స్టార్‌గా కొనసాగిన హీరో అతనొక్కడే. ఇంతకీ ఆ సూపర్ స్టార్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి. 64 ఏళ్ల సినీ ప్రయాణం సినిమాల్లోకి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ ఆరు దశాబ్దాలు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ అతను యంగ్ హీరోలతో సమానంగా పోటీ పడుతున్నాడు. సినీ ప్రపంచంలో ఎందరో యువ నటులకు సైతం స్ఫూర్తిగా నిలిచిన మన హీరో ఆయనే తమిళ స్టార్ కమల్ హాసన్. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ వరకు 64 ఏళ్లగా పరిశ్రమలో ఆయన చేసిన ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. బాలనటుడిగా తాను నటించిన మొట్టమొదటి చిత్రానికే జాతీయ పురస్కారం అందుకున్న కమల్.. ఆ తరువాత జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని మూడు సార్లు గెలుచుకున్నాడు. తెలుగులోనూ బ్లాక్ బస్టర్స్ 1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగల్ మూవీ ఆయన కెరీర్‌నే మార్చేసింది. ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత తమిళంతో పాటు ఇతర భాషల్లో సైతం బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. మలయాళంలో సైతం స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నారు. మలయాళంలో దాదాపు 40కి పైగా చిత్రాలలో నటించారు. హిందీ, తెలుగు సినిమాల్లోనూ తనదైన ముద్రవేశారు. తెలుగులో ఆయన నటించిన మరో చరిత్ర, సాగర సంగమం, స్వాతి ముత్యం వంటి చిత్రాలు కమల్‌ను సూపర్‌స్టార్‌ను చేసేశాయి. హిందీలో ఏక్ దుజే కే లియే, సద్మా, సాగర్ వంటి చిత్రాల విజయం తర్వాత బాలీవుడ్లో ఫేమ్ సంపాదించారు. ఆ తర్వాత కన్నడ, బెంగాలీ చిత్రాల్లోనూ నటించారు. ఆయన నటించిన ఉలగనాయగన్ చిత్రం భారతీయ సినిమాలో ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం ద్వారా కమల్ హాసన్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు కొత్త సాంకేతికతను పరిచయం చేశారు. ఈ చిత్రంలో వినియోగించిన సాంకేతిక అంశాలను మెరుగుపరచడమే కాకుండా.. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఆ తర్వాత 1992లో తన చిత్రం తేవర్ మగన్‌తో మొట్టమొదటిసారి ఆస్కార్ ఎంట్రీతో భారతీయ సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. 1985 మరియు 1987 మధ్య ఏకంగా మూడు సినిమాలు ఆస్కార్‌కు నామినేషన్స్ సాధించాయి. వయసు పెరుగుతున్నా ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిగా బ్లాక్ బస్టర్ చిత్రం విక్రమ్‌లో కమల్ హాసన్ కనిపించారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం ఇండియన్2, ప్రాజెక్ట్- K చిత్రాల్లో నటిస్తున్నారు. 68 ఏళ్ల వయసులోనూ ప్రభాస్ చిత్రం కల్కి 2898-AD లో ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. తన 64 ఏళ్ల సినీ ప్రస్థానం సందర్భంగా ఆయన కూతురు శ్రుతి హాసన్, విజయ్ సేతుపతి వంటి పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 63 years since the release of Kalathur Kannamma. A landmark film for several reasons, the poignant story of Rajalingam, Kannamma & Selvam directed by A.Bhimsingh was a major commercial success, running for over 100 days in theatres. The film starring #GeminiGanesan & #Savithri,… pic.twitter.com/uN6Pjh8ouN — AVM Productions (@avmproductions) August 11, 2023 -
చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?
రజనీకాంత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చిత్రాల్లో చంద్రముఖి ఒకటి. ఈ సినిమా ఇప్పుడు వచ్చినా సరే చాలామంది టీవీలకే అతుక్కుపోతారు. అంతలా ప్రేక్షకాదరణ పొందిందీ మూవీ. రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2005లో విడుదలైంది. త్వరలోనే దీని సీక్వెల్ కూడా రిలీజ్ కానుంది. ఈ మూవీలో అత్తింధోం.. పాట చాలా ఫేమస్. ఈ పాటలో కనిపించే చిన్నారి గుర్తుందా? ముద్దుగా బొద్దుగా కనిపించే ఆమె పేరు ప్రహర్షిత శ్రీనివాసన్. బాలనటిగా ఎన్నో సినిమాలు, సీరియల్స్ చేసిన ఆమె తర్వాత ఎక్కువగా వెండితెరపై కనిపించనేలేదు. చంద్రముఖి 2 రిలీజ్‌కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ చిన్నారి ఎలా ఉందోనని కొందరు నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. 2021లో ప్రహర్షిత పెళ్లి చేసుకోగా గతేడాది ఆమెకు కూతురు పుట్టింది. 18 ఏళ్లపాటు బుల్లితెరకు దూరంగా ఉన్న ఈమె తమిళంలో ఓ కొత్త సీరియల్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో ఫోటోషూట్లు, కూతురితో ఆడుకున్న వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది. తాజాగా ఆమె చంద్రముఖి సినిమాలో చిన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడెలా మారిపోయానో తెలియజేస్తూ వీడియో షేర్ చేసింది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వేరే లెవల్ అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. View this post on Instagram A post shared by Praharshetha (@official_bommi) చదవండి: హైపర్ ఆది ఓవరాక్షన్.. ఇలాగైతే చిరంజీవికి కష్టమే -
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? మెగాస్టార్ చిరంజీవి రీల్ డాటర్!
చైల్డ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకుంటే దాదాపు ఇండస్ట్రీలోనే కొనసాగుతారు. లక్ కలిసొస్తే హీరోయిన్లు కూడా అయిపోతారు. కీర్తి సురేశ్, నిత్యా మేనన్.. ఇలా లిస్ట్ చూస్తే చాలా పెద్దగానే ఉంటుంది. అయితే ఈ అమ్మాయి మెగాస్టార్ చిరంజీవికి కూతురిగా నటించింది. ఆ సినిమా రిజల్ట్ గురించి పక్కనబెడితే బోలెడంత పేరు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ఇప్పుడేమో హీరోయిన్లకే పోటీ ఇచ్చేలా మారిపోయింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా? చిరంజీవి ఇప్పుడంటే కమర్షియల్ చిత్రాలు చేస్తున్నారు గానీ అప్పట్లో డిఫరెంట్ సబ్జెక్ట్లతో సినిమాలు చేస్తూ ఎంటర్టైన్ చేసేవారు. అలా తండ్రి-కూతురు అనుబంధం స్టోరీతో 'డాడీ'. ఇందులో చిరుకి హీరోయిన్గా సిమ్రన్ నటించినప్పటికీ.. ఎక్కువగా చైల్డ్ ఆర్టిస్ అనుష్క మల్హోత్రానే కనిపించింది. చిరుతో ఈమె సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆడియెన్స్ కి ఆకట్టుకున్నాయి. ఈ పాపకు 'డాడీ' తర్వాత పలు సినిమాల్లో అవకాశాలొచ్చినా నటించలేదు. (ఇదీ చదవండి: నటుడిగా పనికిరాడన్నారు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్నాడు!) ముంబయిలో పుట్టి పెరిగిన అనుష్క మల్హోత్రా.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్హమ్లో కుటుంబంతో కలిసి ఉంటోంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం మార్కెటింగ్ స్టేటజిస్ట్ అనే ఉద్యోగం పనిచేస్తోంది. ఇన్ స్టాలోనూ అప్పుడప్పుడు వీడియోలు, పోస్ట్ చేసే ఈమెని చూసి చాలామంది తొలుత గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా మంచి అందంగా తయారైంది. ఈమె ఫొటోలు చూస్తే మీరు ఇది నిజమేనంటారు. అయితే ఈమెకు ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయట. కానీ ఎందుకో యాక్టింగ్ వైపు ఆసక్తి చూపించట్లేదు. కానీ సోషల్ మీడియాలో ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ తనలోని టాలెంట్ ని చూపిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈమె ముక్కుపుడక అయితే.. ఈమె అందాన్ని మరింత హైలెట్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు లేటు. దిగువన ఫొటోలపై మీరు ఓ లుక్ వేసేయండి. View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra) View this post on Instagram A post shared by Anushka Malhotra (@anush.malhotra) (ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) -
అప్పుడేమో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో హీరోయిన్! (ఫోటోలు)
-
ఈ పాప గుర్తుందా? ఆ హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో
మీరు ఏ సినిమా తీసుకున్నా హీరోహీరోయిన్లతో పాటు చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఉంటారు. తమకు లభించన అవకాశాల్ని ఉపయోగించుకుని క్యూట్ యాక్టింగ్‌తో అలరిస్తుంటారు. ఈ పాప కూడా సేమ్ అలానే. మనకు బాగా తెలిసిన ఓ సినిమాలో హీరోయిన్‌కి చెల్లిగా నటించింది. ఇప్పుడేమో యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు గాబ్రియోలా నటాలియా ఛార్లటెన్. కాకపోతే గాబ్రియోలా అనే పేరుతో ఫేమస్ అయింది. ప్రస్తుతం సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తున్న ఈమె.. తొమ్మిదేళ్ల వయసులో కెరీర్ ప్రారంభించింది. ఓ ఛానెల్ లో ప్రసారమైన డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొంది. అలానే ఓ సబ్బుకి సంబంధించిన యాడ్ లోనూ నటించింది. దీని తర్వాత 'జోడీ నెంబర్ వన్' అనే డ్యాన్స్ షోలో విజేతగా నిలిచింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) ఇలా బుల్లితెరపై ఆకట్టుకున్న ఈమెకు ధనుష్-శ్రుతిహాసన్ నటించిన 'త్రీ' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం దక్కించుకుంది. ఇందులో హీరోయిన్ చెల్లిలి పాత్రలో కనిపించింది. కొన్ని సీన్లలో కనిపించి ఆకట్టుకుంది. చెన్నైయిల్ ఒరు నాళ్, అప్ప చిత్రాల్లోనూ నటించింది. బిగ్ బాస్ తమిళ్ నాలుగో సీజన్ లోనూ పార్టిసిపేట్ చేసింది. ప్రస్తుతం మాత్రం 'ఈర్మన రోజావే 2' సీరియల్ లో కావ్య పార్తిబన్ అనే గృహిణి పాత్ర చేస్తోంది. అయితే 'త్రీ' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా క్యూట్ గా కనిపించిన గాబ్రియోలా.. సీరియల్స్ లో చీరకట్టుతో పద్ధతిగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మాత్రం అస్సలు తగ్గట్లేదు. మోడ్రన్ డ్రస్సులు ధరిస్తున్నప్పటికీ గ్లామర్‌తో కట్టిపడేస్తోంది. అవి చూస్తున్న కుర్రాళ్లు.. ఎవరీ బ్యూటీ అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? (ఇదీ చదవండి: గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే) -
Baby Annie Photos: హీరోయిన్గా మారిన 'రాజన్న' చిన్నారి ఆని (ఫోటోలు)
-
హీరోయిన్గా మారిన ‘రాజన్న’ చైల్డ్ ఆర్టిస్ట్
టాలీవుడ్లో చాలా మంది చైల్డ్ ఆరిస్టులు హీరోయిన్గా మరి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే నిలదొక్కుకొని స్టార్ హీరోయిన్లుగా రాణించారు. తాజాగా రాజన్న లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన మెప్పించిన ఆని హీరోయిన్గా మారింది. ఆమె కథానాయికగా పరిచయం కాబోతున్న తొలి చిత్రం ‘తికమక తాండ’. రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్నారు.టిఎస్ఆర్ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ తిరుపతి శ్రీనివాసరావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్, చేరన్, విక్రమ్ కె.కుమార్ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1990 నేపథ్యంలో సాగే ఈ కథలో ఆని పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ.. సమాజంలో ఎప్పటినుండో ఉన్న ఒక సమస్య, ఆ సమస్య వల్ల ఒక గ్రామం అంతా మతిమరుపు సమస్యతో బాధపడుతుంటారు. ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారనే సామాజిక అంశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామంలో అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ చేశాం. రామక్రిష్ణ, హరిక్రిష్ణ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆని నటన ఈ చిత్రానికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ‘కుటుంబ ప్రేక్షకులతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుంది. సురేశ్ బొబ్బిలి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సిద్ శ్రీరామ్ పుత్తడి బొమ్మ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో 11 లక్షల వ్యూస్ తెచ్చుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది’అని నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు అన్నారు. -
యంగ్ హీరోయిన్ టాటూ.. చూపించుకోలేని ప్లేసులో అలా!
'96' సినిమా పేరు చెప్పగానే ఓ అందమైన లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. చిన్నప్పటి త్రిషగా చేసిన నటి.. ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తోంది. అలాంటి ఆ బ్యూటీ తన బాడీలో ఎవరికీ చూపించుకోలేని ఓ చోట టాటూ వేసుకుని హాట్ టాపిక్ అయిపోయింది. (ఇదీ చదవండి: డేట్‌కి వెళ్లిన మెగా కపుల్.. ఆ ఫొటోలు వైరల్) 96 రీమేక్ గా తెలుగులో తీసిన 'జాను'లోనూ నటించిన గౌరీ కిషన్.. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది. ఇప్పుడు మాత్రం హీరోయిన్ గా బిజీగా అయిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో తెలుగులో 'శ్రీదేవి శోభన్ బాబు' అనే మూవీలో నటించింది గానీ అది ఫ్లాఫ్ అవడంతో ఇక్కడ ఈమెకు అవకాశాలు రాలేదు. దీంతో తమిళ, మలయాళంలో మాత్రమే చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన గౌరీ.. తన ఒంటిపై టాటూ వేసుకుంటున్న చిన్న వీడియోని స్టోరీలో పోస్ట్ చేసింది. అది ఎక్కడ అనేది చెప్పుకోండి అని చిన్న పజిల్ పెట్టింది. ఆ తర్వాత కాసేపటికి తన రిబ్స్‌పై పచ్చబొట్టు వేసుకున్నానని చెబుతూ ఓ పిక్ షేర్ చేసింది. ఇది చూసి నెటిజన్స్ అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ టాటూ పిక్ కాస్త వైరల్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: ఆమె వల్ల చనిపోదామనుకున్నా.. నటుడు అబ్బాస్ కామెంట్స్) -
'బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం సినిమా గుర్తుందా? 2006లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ చెల్లి పాత్రలో నటించిన చిన్నారి ఇప్పటికీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇంతకీ ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోంది? ఎలా ఉందో తెలుసా? ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం. (ఇది చదవండి: అగ్రహీరోల సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్లో ఉండేలా ప్లాన్!) బంగారం మూవీలో వింధ్య రెడ్డి పాత్రలో కనిపించిన ఈ చిన్నారి అసలు పేరు శనూష. మలయాళంలో బాలనటిగా రెండు రాష్ట్ర స్థాయి సినీ అవార్డులను గెలుచుకుంది. అంతేకాదు మలయాళంలో పలు సినిమాల్లో నటించిన చిన్నారి. బంగారం సినిమాతోనే టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. బంగారం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా శనూష ఎంట్రీ ఇవ్వగా అప్పుడు ఆమె వయస్సు కేవలం 10 సంవత్సరాలే. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌ను ఆటపట్టిస్తూ అందరిని ఆకట్టుకుంది. ఇక ఆమె కెరీర్ విషయాకొనిస్తే.. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్‌గా బంగారం సినిమాతో ప్రేక్షకులను అలరించి.. ఆ తర్వాత ఐదేళ్లకు జీనియస్ అనే సినిమాతో హీరోయిన్గా అడుగు పెట్టింది. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోయినా తమిళ్ రీమేక్ చిత్రం రేణిగుంటలో కీలకపాత్రలో పోషించింది. 2019లో నాని హీరోగా వచ్చిన చిత్రం జెర్సీలో జర్నలిస్టు పాత్ర చేసింది. ఆమె పాత్ర చిన్నదే అయినా.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. శనూష ప్రస్తుతం మళయాళంలో వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. (ఇది చదవండి: ఫస్ట్ డేట్లోనే శృంగారానికి ఓకే: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by Sanusha Santhosh💫 (@sanusha_sanuuu) -
ఆ ఏజ్ లో పాప టాలెంట్,యాక్టింగ్ చూసి షాక్...అయ్యా బాబోయ్ చిచ్చరపిడుగు
-
నగ్న వీడియో షేర్ చేసిన నిత్యా శెట్టి.. నెటిజన్స్ ఫైర్
‘దేవుళ్లు’, ‘అంజి’ లాంటి సినిమాల్లో బాల నటిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యాశెట్టి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్గా రాణించేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంది. ‘నువ్వు తోపురా’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చినా..అంతగా గుర్తింపురాలేదు. ఆ తర్వాత చేసిన ‘ఓ పిట్ట కథ’లో నిత్యా నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. (చదవండి: అవకాశాలు లేక ఏడాదిపాటు ఇంట్లోనే కూర్చున్నా: స్టార్ హీరోయిన్) అయితే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకటి రెండు వెబ్ సిరీస్‌లో నటించినా.. గుర్తింపు లభించట్లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా అయినా పాపులర్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ని పెంచుకుంటుంది. అయితే తాజాగా నిత్యా శెట్టి నగ్న వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. బాత్రూంలో ఓపెన్‌గా టవల్ విప్పేస్తూ రెచ్చిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నువ్వేంటి ఇలా మారిపోయావ్? నీకేం పోయేకాలం వచ్చింది? ‘మీ మీద ఉన్న ఇష్టం పోతుంది మేడం’ అంటూ నెటిజన్ మండిపడుతున్నారు. (చదవండి: ‘విరూపాక్ష’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..) View this post on Instagram A post shared by Nitya Shetty (@nityashettyoffl) -
విక్రమార్కుడులో మెప్పించిన చిన్నారి.. ఇప్పుడెలా ఉందో తెలుసా?
సినీ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన వారు ఉన్నారు. వారిలో కొందరు స్టార్స్‌గా మారితే.. మరికొందరేమో కొన్ని సినిమాలతోనే సరి పెట్టుకున్నారు. కొద్ది మంది ఒక్క సినిమాలో కనిపించి కనుమరుగైన పోయిన వారు కూడా ఉన్నారు. కానీ ఓ సూపర్ హిట్ చిత్రంలో మెప్పించిన ఓ చిన్నారి ఇప్పుడెలా ఉందో ఓ లుక్కేద్దాం. రవితేజ డబుల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ 'విక్రమార్కుడు'. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాంతంలో జరిగిన కథను సినిమాగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన చిన్నారి మీకు గుర్తుందా? 'అమ్మ పాట వింటే నిద్ర వచ్చేస్తుంది నాన్న' అంటూ అమాయకంగా పలికిన ఆ చిన్నారి ఇప్పుడేం చేస్తోందో తెలుసా? ఆ వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం. విక్రమార్కడులో చైల్డ్ ఆర్టిస్ట్ నేహా చాలా సినిమాల్లో నటించింది. విక్రమార్కుడు సినిమాలో రవితేజ కూతురిగా.. అమాయకమైన పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ సినిమాలో నటనకు ఆ చిన్నారిని మెచ్చుకున్నారు. అనసూయ, రాముడు, ఆది విష్ణు, రక్ష, సర్కార్ చిత్రాల్లో కూడా కనిపించింది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడాలో నేహా జన్మించింది. అయితే చిన్నప్పుడే ఆ పాప తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ఆమె తల్లిదండ్రులు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందినవారు. నేహా దాదాపు పదేళ్లకు పైగా సినిమాల్లో నటించడం లేదు. అయితే ఆమె ప్రస్తుతం సినిమాల కంటే కెరీర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవలే ఎంబీఏ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. -
వంద సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన సహస్ర, ఇప్పుడేం చేస్తుందంటే?
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 100 సినిమాల్లో నటించింది సహస్ర. రౌడీ అల్లుడు, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు, సమర సంహారెడ్డి, మేజర్ చంద్రకాంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు స్టార్ హీరోలందరితోనూ నటించింది. అయితే చదువు పూర్తి చేయాలన్న ధ్యాసతో సినిమాలకు గుడ్‌బై చెప్పేసి ఉన్నత చదువులు చదివింది. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది నటి సహస్ర. 'మా నాన్నది వరంగల్. మేము హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడే సెటిలయ్యాం. ఏడాదిన్నర వయసుకే ఎక్కువ మాట్లాడేదాన్ని. నాన్న ఓ బిజినెస్ పార్టీకి వెళ్లినప్పుడు నన్ను చూసి సినిమాల్లో అడిగారు. ఇంత చిన్న పాప ఎలా చేస్తుందని నాన్న నో చెప్పాడు. కానీ నెక్స్ట్ డే అంకుల్ ఇంటికి వచ్చాడు. అప్పుడు మా పేరెంట్స్ లేరు, అమ్మమ్మ ఉంది. నేను చేస్తానని అంకుల్‌తో వెళ్లిపోయాను. అమ్మానాన్న వచ్చేసరికే మూడు సీన్లు కూడా చేశాను. అమ్మ, అమ్మమ్మ నాతోపాటు సెట్స్‌కు వచ్చేవారు. భానుచందర్‌గారి ఉద్యమం నా మొదటి చిత్రం. అప్పుడు నేను చిన్నపిల్లను కావడంతో హీరోలందరూ నాతో బాగా ఉండేవారు, ఆడుకునేవారు. రామ్‌చరణ్ ఇంటికి వెళ్లి అక్కడున్న టెడ్డీబేర్‌తో ఆడుకునేదాన్ని. ఒకసారి చెన్నైలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు చరణే ఉప్మా చేసి పెట్టారు. అది నా జీవితంలో మర్చిపోలేని క్షణాలు. సమరసింహారెడ్డి చివరి రోజు షూటింగ్ నాడు ప్రొడక్షన్ టీమ్‌లో ఉన్న అందరికీ వెండి ఉంగరాలు ఇచ్చాను. వాళ్లు చాలా ఎమోషనలయ్యారు. ఎన్టీఆర్.. నన్ను రండి, కూర్చోండి అని మాట్లాడేవారు. రెండోసారి సీఎం అయినప్పుడు కేబినెట్ మంత్రుల మీటింగ్ ఆపి మరీ నాతో లంచ్ చేశాడు. మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ టైంలో మనోజ్, నేను కలిసి సెట్‌కు వెళ్లేవాళ్లం. సమరసింహారెడ్డి నా చివరి సినిమా. చదువు మీద దృష్టి పెడదామని సినిమాలు మానేశాను. మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ పూర్తి చేశాను. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి.. వంటి స్టార్ హీరోలందరితో చేశాను. ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. -
అందాల చిన్నది లగ్జరీ కారు: ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్ చూడాలి!
సాక్షి, ముంబై: బాలనటి, టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. రివా అరోరా (13)రూ. 44 లక్షల విలువైన ఆడి కారును సొంతం చేసుకుంది. ఈమేరకు బ్లాక్ ఆడి కారుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లు ఆమెను అభినందించగా, మరికొందరు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. అసలు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ('డ్రైవింగ్ లైసెన్స్ బనా హై?') అంటూ మరి కొంతమంది ప్రశ్నించారు. రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్ల ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె తల్లి నిషా ఆమెకు విలాసవంతమైన కారును బహుమతిగా ఇచ్చింది. 44 లక్షలకు పైగా విలువైన బ్లాక్ ఆడి క్యూ3 కారుతో ఫోజులిస్తూ రివా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు ఫోటోలను తమ ప్యాన్స్‌తో పంచుకుంది. కొంచెం ఆలస్యమైనాగానీ, మొత్తానికి సెలబ్రేట్ చేసుకుంటున్నా..ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.. 10.6 మిలియన్ ఇన్‌స్టా ఫ్యామిలీ ఎంతో అపురూపమైన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో లైసెన్స్ ఉందా ముందు లైసెన్స్ తీసుకో అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. రివా అరోరా ఎవరంటే? రివా అరోరా ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న టీనేజ్ ఇన్ఫ్లుయెన్సర్. అంతేకాదు మామ్, మణికర్ణిక, మర్ద్ కో దర్ద్ నహీ హోతా, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ది సర్జికల్ స్ట్రైక్ , గుంజన్ సక్సేనాలో నటించింది. ఆమె చివరిగా రకుల్ ప్రీత్ నటించిన ఛత్రివాలిలో కనిపించింది. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతో ఆకట్టుకుంది. కాగా మికా సింగ్, కరణ్ కుంద్రాలతో రొమాంటిక్ రీల్ చేయడంపై చిన్నపిల్లతో డ్యాన్సులా అంటూ నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. 2010లో పుట్టిందని భావిస్తున్న రివా వయసుపై వివాదం ఉంది. అయితే తన వయసు 12 కాదంటూ రివా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. అలాగే రివా వయసు 12 కాదు 16 ఏళ్ల అని నిషా తల్లి ప్రకటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) View this post on Instagram A post shared by Riva Arora (@rivarora_) -
'పసివాడి ప్రాణం' చిత్రంలోని చిన్నోడు.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమా మీకు గుర్తుందా? అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రంలో విజయశాంతి జోడిగా నటించింది. 1987లో విడుదలైన ఈ చిత్రాన్ని ఎ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఎమోషనల్ చిత్రం ప్రేక్షకాదరణ పొంది ఘనవిజయం సాధించింది. చిరంజీవి కెరీర్లోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సుమలత ముఖ్యపాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన బాబుపైనే అందరి దృష్టి పడింది. ముద్దుగా కనిపించే అబ్బాయి పాత్రలో నటించింది ఎవరో మీకు తెలుసా? అతను ఇప్పుడెలా ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేద్దాం పదండి. అబ్బాయి కాదు అమ్మాయే పసివాడి ప్రాణం చిత్రంలో మెప్పించిన ఆ చిన్నారి అబ్బాయి కాదు.. అమ్మాయి అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆమె మనందరికి తెలుసు. తాను మరెవరో కాదు సీరియల్ నటి సుజిత. గతంలో స్టార్ మాలో ప్రసారమైన ‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాలోనూ హీరో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించింది. ఇక్కడే కాదు.. సుజిత చిన్నప్పుడు ఐదు భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. నటనలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవితోపాటు తెలుగులో వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. సుజిత ఎవరంటే.. 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో జన్మించింది. ఆమె ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి. ధనుష్ అనే నిర్మాతను వివాహమాడింది. ప్రస్తుతం చెన్నైలో నివాసముంటున్న సుజిత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించింది. మలయాళ సిరీస్ స్వాంతం మలూట్టీలో మొట్టమొదటి సారిగా ప్రధాన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది. ‘మారుతని’ సీరియల్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిసారిగా ‘దియా’, కణం అనే సినిమాల్లో నటించింది.(చదవండి: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ) View this post on Instagram A post shared by Sujithar (@sujithadhanush) -
చైల్డ్ ఆర్టిస్ట్ సించన ఆకస్మిక మృతి.. డాక్టర్ల డాక్టర్ల నిర్లక్షమేనన్న పేరెంట్స్
యశవంతపుర: బుల్లితెర బాలనటి సించన (15) ఆకస్మికంగా మృతి చెందింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వాంతి, విరేచనలు కావటంతో సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఆస్పత్రికి రాకముందే మృతి చెందినట్లు వైద్యులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సించన చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. సించనకు గొంతు వద్ద ఇంజక్షన్ ఇవ్వటంతో రక్తస్రావం ఎక్కువై మృతి చెందినట్లు తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు బాగలకుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. -
'జై చిరంజీవ' చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో జై చిరంజీవ ఒకటి. ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మెగాస్టార్ మేనకోడలిగా శ్రియా శర్మ నటించింది. తన చిన్ని చిన్ని మాటలతో, చిలిపి చేష్టలతో అలరించిన ఈమె చిరును మావయ్యా.. అంటూ ప్రేమగా పిలిచేది. ఈ మూవీలో చలాకీ నట ఇంచి అందరి మనసులు దోచిన ఈ పాప వయసు ఇప్పుడు 25 ఏళ్లు. మరి ఇప్పుడా బ్యూటీ ఎలా ఉంది? ఇప్పటిదాకా ఏయే సినిమాలు చేసింది? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.. 'జై చిరంజీవ' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయమైంది శ్రియా శర్మ. మరుసటి ఏడాదే 'నువ్వు నేను ప్రేమ'(సిల్లును ఒరు కాదల్) మూవీలో యాక్ట్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో బాల నటిగా రాణించింది. 'చిల్లర్ పార్టీ' సినిమాకు గానూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా జాతీయ అవార్డు అందుకుంది. మహేశ్‌బాబు- శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన దూకుడు మూవీలో సమంత చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. రచ్చ, తూనీగ తూనీగ, ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాల్లో టీనేజ్ గర్ల్‌గా కనిపించింది. అయితే హీరోయిన్గా తన మొదటి చిత్రం గాయకుడు. బిగ్‌బాస్ ఫేం అలీ రెజా ఇందులో హీరోగా నటించాడు. ఇది అంతగా విజయం సాధించలేదు. ఆ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్లో హీరోయిన్గా చేసింది. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ అవకాశాలు మాత్రం రానట్లే కనిపిస్తోంది. 2016లో నిర్మలా కాన్వెంట్ రిలీజవగా ఆ తర్వాత మరే సినిమాలో కనిపించలేదు శ్రియా శర్మ. ఓపక్క సినిమాలు చేసుకుంటూనే మరోపక్క కొన్ని సీరియల్స్‌లోనూ తళుక్కుమని మెరిసింది శ్రియా. ఇవే కాకుండా అనేక వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. న్యాయవిద్యను అభ్యసించిన శ్రియా శర్మ ప్రస్తుతం అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Shriya Sharma (@shriyasharma9) చదవండి: అభిమాని ఫోన్ విసిరేసిన హీరో, బాలయ్యలా ఉన్నాడే! -
ఆనంద్ మూవీ చైల్డ్ అర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకం చెప్పన్కర్లేదు. సినిమాలను తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాలంటే ఎలాంటి యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. రియలస్టిక్కు దగ్గర ఉండే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పాత్రలతో ప్రయోగాలు చేస్తారు. సెన్సిబుల్ పాయింట్‌తో ధైర్యం చేస్తారు. అలా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గుడుస్తున్న ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. చదవండి: బాలయ్య ఫ్యాన్స్ చంపేస్తారేమోనని భయపడ్డా!: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు వెండితెరపై రియల్ లైఫ్ పాత్రలను చూస్తున్నంత అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కుటుంబ నేపథ్యంలో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు ఆయా నటులు జీవం పోశారని చెప్పవచ్చు. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఆనంద్ ఆనంద్ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ హీరో రాజా చూట్టు తిరిగే చిన్నారి రోల్ కూడా ఒకటి. హీరో లిటిల్ ఫ్రెండ్‌గా సమత రోల్ పోషించింది ఆ చిన్నారి. చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్రల్లో ఆ చిన్నారి రోల్ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆనంద్ తర్వాత ఆ చిన్నారి తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ చిన్నారి 18 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఆమె అసలు పేరు భకిత. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భకిత మిగతా చైల్డ్ ఆర్టిస్టుల మాదిరిగా తిరిగి సినిమాల్లోకి రాలేదు. తన రూటే సపరేటు అంటూ భవిష్యత్తును కాస్తా భిన్నంగా ప్లాన్ చేసుకుంది. చదువుకుంటూనే సమాజ సేవలో పాల్గొంటుంది. చదవండి: విజయ్ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో తన 17 ఏళ్ల వయసు నుంచి మహిళల హక్కుల కోసం, ఆడవాళ్ల హక్కులు గురించి పోరాడుతుంది. అంతేకాదు పిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యచారాలు, అఘాత్యాయిలను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ఉద్యమం చేస్తుందట. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న భకిత ఇప్పుడు సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం మానేసి సినిమాల్లోకి : నటి
కొంత మంది సినిమా కళ కోసమే పుడతారేమో అనిపిస్తుంది వాళ్ల నటనాతృష్ణను చూస్తుంటే! ఆ వరుసలో నటి నిత్యా శెట్టినీ చేర్చొచ్చు. బాలనటిగా వెండితెర మీద పరిచయమై.. ఇప్పుడు హీరోయిన్గా రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇటు వెబ్ తెర అవకాశాలనూ అందుకుంటోంది. ► చిన్నప్పుడు షూటింగ్లో అందరూ నన్ను గారాబం చేసేవాళ్లు. బోల్డన్ని చాక్లెట్లు ఇచ్చేవాళ్లు. అప్పుడు వాటన్నింటినీ ఎంతో ఇష్టంగా తినేదాన్ని. కానీ, ఇప్పుడు వాటికి దూరంగా ఉంటున్నా. హీరోయిన్ అంటే స్లిమ్‌గా ఉండాలి కదా. ► నిత్యా శెట్టి నిత్యా పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హైదరాబాద్‌లోనే. ఇంజినీరింగ్ పూర్తి చేసి, సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కొంతకాలం పనిచేసింది కూడా. స్కూల్ డేస్‌లోనే బాలనటిగా ‘దేవుళ్లు’, ‘అంజి’ వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ► ‘చిన్ని చిన్ని ఆశ’, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాల్లోని నటనకు ఉత్తమ బాలనటిగా నంది అవార్డులూ అందుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తెలుగులో ‘దాగుడుమూత దండాకోర్’, ‘పడేసావే’ చిత్రాల్లోనూ, కొన్ని తమిళ చిత్రాల్లోనూ నటించింది. ► ‘నువ్వు తోపురా’ సినిమాతో కథానాయికగా నిత్యా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చినా పెద్దగా పేరు రాలేదు. అయితే, ఆమే హీరోయిన్గా ఈ మధ్యనే వచ్చిన ‘ఓ పిట్ట కథ’ మంచి విజయం సాధించింది. ఇందులోని నిత్యా నటన ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమ్ అవుతోన్న ‘హలో వరల్డ్’ సిరీస్‌తో వీక్షకులను అలరిస్తోంది. -
సీరియల్ నటి ఆత్మహత్య కేసులో సహనటుడు అరెస్ట్
ప్రముఖ సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్య ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. షూటింగ్ సెట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ధృవీకరించారు. ఇక ఈ కేసులో విచారణను ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సహ నటుడు షీజన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. తునీషా, షీజన్ రిలేషన్లో ఉండేవారని, అతని వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందంటే తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో అతన్ని అరెస్టి చేసి విచారిస్తున్నామని ఏసీపీ చంద్రకాంత్ తెలిపారు. కాగా తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తునీషా ఇలా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం బాధాకరమని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా
చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోయిన్లుగా అవతారం ఎత్తడం కొత్తేమీ కాదు. దివంగత నటి శ్రీదేవి నుంచి ఎందరో నటీమణులు కథానాయికులుగా రాణించారు. రాణిస్తూనే ఉన్నారు. ఆ కోవలో తాజాగా నటి అనిఖా సురేంద్రన్ చేరింది. ఈ కేరళ కుట్టి 2007లోనే బాలతారగా పరిచయమైంది. మలయాళం, తమిళం, తెలుగుభాషల్లో నటించి బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో అజిత్ హీరోగా నటించిన ఎన్నై అరిందాల్ చిత్రంలో త్రిషకు కూతురుగానూ, విశ్వాసం చిత్రంలో అజిత్, నయనతార కూతురుగానూ నటించి బాగా పాపులర్ అయ్యింది. కాగా 18వ ఏట అడుగుపెట్టిన అనిఖా హీరోయిన్గా అవకాశాలు కోసం ప్రయత్నాలు మొదలెట్టింది. అందులో భాగంగా ఇటీవల సామాజిక మాధ్యమాలను బాగా వాడుకుంటోంది. తన గ్లామరస్ ఫొటోలను తరుచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ చిత్ర పరిశ్రమ దృష్టి తనపై పడేలా చేసుకోవడంలో సక్సెస్ అయ్యింది. అంతేకాదు జూనియర్ నయనతార అనే ముద్రవేసుకుంది. ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చేసింది. తెలుగులో బుట్టబొమ్మ అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా కోలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ సంగీత దర్శకుడు, నటుడు హిప్ హాప్ తమిళాకు జతగా నటించనుంది. మీసై మురుక్కు చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమైన హిప్ హాప్ తమిళా ఆ తర్వాత నట్పేతునై, నాన్ సిరిత్తాల్, శివకుమారిన్ శపథం, అన్బరివు చిత్రాల్లో నటించారు. తాజాగా వెల్స్ ఫిలిమ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ఆయనకు జంటగా నటి అనిఖా సురేంద్రన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి కార్తీక్ వేణుగోపాలన్ దర్శకత్వం వహిస్తున్నారు. View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) చదవండి: మహేశ్ బాబు భార్య నమ్రత కొత్త రెస్టారెంట్, రేట్స్ ఎలా ఉన్నాయంటే..! ఘనంగా నటి శ్రీవాణి గృహప్రవేశం వేడుక, నటీనటుల సందడి.. ఫొటో వైరల్ -
‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట’పాప ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా?
చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి.. హీరోయిన్గా ఎదిగినవారు టాలీవుడ్లో చాలానే ఉన్నారు. శ్రీదేవి, రాశి, మీనా, రోజా, లయ.. ఇలా ఎందరో బాల తారలుగా వచ్చి హీరోయిన్స్‌గా తమకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోగలిగారు. వీరిలో కొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా అయ్యారు. తాజాగా మరో చైల్డ్ ఆర్టిస్టు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమే కావ్య కల్యాణ్‌రామ్. కావ్య అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. కాని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తొలిచిత్రం ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. అక్షరాలా తెలుగు అమ్మాయి. హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. దాదాపు 16 చిత్రాల్లో బాలనటిగా నటనతో మెప్పించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. తాజాగా ‘వల్లంకి పిట్ట’ హీరోయిన్గా ‘మసూద’ సినిమాలో నటించింది. హారర్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం శుక్రవారం(నవంబర్ 18) విడుదలైంది. ఇందులో కావ్య నటనను మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రంతో పాటు వారాహి క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘ఉస్తాద్’లో కూడా కావ్య హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
అరుంధతి మూవీలో బాలనటి.. అంతలా మారిపోతుందని ఊహించలేదు..!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'అరుంధతి'. ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా అనుష్క ఫేమస్ అయిపోయింది. అందరూ జేజమ్మ అంటూ ముద్దుగా పేరు పెట్టారు. అయితే ఈ సినిమాలో బాలనటిగా ఓ చిన్నారి అద్భుతంగా నటించింది. తన డైలాగులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ ఎవరా చిన్నారి అనుకుంటున్నారా? బాలనటిగా మెప్పించిన దివ్య నగేశ్ అందరినీ తనదైన నటనతో మెప్పించింది. అయితే ప్రస్తుతం ఆ చిన్నారి ఇప్పుడెలా ఉంది? తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చదివేయండి. (చదవండి: కాంతార మూవీ.. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరో తెలుసా?) చలనచిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి అగ్రతారలుగా ఎదిగిన వాళ్లు చాలామంది ఉన్నారు. మరికొందరు ఒకటి, రెండు సినిమాలతోనే మర్చిపోలేని గుర్తింపును పొందారు. అలానే అరుంధతి సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్ర పోషించిన చిన్నారి దివ్య నగేశ్ కూడా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం మలయాళంలో ఆమె పలు సినిమాలు కూడా చేసింది. టాలీవుడ్లో 'నేను నాన్న అబద్దం' అనే సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది దివ్య నగేశ్. ఇటీవలే ఆమె లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది అరుంధతి బాలనటి దివ్య నగేశ్. -
తీవ్ర విషాదం.. 'ఛెల్లో షో' మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాను సైతం వెనక్కు నెట్టి.. ఆస్కార్‌కు నామినేట్ అయిన ఛెల్లో షో (ద లాస్ట్ షో) సినిమాలో నటించిన బాల నటుడు రాహుల్ కోలీ (10) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న రాహుల్ తుదిశ్వాస విడిచాడు. కాగా ఛెల్లో షో సినిమా ఈనెల 14న విడుదల కానుంది. అంతలోనే రాహుల్ మరణించడంతో చిత్రబృందంతో పాటు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పదేపదే జ్వరం బారిన పడుతున్న రాహుల్, ఇటీవలె రక్తపు వాంతులు చేసుకున్నాడని రాహుల్ తండ్రి రాము కోలీ తెలిపారు. అక్టోబర్ 2న ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే తము కళ్ల ముందే బిడ్డ చనిపోయాంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 14వ తేదీన తాము ఛెల్లో షో సినిమా చూడాలనుకున్నామని, కానీ ఇంతలోనే తమ కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాలండూ రాహుల్ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యాడు. కాగా సినిమాలపై ఎంతో ఇష్టం కలిగిన తొమ్మిదేళ్ల యువకుడి జీవితం ఎలా సాగిందన్న నేపథ్యంతో ఛెల్లో షో సినిమా సాగుతుంది. ఇందులో మొత్తం ఆరుగురు పిల్లలు నటించగా వారిలో రాహుల్ కోలీ ఒకడు. అతని మృతి పట్ల పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్‌పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్‌తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్‌గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్‌గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్‌గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
పెళ్లి చేసుకున్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్, ఫొటోలు వైరల్
'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుందా! మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్డిస్ట్గా నటించిన ఈమె పేరు సుహాని కలిత. బాలనటిగానే కాకుండా హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కింది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో ఏడడుగులు నడిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. ప్రేమంటే ఇదేరా, గణేష్, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా అలరించింది. తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. పలు కంపెనీల వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్గా మారింది. కానీ కథానాయికగా ఆమెకు పెద్ద గుర్తింపు రాలేదు. చివరగా ఆమె తెలుగులో 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది. చదవండి: పెళ్లిరోజే ఆ ముచ్చట తీరదన్న ఆలియా, మరి కత్రినా ఏమందంటే? ఏడ్చేసిన రేవంత్, ఏం పరిస్థితి తెచ్చావు సామీ -
'బింబిసార'లో అమాయకత్వంతో ఆకట్టుకున్న ఈ పాప ఎవరంటే?
త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా కల్యాణ్ రామ్ అదరగొడుతున్న చిత్రం 'బింబిసార'. శుక్రవారం(ఆగస్ట్ 5న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సినిమా. టైమ్ ట్రావేల్ అనే సరికొత్తగా ప్రయోగం చేసిన కల్యాణ్ రామ్‌కు చాలా గ్యాప్ తర్వాత మంచి విజయం లభించింది. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ నటనకు, విజువల్స్ మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులకు కూడా మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 'బింబిసార'లో చిన్నారి పాత్రలో నటించి అందరి మన్ననలు పొందింది బేబి శ్రీదేవి. త్రిగర్తల సామ్రాజ్యంలో ఆయుర్వేద పండితుడి (తనికెళ్ల భరణి) మనవరాలు శాంభవిగా, భూలోకంలో బింబిసారుడి వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్లగా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. బేబి శ్రీదేవి అమాయకత్వం, కల్యాణ్ రామ్‌తో వచ్చే సీన్లు మనసుకు హత్తుకుంటాయి. అయితే ప్రస్తుతం ఈ పాప ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ పాప ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన బేబి శ్రీదేవి తల్లిదండ్రులు శ్రీహరి గౌడ్, శ్రీలక్ష్మి. వీరు హైదరాబాద్‌లో నివాసముండగా, శ్రీహరి గౌడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న బేబి శ్రీదేవి పున్నాగ, పౌర్ణమి, చెల్లెలి కాపురం, కల్యాణ వైభోగం వంటి 15 సీరియల్లలో నటించి ఆకట్టుకుంది. అలాగే మేజర్, రామా రావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాల్లో సైతం నటించింది. View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) View this post on Instagram A post shared by Sridevi Bangaram (@sridevi_bangaram39) -
‘మై ఫ్రెండ్ గణేశా’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
ఎహ్సాస్ చన్నా.. ఊహ తెలిసినప్పటి నుంచి ఆమెకెరుకైన.. ఆమెను ఎరిగిన ప్రపంచం ఒక్కటే సినిమా ప్రపంచం! చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి.. నటిగా ఆమె పెరిగింది.. ఎదిగింది అక్కడే! ఓటీటీ వచ్చాక ఆ ప్లాట్‌ఫామ్‌కూ తన పరిచయాన్నిచ్చి వెబ్ వీక్షకుల అభిమానాన్నీ సంపాదించుకుంటోంది. ► పుట్టింది పంజాబ్‌లోని జలంధర్‌లో. పెగింది ముంబైలో. తండ్రి.. ఇక్బాల్ బహదూర్ సింగ్ చన్నా, ప్రొడ్యూసర్. తల్లి.. కుల్బిర్ బహదూర్ సింగ్ చన్నా.. నటి. ► నటనా వాతావరణంలోనే పుట్టి.. పెరగిన ఎహ్సాస్.. తన నాలుగో ఏటనే సినీరంగ ప్రవేశం చేసింది. ‘వాస్తు శాస్త్ర’, ‘కభీ అల్విద నా కెహనా’, ‘మై ఫ్రెండ్ గణేశా’ మొదలు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఆమె నటించిన ఎన్నో సినిమాల్లో అబ్బాయి పాత్రలనే ఎక్కువగా పోషించింది. టీవీ సీరియళ్లలోనూ బాలవేషాలు వేసింది. ► డబ్స్మాష్ చేయడంలో దిట్ట. ఆమె ‘మ్యూజికల్లీ (టిక్‌టాక్ లాంటిది)’ వీడియోస్‌కు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ► ఐఐటీ అభ్యర్థుల ఇతివృత్తంతో వచ్చిన ‘కోటా ఫ్యాక్టరీ’తో వెబ్ సిరీస్‌లో నటించడం మొదలుపెట్టింది ఎహ్సాస్. అందులోని ఆమె నటన ఇంకొన్ని ఓటీటీ అవకాశాలను తెచ్చిపెట్టింది. వాటిల్లో ఒకటి ‘గర్ల్స్ప్లెయినింగ్’ సిరీస్. ► ఎహ్సాస్ .. మోడలింగ్‌లో కూడా కాలుమోపింది. ‘గీతాంజలి ఫ్యాషన్ వీక్’లో వాళ్లమ్మతో కలసి ర్యాంప్‌వాక్ చేసింది. ► టీనేజ్ పిల్లలు ఎదుర్కొనే సమస్యల మీద ‘డియర్ టీనేజ్ మి’ అనే పాడ్‌కాస్ట్ చానెల్‌ను నిర్వహిస్తోంది. ► వైవిధ్యమైన షూలు, మేకప్ వస్తువులు కలెక్ట్ చేయడం ఆమెకు సరదా. టీనేజ్‌లో ఉన్నప్పుడు కాస్త అటెన్షన్ సీకింగ్ అమ్మాయిగా ఉండేదాన్ని. నా స్వభావం కాకపోయినా పదిమంది దృష్టి నా మీద పడడానికి డిఫరెంట్‌గా ఉండడానికి ప్రయత్నించేదాన్ని. ఇప్పుడు ఆలోచించుకుంటే నవ్వొస్తుంది. అయితే ఆ తప్పులన్నీ నన్ను నేను సరిదిద్దుకోవడానికి.. నేనీరోజు ఇలా నిలబడ్డానికి దోహదపడ్డవే. అందుకే నాలోని ఏ చిన్న గుణాన్నీ మార్చుకోవడానికి ఇష్టపడను. – ఎహ్సాస్ చన్నా View this post on Instagram A post shared by Ahsaas Channa (@ahsaassy_) చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్, వరుడు ఎవరంటే.. ఆ వ్యక్తి ఆరేళ్లు వేధించాడు.. క్షమించి వదిలేశా -
'జయం' చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
విలక్షణ దర్శకుడు తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమకావ్యం జయం. ఇందులోని ప్రతి పాత్రను ఎంతో ప్రత్యేకంగా మలిచాడు డైరెక్టర్. ముఖ్యంగా అక్షరాలను తిప్పిరాసే హీరోయిన్ చెల్లెలి పాత్రను ప్రజలు ప్రేమించారు. తన నటనతో నంది అవార్డు గెలుచుకుంది. నేటికి జయం సినిమా వచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా ప్రస్తుతం యామిని ఎక్కడుంది? ఏం చేస్తుంది? అనేది చూద్దాం.. సీరియల్ ఆర్టిస్ట్ జయలక్ష్మి కూతురే జయం చైల్డ్ ఆర్టిస్ట్ యామిని శ్వేత. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మాత్రమే శ్వేత స్క్రీన్‌పై కనిపించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అందుకే చిన్నతనంలో పలు పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పెద్దయ్యాక మాత్రం హీరోయిన్ కాలేకపోయింది. జయం కంటే ముందే దాదాపు 10 సీరియల్స్ చేసింది. సీతామాలక్ష్మి సీరియల్ చేస్తున్న సమయంలో జయం ఆడిషన్స్ కోసం ప్రకటన వచ్చింది. అది చూసి ఆమె తండ్రి తన ఫొటోలు డైరెక్టర్‌కు పంపారు. అలా హీరోయిన్ చెల్లెలిగా నటించింది. ఉత్సాహం, అనగనగా ఓ కుర్రాడు వంటి సినిమాలు చేశాక చదువుపై దృష్టి పెట్టింది. విదేశాల్లో మాస్టర్స్ చేసి అక్కడే ఉద్యోగం చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్‌లో స్థిరపడిపోయిన ఆమెకు ఓ కూతురు పుట్టింది. ఇకపోతే చదువుకునే సమయంలో బోలెడన్ని ఆఫర్లు వచ్చినా కూడా వాటిని సున్నితంగా తిరస్కరించింది. అందులో నచ్చావులే సినిమా కూడా ఒకటి. ఇక నంది అవార్డుకు వచ్చిన రెమ్యునరేషన్‌ను సైతం మానసిక వికలాంగుల ఆశ్రమానికి దానం చేసి గొప్ప మనసు చాటుకుంది. అయితే శ్వేత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తే బాగుంటుందంటున్నారు ఫ్యాన్స్. View this post on Instagram A post shared by Yamini Swetha (@yamini_swetha) View this post on Instagram A post shared by Yamini Swetha (@yamini_swetha) చదవండి: పెళ్లి చేసుకున్నాం, కానీ మా లైఫ్‌లో పెద్ద ఛేంజ్ ఏం లేదు తెలుగులో వస్తున్న ఏనుగు, ట్రైలర్ చూశారా? -
‘ఒక్కడు’లో మహేశ్ చెల్లెలు ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుంది?
చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారు చాలామంది టాలీవుడ్లో ఉన్నారు. రాశి, శ్రీదేవి, మీనా లాంటి హీరోయిన్లు.. చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చిన వారే. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారని గ్యారెంటీ లేదు. పెద్దయ్యాక సినిమాలకు గుడ్‌బై చెప్పి, పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటివారిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ నిహారిక కూడా ఒక్కరు. నిహారిక అంటే ఎవరు గుర్తుపట్టరు కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. గుణశేఖర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘ఒక్కడు’ సినిమా గుర్తింది కదా? ఈ మూవీలో ‘ఒరేయ్ అన్నయ్యా..’ అంటూ మహేశ్‌ను ఆటపట్టించిన అల్లరి చెల్లి ఆశ గుర్తొచ్చిందా? ఆ అల్లరి పిల్లనే బేబీ నిహారిక. ఆమె అప్పుడు బేబీ కానీ ఇప్పుడు మాత్రం..ఇద్దరు పిల్లల తల్లి. వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం రా’, మోహన్ బాబు ‘యమజాతకుడు’తో పాటు పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన నిహారిక.. ‘ఒక్కడు’ చిత్రం తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా చదువుపైనే దృష్టి సారించింది.పదేళ్ల క్రితం పొలిటికల్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు. అసలు నిహారిక సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు? ఒక్కడు మూవీ ఆఫర్ ఎలా వచ్చింది? ఆమెది ప్రేమ వివాహామా? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా? ప్రస్తుతం నిహారిక ఏం చేస్తున్నారు? మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? తదితర విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోపై ఓ లుక్కేయండి. -
తూనీగా తూనీగా.. అంటూ ఆడిపాడిన నటి నిశ్చితార్థం!
మనసంతా నువ్వే సినిమాలో 'తూనీగా తూనీగా.. ఎందాక పరిగెడతావే రావే నా వంకా..' అంటూ ఆడిపాడిన చిన్నారి గుర్తుంది కదా! ఈమె పేరు సుహాని కలిత. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే కాకుండా నటిగా, హీరోయిన్‌గానూ మెప్పించిన ఆమె తాజాగా పెళ్లిపీటలెక్కబోతోంది. సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడబోతోంది. ఈ మేరకు ఇటీవలే అతడితో నిశ్చితార్థం సైతం జరుపుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా బాల రామాయణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయింది సుహాని. గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. అదే సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడ కూడా సినిమాలు చేసింది. ఆ తర్వాత పలు కంపెనీల యాడ్స్‌లోనూ తళుక్కున మెరిసింది. 2008లో సవాల్ సినిమాతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ కథానాయికగా తనకు పెద్ద గుర్తింపు రాలేదు. ఆమె తెలు చివరగా 2010లో స్నేహగీతం సినిమాలో కనిపించింది. చదవండి: లవ్ బ్రేకప్, దత్తత ద్వారా తల్లయిన నటి నా సినిమాలు మీరే కాదు నేను కూడా చూసుకోలేదు -
‘ఆచార్య’లో నటించిన ఈ బాలుడు ఎవరో తెలుసా!
సాక్షి,మందమర్రిరూరల్: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్‌కు నటించే అవకాశం లభించింది. మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్ శ్రేయాష్ హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆచార్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకగా శ్రీధర్ మిత్రుడు విజయ్‌కుమార్‌కు తెలిసిన వారి ద్వారా సినిమా వాళ్లకి పరిచయం చేశారు. ఆడిషన్లో డైలాగ్‌లు బాగా చెప్పడంతో ఎంపిక చేసుకున్నారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాడు. ఆచార్య సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం సంతోషంగా ఉందని డాక్టర్ సదానందం తెలిపాడు. పట్టణంలోని ప్రైవేట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలుడిని అభినందించారు. చదవండి: Acharya Movie Review: సాక్షి ఆడియన్స్ పోల్.. 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ -
'దృశ్యం' సినిమా పాప ఇప్పుడు ఎలా ఉందో చూడండి (ఫోటోలు)
-
హీరోగా పరిచయమవుతున్న చైల్డ్ ఆర్టిస్ట్ సన్నీ
'ఆశలపల్లకి'లో బాలనటుడిగా నటించిన సన్నీ పస్తా హీరోగా పరిచయమవుతున్న సినిమాకు కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రం ద్వారా కార్తీక్ పంపాల దర్శకునిగా పరిచయమవుతున్నారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్, బెక్కెం సబిత నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ కెమెరా స్విచ్చాన్ చేయగా దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ బాబీ గౌరవ దర్శకత్వం వహించారు. బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. లక్కీ మీడియా బ్యానర్ స్థాపించి 16 ఏళ్లు అయిన సందర్భంగా మా బేనర్లో 13వ సినిమా ప్రారంభించాం. మంచి ప్రేమకథగా అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ ఉంటుంది అన్నారు. లక్కీమీడియా ద్వారా హీరోగా పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు సన్నీపిస్తా. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు కార్తీక్ పంపాల. ఈ చిత్రానికి కెమెరా: మితేష్.పి, సహ నిర్మాత: నాగార్జున వడ్డే(అర్జున్). చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రచ్చ చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఆ పాట సూడు, ఆ ఆట సూడు.. నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్ చూడు.. -
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్...మల్లి!
-
బంగారం మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
-
బంగారం మూవీలో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Bangaram Movie Child Artist, Sanusha Santhosh Present Photos Goes Viral: పవన్ కల్యాణ్, మీరాచోప్రా జంటగా నటించిన ‘బంగారం’సినిమాలో హీరోయిన్ చెల్లెలిగా నటించిన అమ్మాయి గుర్తుందా? వింధ్య రెడ్డి పాత్రలో నటించి మెప్పించిన ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సనూషా సంతోష్. బంగారం సినిమాతో బాలనటిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. అయితే అంతకుముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా మలయాళంలో 20కి పైగా సినిమాల్లో నటించింది. అలా ఉత్తమ బాలనటిగా చిన్న వయసులోనే రెండు సార్లు జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. 2012లో మిస్టర్ మురుగన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన సనూషా..ఆ తర్వాత రేణిగుంట, జీనియస్ వంటి చిత్రాల్లోనూ నటించింది. చివరగా నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో జర్నలిస్ట్ రమ్య పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్‌లోనే స్థిరపడిపోయింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ.సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ని షేర్ చేస్తుంటుంది. అయితే ఈ అమ్మడి శరీరాకృతిపై కొందరు నెటిజన్లు బాడీ షేమింగ్ చేసినా ధీటుగా జవాబిస్తుంది.ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సానుష..లాక్డౌన్ సమయంలో ఎంతో నిరాశ, ఒంటరితనాన్ని ఫీలయ్యానని, ఆ సమయంలో ఎవరికి తెలియకుండా ఓ మానసిక వైద్యుడిని కూడా సంప్రదించినట్లు వెల్లడించింది. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి సారించినట్లు తెలిపింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sahasra: బాల నటి భళా.. కుట్టి
ఏ తల్లిదండ్రి అయినా సంతృప్తిగా.. సంతోషంగా.. ఉన్నారు అంటే వారి పిల్లల ఎదుగుదలను చూసినపుడే.. అనేది వంద శాతం వాస్తవం. పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యాక కొంతమంది సంతోష పడితే, మరికొందరు మాత్రం బుడిబుడి అడుగులు వేస్తున్ననాటి నుంచి తల్లిదండ్రులను ఎంతో సంతోష పెడుతున్నారు. ఆ కోవకు చెందినదే మన బాల్యనటి సహస్ర. చిన్నతనం నుంచి తన నటనతో ఎంతో మంది హృదయాల్లో నిలిచింది. మాటీవిలో ప్రసారమయ్యే ‘పాపే మా జీవన జ్యోతి’ ధారావాహిక చైల్డ్ ఆర్టిస్ట్ కుట్టి పాత్రలో జీవిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల నుంచి మన్ననలు పొందుతోంది ఈ సహస్ర. – చింతల్ సహస్ర ప్రస్థానం ఇలా.. ► నిజాంపేటలోని భాగ్యలక్ష్మిహిల్స్లో నివాసముండే దర్పల్లి అనిల్‌కుమార్, లీలా దంపతులకు 2013 డిసెంబర్ 9వ తేదీన సహస్ర జన్మించడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ► తండ్రి అనీల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ కాలనీలో నిర్మాణ్ మానసిక వికలాంగుల కేంద్రాన్ని నడిపిస్తూ తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్‌గా కొనసాగుతోంది. ► చిన్నతనంలోనే సహస్ర హావభావాల వీడియోలను అనీల్‌కుమార్ దంపతులు మొబైల్లో రికార్డ్ చేస్తూ ఉండేవారు. చిన్ననాటి నుంచే డ్యాన్స్‌లో.. ► పువ్వుపుట్టగానే పరిమళించును అన్న చందంగా చిన్ననాటి నుంచే సహస్ర టీవీలో వచ్చే పలు ప్రకటనలు, సీరియల్స్‌ను ఆసక్తిగా గమనించేది. ►సహస్ర తల్లిదండ్రులు అనీల్‌కుమార్, లీల దంపతులు విద్యావంతులు కావడంతో తమ కుమార్తెకు ప్రోత్సాహాన్ని అందించారు. ► తమకు తెలిసిన మిత్రుల సహాకారంతో సహస్ర పోషించిన పాత్రలు, నృత్యాలకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమమైన యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. ► ఆ విధంగా బుల్లితెరకు పరిచయమై తన సహజమైన నటనతో ‘పాపే మా జీవనజ్యోతి’ అనే మాటీవీ సీరియల్లో కుట్టి పాత్రకు ఎంపికైంది. ► ఇలా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన సహస్ర తనకు ఇచి్చన కుట్టి పాత్రకు జీవం పోస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకుంది. తెలుగు భాషపై పట్టు.. ► సహస్ర జేన్ఎటీయూ కూకట్‌పల్లిలోని నారాయణ హైస్కూల్లో మూడో తరగతి చదువుతోంది. ► ఈ బాల నటి గ్రామీణ భాష నుంచి నవీన భాషలోని మాండళికం తన తోటి కళాకారులను సైతం అబ్బురపరుస్తూ.. భావితరాలకు స్ఫూర్తిదాయకమై.. సినీ వినీలాకాశంలో తళుక్కున మెరుస్తున్న నక్షత్రం ఈ సహస్ర. ► తెలుగు కళామతల్లి వడిలో ఓనమాలు దిద్దుకుంటున్న ఈ చిన్నారి మున్ముందు సినీ రంగంలో ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని ఆశిస్తూ.. నేటి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఆశీర్వదిద్దాం. అన్నింటిలోనూ ముందే.. చదువుతో పాటు నటన, నాట్యం, సంగీతంలో తన ప్రతిభను చాటుతోంది. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పలు సీరియళ్లకు, సినిమాలకు తన వాయిస్‌ను సైతం అందిస్తోంది. చక్కని ప్రతిభతో అనేక వెబ్ సిరీస్‌లలో న టిస్తోంది. పలు వ్యాపార సంస్థల ప్రకటనల్లో వంట పాత్రలను కడిగినంత సులువుగా తనకు తానే పోటీగా ఇచ్చిన పాత్రలో అంతలా ఒదిగి పోతుంది ఈ చిచ్చర పిడుగు. -
ప్రపంచంలోనే తొలి చైల్డ్ ఆర్టిస్ట్
న్యూఢిల్లీ: చిన్నారులు ముద్దులొలికే మాటలు, వారి హావాభావాలు చూస్తుంటే పెద్దలకు తమ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంత మంది పిల్లలు చిన్న వయసులో సహజ సిద్ధంగానే వాళ్లలో కొన్ని కళలు దాగి ఉంటాయి. పాట పాడటం, డ్యాన్స్ చేయడం లేదా మంచి జ్ఞాపకశక్తి తదితర టాలెంట్లను పిల్లలో చూసుంటాం. అయితే అతి చిన్న వయసులోనే కుంచె పట్టుకున్న అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీయగల పిల్లలను చూసి ఉండం కదా!. కానీ ఢిల్లీకి చెందిన మూడేళ్ల ఏళ్ల అర్మాన్ రహేజా సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి మరీ అందర్నీ ఆకర్షించేలా కాన్వాస్‌పై రంగురంగుల పెయింటింగ్‌లు వేసి అందరీ మన్నలను పొందుతున్నాడు. (చదవండి: వామ్మో...ఓవర్ హెడ్ వైర్ల పై పెద్ద పాము) అంతే కాదండోయ్ భారత్‌లోనే తొలిసారిగా అత్యంత పిన్న వయసులో ఇండియా హాబిటాట సెంటర్లో సోలోగా ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించిన కళాకారుడుగా చరిత్రలో నిలవడమే కాక ప్రపంచంలోనే అత్యంత పిన్న కళాకారుల్లో ఒకడిగా కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే ఆర్మాన్ తన చూట్టు ఉన్న పరిసరాలను నుండి స్ఫూర్తి పొందడమే కాక దానికి తన సృజనాత్మక శక్తిని జోడించి అక్రిలిక్, వాటర్ కలర్స్ పోస్టర్ రంగులను ఉపయోగించి కాన్వాస్‌పై రమణీయమైన చిత్రాలను గీస్తాడు. అర్మాన్ తల్లి కాశిష్ రహేజా ఎఫ్ఐడీఎంలో ఇంటిరియర్ డిజైనర్, తండ్రి నయన్ రహేజా న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్ట్. ఈ మేరకు అర్మాన్ తల్లి కాశిష్ మాట్లాడుతూ....గతేడాది రంగులతో ఆడుతుంటే అది తనలోని అసాధారణమైన ప్రతిభకు సంకేతంగా చెబుతున్నాడని అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల అసాధారణ ప్రతిభ గుర్తించిగలిగితేనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించి ప్రోత్సహించగలరు. ఈ విషయంలో స్కూల్ టీచర్ భావన, అమ్మమ్మ నిర్మల్ రహేజా కూడా అర్మాన్ ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడట మేకాక తన ఆలోచనలకు ఒక నమూనాను రూపొందించగలిగేలా అర్మాన్ని మలిచారు. సూపర్నోవా, జెల్లీ ఫిష్ వంటి టైటిల్స్‌తో అర్మాన్ ప్రతి కాన్వాసులను ఎంత అద్భుతంగా గీస్తాడో కూడా వివరించారు. పైగా తమ కుమారుడి పనికి తగిన గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. (చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది) -
చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించింది.. కానీ హీరోయిన్గా మాత్రం..
చైల్ట్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారనే గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ శ్రేయా గుప్తా. సినిమాల్లో రాణించలేకపోయినా, వెబ్ సిరీస్‌లలో తన ప్రతిభను నిరూపించుకుంటోంది. అలా స్క్రీన్ లైఫ్‌ను రీస్టార్ట్ చేసిన ఈ వెబ్‌స్టార్ గురించి కొన్ని మాటలు.. ►శ్రేయా పుట్టి, పెరిగింది చెన్నైలో ► క్రిస్ట్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెంగళూరులో మాస్ కమ్యూనికేషన్స్ కోర్సు చేసింది. అనంతరం ముంబైలోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరింది. కొంతకాలం థియేటర్ ఆర్టిస్ట్‌గానూ పనిచేసింది. ► ఒకవైపు థియేటర్ షోలు, యాడ్ షూట్లు చేస్తూనే సినిమా అవకాశాల కోసమూ ప్రయత్నించింది. ► ‘పల్లికూడమ్’తో తనను చైల్ట్ ఆర్టిస్ట్‌గా పరిచయం చేసిన తమిళ ఇండస్ట్రీనే ఆర్టిస్ట్‌గానూ మళ్లీ ఆమెకు అవకాశాన్నిచ్చింది. ► సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ సినిమాతో పాటు ‘ఆరంభం’, ‘రోమియో జూలియట్’ తమిళ సినిమాల్లో నటించింది. ► అయినా రావాల్సిన గుర్తింపు రాలేదు. దాంతో మళ్లీ థియేటర్ షోలు చేద్దామనుకొని ముంబై వెళ్లింది. ► మంచినీళ్లు అడిగితే, మజ్జిగ ఇచ్చినట్లు స్టేజ్ షోల కోసం వెళ్లిన ఆమెకు అవధుల్లేని వెబ్ తెర మీద జీవించే చాన్స్ దొరికింది. ► 2017లో ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ రిటర్న్స్’ సిరీస్‌తో వెబ్‌దునియాలోకి ఎంట్రీ ఇచ్చి, వరుస సిరీస్‌లలో నటిస్తూ వెబ్‌స్టార్‌గా ఎదిగింది. వాటిల్లో ‘దిల్’, ‘దోస్తీ ఔర్ కరోనా ’, ‘కపుల్స్ ఇన్ లాక్డౌన్’, ’ది ఫర్ఫెక్ట్ డేటా’, ‘బ్యాంగ్ బ్యాంగ్’ మంచి ప్రేక్షకాదరణ పొందాయి. పలు షార్ట్ మూవీస్‌లోనూ కనిపించింది. నా కంఫర్ట్ జోన్.. కెమెరా ముందు నిలబడటం. దాని ఫ్రేమ్‌లో నటిస్తూ నన్ను నేను మర్చిపోతా. నాకు అది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. – శ్రేయా గుప్తా -
సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా!
సినిమాల్లో బాల నటులుగా నటించిన వారు కొంతమంది పెద్దాయ్యాక ఇతర రంగాల్లో రాణిస్తుండగా.. మరికొందరూ సినిమాల్లో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పటి మన స్టార్స్ ఒకప్పుడు సినిమాల్లో బాల నటులుగా నటించిన వారే. ఊయలలో ఉన్నప్పుడే వారు వెండితెర ఎంట్రీ ఇచ్చారు. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాలతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, మనోజ్‌లు కూడా బాల నటులుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటించిన మన స్టార్ హీరోలు చైల్డ్ అర్టిస్టులుగా నటించిన విషయం తెలుసా?.. వారుల ఎలా ఉంటారో చూశారా?. (చదవండి: మీరే నా బలం, నా జీవితం: మెగా బ్రదర్) కాగా అప్పటి లెజెండరీ నటుడి తనయుడు చైల్డ్ అర్టిస్టుగా నటించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది బుర్రకు పని చెబుతున్నారు. మహానటి సావిత్రి ఎత్తుకుని ముద్దాడుతున్న ఆ చిన్నారి ఇప్పటి స్టార్ ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ బుడ్డోడు ఓ లెజెండరి నటుడు తనయుడు.. తెలుగు ప్రముఖ హీరోల్లో ఒకడు.. అంతేకాదు ఆయన తనయులు కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడైన సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా... లేదా.. అయితే ఎవరో తెలుసుకుందా రండి!. (చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..!) అయితే అప్పట్లో టాలీవుడ్‌ను ఏలిన కథానాయకులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావుల కుమారులు చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో చైల్డ్ అర్టిస్టులుగా హరికృష్ణ, బాలకృష్ణలు నటిస్తుండగా, నాగేశ్వరావు సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాలు చేశాడు. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్ చైల్డ్ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిపాపగా ఉన్నాడు. అనంతరం ‘సుడిగుండాలు’ సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. మరీ ఇప్పడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. అప్పటి నటశిరోమణి చేతిలో తెరపై ఆడుకున్న ఈ బుడ్డోడే ఇప్పటి మన ‘కింగ్’ నాగార్జున. (చదవండి: Meera Jasmine Now: మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది?) -
ఈ చిచ్చర పిడుగే ఇప్పుడు నట నాయకుడు
మహానటుడనే ట్యాగ్ లైన్‌కు ఏమాత్రం తీసిపోని వ్యక్తి ఈయన. ఆయన నటనే కాదు.. డ్యాన్స్‌లు, ఫైట్లు ప్రతీదాంట్లోనూ ఓ వైవిధ్యమే కనిపిస్తుంటుంది. ప్రయోగాలంటే ఇష్టపడే ఆయన్ను అభిమానులు ముద్దుగా పిల్చుకునే పేరు ‘ఉళగ నాయగన్’. పేరుకే ఆయన తమిళ నటుడు. కానీ, స్ట్రెయిట్-డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు ‘లోకనాయకుడి’గా సుపరిచితుడు. కమల్ హాసన్.. సౌత్ సినీ పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక పేరు. సరిగ్గా 62 ఏళ్ల క్రితం నటుడిగా ఆయన సినీ ప్రస్థానం మొదలైంది ఇవాళే. కమల్ హాసన్.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తొలి చిత్రం ‘కళథూర్ కణ్ణమ్మ’. కేవలం నాలుగేళ్ల వయసుకే ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు కమల్. (సినిమా రిలీజ్ అయ్యింది మాత్రం 1960లో..) ఇందులో యుక్తవయసులో ఓ జంట చేసిన తప్పు.. దానికి ఫలితంగా తల్లిదండ్రులు ఎవరో తెలియకుండా అనాథగా క్షోభను అనుభవిస్తూ.. చివరికి తండ్రి-తల్లి పంచన చేరి ఆప్యాయతను పొందే చిన్నారిగా కమల్ నటన ఆకట్టుకుంది. అంత చిన్నవయసులో ‘సెల్వం’ క్యారెక్టర్లో అంతేసి భావోద్వేగాలను పండించడం ఆడియొన్స్నే కాదు.. ఆ సినిమా లీడ్ ద్వయం జెమినీ గణేశన్-సావిత్రిలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తొలి చిత్రం కళథూర్ కణ్ణమ్మ ఆరేళ్ల వయసుకే ఏకంగా రాష్ట్రపతి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టింది బుల్లి కమల్‌కు. నటనకు బీజం కమల్ అసలు పేరు పార్థసారథి. చిన్నవయసులో బాగా చురుకుగా ఉండే పార్థూ.. తండ్రి శ్రీనివాసన్ అయ్యంగార్ ప్రొత్సాహంతో కళల పట్ల ఆసక్తికనబరిచాడు. కమల్ తల్లి సరస్వతికి దగ్గరి స్నేహితురాలు ఒకామె ఫిజీషియన్‌గా పని చేస్తుండేది. ఒకరోజు పార్థూను తన వెంటపెట్టుకుని డ్యూటీకి వెళ్లిందామె. ఏవీఎం(ఏవీ మెయ్యప్పన్) ఇంటికి ఆయన భార్య ట్రీట్మెంట్ కోసం వెళ్లగా.. ఏవీఎం తనయుడు శరవణన్ పార్థూను చూసి ముచ్చటపడ్డాడు. పార్థూ చలాకీతనం శరవణన్‌ను బాగా ఆకట్టుకుంది. అదే టైంలో ఏవీఎం బ్యానర్లో దర్శకుడు బీష్మ్సింగ్ ఓ ఎమోషనల్ కథను తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కొడుకు క్యారెక్టర్ కోసం పార్థూను రికమండ్ చేశాడు శరవణన్. అలా నాలుగేళ్లకు పార్థూ అలియాస్ కమల్ హాసన్ నటనలో అడుగుపెట్టాడు. జెమినీ గణేశన్-సావిత్రి జంటగా తెరకెక్కిన కళథూర్ కణ్ణమ్మ కొన్ని కారణాలతో ఆలస్యంగా 1960, ఆగష్టు 12న రిలీజ్ అయ్యింది. అయితేనేం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. హిందీలో సునీల్‌దత్-మీనాకుమారి జంటగా ‘మై చుప్ రహూంగీ’, సింహళంలో ‘మంగళిక’ తెలుగులో నాగేశ్వర రావు-జమున జంటగా ‘మూగ నోము’ పేరుతో రీమేక్ అయ్యి అంతటా హిట్ టాక్ తెచ్చుకుంది. కళథూర్ కణ్ణమ్మ తర్వాత మరో నాలుగు తమిళం, ఒక మలయాళం సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు కమల్. ఆ తర్వాత ఏడేళ్లపాటు కెమెరాకు వెనకాల మేకప్ ఆర్టిస్ట్, డ్యాన్స్ మాస్టర్‌గా పని చేశాడు. అటుపై చిన్నాచితకా పాత్రల్లో కనిపించి.. 1974లో మలయాళ చిత్రం ‘కన్యాకుమారి’తో హీరోగా మారాడు. అలా ‘కళథూర్ కణ్ణమ్మ’ ఒక అద్భుతమైన నటుడిని భారతీయ సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అందుకే #62YearsOfKamalism ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. Keep inspiring us sir 🙏#62YearsOfKamalism pic.twitter.com/Sr4PH6vNZd — Lokesh Kanagaraj (@Dir_Lokesh) August 11, 2021 -సాక్షి, వెబ్‌డెస్క్ -
'మనసంతా నువ్వే' చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
హీరోయిన్ సుహాని కలిత గుర్తుందా..అదేనండి 'మనసంతా నువ్వే' సినిమాలో 'తూనీగ తూనీగ'.. అంటూ కనిపించిన చిన్నారి. బాల రామాయణం సినిమాతో తెలుగు తెరకు పరిచయయం అయిన ఆమె గణేష్, ప్రేమంటే ఇదేరా, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అలరించింది. ఆ సమయంలోనే తెలుగు సహా తమిళం, హిందీ, బెంగాలీ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో అక్కడా సినిమాలు చేసింది. ఈ చిన్నదాని క్రేజ్‌ను క్యాష్ చేసుకున్న కొన్ని బడా కంపెనీలు సుహానీని బ్రాండ్ అంబాసిండర్‌గా నియమించుకున్నాయి. అలా ఆమె నీరూస్, శామ్సంగ్, ఆర్ఎస్ బ్రదర్స్ సహా పలు బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సుహానీ 2008లో బి. జయ దర్శకత్వంలో సవాల్ అనే చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత స్నేహగీతం, శ్రీశైలం వంటి సినిమాల్లో నటించినా ఈమెకు అంతగా కలిసిరాలేదు. చెల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చిన పాపులారిటీ..హీరోయిన్గా మాత్రం రాలేదు. ఇప్పటివరకు వివిధ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్‌కు కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. కథ నచ్చితే మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
'ఛత్రపతి' సూరీడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
Chatrapathi Movie Child Artist Suridu: ఛత్రపతి సినిమా ప్రభాస్ రేంజ్‌ను పదిరెట్లు పెంచిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 16 ఏళ్లు దాటింది. కానీ ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. ఇందులోని యాక్షన్ సన్నివేశాలు కూడా ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. ముఖ్యంగా సూరీడు ఓ సూరీడు అంటూ సాగే సన్నివేశం సినిమాలోని కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది. సూరీడు అనే చిన్న కుర్రాడిని రౌడీలు కొట్టి చంపడంతో అప్పటివరకు అణిగిమణిగి ఉన్న ప్రభాస్ ఒక్కసారిగా ఉగ్రనరసింహావతారం ఎత్తి విలన్ల మీద విరుచుకుపడే సీన్‌కు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుస్తాయి. ఇక ఈ సినిమాలో సూరీడుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ భశ్వంత్ వంశీ ఎంతో అమాయకంగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఛత్రపతి సినిమా ఆడిషన్స్ కోసం వెళ్లిన అతడు మొదటి రౌండ్లోనే సెలక్ట్ అయ్యాడట. అతడి అమాయక చూపులకు జక్కన్న ఫిదా అయిపోయి సూరీడుగా అతడే చేయాలని ఫిక్సయ్యాడట. ఆయన అంచనా కూడా నిజమైంది. సినిమాలో సూరీడు మదర్ సెంటిమెంట్ సీన్ ఇప్పుడు చూసినా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. ప్రభాస్ పాత్రను ఎలివేట్ చేయడానికి సూరీడు పాత్ర బాగా పనికొచ్చింది. తాజాగా ఈ సూరీడు హీరో రేంజ్‌లోకి మారిపోయాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో భశ్వంత్ ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఛత్రపతి సినిమాలో భశ్వంత్ వంశీ, అనిత చౌదరీ తల్లీకొడుకులుగా నటించిన విషయం తెలిసిందే కదా! తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన సెల్ఫీ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో గడ్డం, మీసాలతో సూరీడు గుర్తుపట్టరానంతగా మారిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక విదేశాల్లో చదువు పూర్తి చేసుకున్న అతడు టాలీవుడ్లో మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడట. అంటే మంచి అవకాశం దక్కితే త్వరలోనే సూరీడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. -
‘వల్లంకి పిట్టా’ బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?
కావ్య కల్యాణ్‌రామ్ తెలుసా మీకు? ఆమె ఎవరు అంటారా? సరే, అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిలోని ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’వీడియో సాంగ్‌ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందులో ఓ బుడ్డి పాప క్యూట్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ బుడ్డి పాప పేరే కావ్య కల్యాణ్‌రామ్. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ‘గంగోత్రి బేబీ’ ప్రస్తుతం ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. గతేడాది ‘మసూద’ అనే సినిమాతోనే కావ్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం కావ్య లుక్స్.. మంచి హీరోయిన్ కి ఎగ్జాక్ట్ గా స్యూట్ అయ్యేలా ఉంది. హాట్ బేబీగా మారిన క్యూట్ బేబీ కావ్యకు మంచి ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్గా రాణించాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
‘అమ్మోరు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Ammoru Child Artist Sunaina Story: సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది క్యారెస్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఎదిగారు. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారు ఉన్నారు. వారిలో రాశి, శ్రీదేవి, మీనా లాంటి వారు ఉన్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారని గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ సునైనా బాదం. సునైనా బాదం అని చెబితే ఎవరికీ అర్థం కాదు. కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అమ్మోరు’సినిమా గుర్తుంది కదా? ఈ సినిమాలో నటించిన మరో పవర్ ఫుల్ చైల్డ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలా సౌందర్య వద్దకు వచ్చే అమ్మోరు తల్లే సునైనా బాదం. ఆ సినిమాలో సౌందర్యను ఇంట్లో వాళ్లందరూ బాధిస్తుంటే.. అమ్మోరు తల్లి చిన్న పిల్లగా మారి సౌందర్యకు రక్షణగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్లతో గంభీరంగా కనిపించిన సునైనా ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించింది. అప్పట్లో ఆ చిన్నారి నిజంగానే దేవత అని జనాలు అనుకున్నారంటే.. ఆ క్యారెక్టర్లో ఆమె ఎంత జీవించేసేందో అర్థం చేసుకోవచ్చు. ఇలా బాల నటిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన సునైన ఆ తర్వాత కూడా ప్రేక్షకులతో టచ్ లోనే ఉంది. గత కొంత కాలంగా యూట్యూబ్ లో ఫ్రస్టేటెడ్ వీడియోలతో బాగా పాపుర్ అయ్యింది. సమంత ‘ఓబేబీ’సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సునైనా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆమె చేసిన 'ఫ్రస్టేటెడ్ ఉమెన్’అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోయిన్లుగా అవుతుంటే.. సునైనా మాత్రం యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్ కావాలని పెద్దగా ఆశ లేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలని మాత్రం ఉంది అని సునైనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సునైనా బాదం భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలని ఆశిద్దాం. -
‘రాజన్న’ మూవీ చిన్నారి.. ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుందో తెలుసా!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ తండ్రి కేవీ విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో హీరో నాగార్జున అక్కినేని లీడ్‌రోల్ వచ్చిన మూవీ ‘రాజన్న’. ఇందులో నాగార్జున స్వంతంత్య్ర సమరయోధుడు రాజన్నగా కనిపించగా ఆయనకు భార్యగా నటి స్నేహ నటించింది. 2011లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది, ఇక ఇందులో రాజన్న కూతురు మల్లమ్మగా నటించిన ఆ చిన్నారి తన నటనతో ప్రేక్షకులను విపరితంగా ఆకట్టుకుంది. శత్రువులను ఎదురించి తన తండ్రి జాడ తెలుసుకునేందుకు ఆమె చేసే ప్రయత్నం ఇప్పటికి ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. ఇక మల్లమ్మగా తన తండ్రి రాజన్న చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని పాటల రూపంలో తెలుపుతూ ఇతరులలో స్ఫూర్తిని నింపుతుంది. అలా అంతగా తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆ చిన్నారి అసలు పేరు అనీ. ఈ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆరిస్టుగా నంది అవార్డు గెలుచుకున్న అనీ ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా!. కాగా రాజన్న మూవీ సమయంలో అనీ వయసు 10 ఏళ్లు. ఆమె నాలుగేళ్ల వయసు నుంచే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది. ‘అనుకోకుండ ఒకరోజు’ మూవీతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన అనీ ఆ తర్వాత తెలుగు సీరియల్ గోరింటాకుతో పాటు పలు సీరియల్స్‌లో నటించింది. ఇక చివరగా ‘రంగస్థలం’ మూవీలో చిట్టిబాబుకు(రామ్ చరణ్) చెల్లి పాత్రలో కనిపించిన బేబీ అనీ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అవినాష్ డిగ్రీ కాలేజీలో కామర్స్ చదువుతుంది. -
30 ఇయర్స్ అంటోన్న బాలాదిత్య
‘‘నా 30 ఏళ్ల ప్రయాణంలో ఎందరో గొప్ప దర్శక–నిర్మాతలతో, మహానటులతో పని చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాలాదిత్య. ‘ఎదురింటి మొగుడు పక్కింటిపెళ్ళాం’తో బాలనటుడిగా పరిచయమైన బాలాదిత్య ‘అన్న’, ‘లిటిల్ సోల్జర్స్’, ‘బంగారు బుల్లోడు’, ‘హిట్లర్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ‘చంటిగాడు’తో హీరోగా పరిచయం అయ్యారు. నటుడిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలాదిత్య మాట్లాడుతూ – ‘‘ఎదురింటి మొగుడు పక్కింటిపెళ్ళాం’ చిత్రంలో తొలిసారి చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. దివంగత ప్రముఖ దర్శకులు దాసరిగారు ఈ సినిమాకి క్లాప్ ఇచ్చారు (13–6–1991). అలా నటుణ్ణి అయి 30 ఏళ్లయింది. ఈ చిత్రంలో ‘స్టాంప్గాడి’గా పేరు పొందిన నేను ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, వ్యాఖ్యాతగానూ మారాను. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ప్రస్తుతం ‘పొలిమేర’, ‘విరహం’ చిత్రాలతో పాటు ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నారు బాలాదిత్య. -
హీరోగా మారిన 'బాహుబలి' బాలనటుడు
'బాహుబలి, రేసుగుర్రం, మళ్లీ రావా, దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య' లాంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం బ్యాచ్. నేహా పఠాన్ హీరోయిన్గా కనిపించనుంది. బేబీ ఆరాధ్య సమర్పణలో శివ దర్శకత్వంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంతో పాటు కాలేజీలో కుర్రాళ్ల కథే మా సినిమా అన్నారు శివ. మా సినిమాకు సంగీత దర్శకుడు కుంచె మరో హీరో అనే చెప్పుకోవాలి. ఈ చిత్రానికి సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: 'ప్రభాస్ అలా అనడం నా జీవితంలో మర్చిపోలేను' -
క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మృతి
ఫ్లోరిడా: ప్రముఖ హాలీవుడ్ టీవీ నటుడు డస్టిన్ డైమండ్(44) మృతి చెందారు. కణ క్యాన్సర్‌తో బాధపడుతున్న డస్టిన్ ఫ్లోరిడాలోని ఆస్పత్రిలో సోమవారం కన్నుముశారు. ‘సెవ్డ్ బై ది బెల్’ సిరీయల్తో బాల నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న డస్టిన్ కొంతకాలంగా కణ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఆయన తండ్రి మార్క్ డైమండ్ తెలిపాడు. స్టేజ్ 4 కణ క్యాన్సర్‌కు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడు నిన్న మరణించినట్లు ఆయన తండ్రి పేర్కొన్నారు. కాగా 1989 నుంచి 1992 మధ్యకాలంలో వచ్చిన ‘సెవ్డ్ బై ది బెల్’ సరీయల్లో డస్టీన్ బాల నటుడిగా అందరిని మెప్పించాడు. ఇందులో డస్టిన్ తన స్కెచ్ ప్రతిభతో మంచి గుర్తింపు పొందాడు. అప్పట్లో ప్రముఖ ఛానల్ ఎన్బీసీలో ప్రతి రోజు శనివారం ఉదయం ప్రసారమయ్యే ఈ సిరీయల్ అత్యంత ప్రేక్షక ఆదరణ పొందింది. -
కుర్రాడు భాను.. స్టార్ హీరోల పక్కన
సాక్షి, హైదరాబాద్: వయసు తొమ్మిదేళ్లు.. 15కి పైగా సినిమాలు.. డైలాగ్ చెప్పడం మొదలు పెడితే అనర్గళమే.. వయసుకు మించిన పరిణితితో నటనకు సంబంధించిన అన్ని ఫార్మాట్లలో ప్రావీణ్యం. ఇవన్నీ ఒక్క చైల్డ్ ఆర్టిస్ట్ గురించే.. ఆ కుర్రాడే భాను ప్రకాష్. అనతికాలంలోనే స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటూ మోస్ట్ ఎలిజిబుల్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్–2, గమనం లాంటి పాన్ ఇండియా మూవీస్‌లో సైతం భాను నటిస్తుండటం విశేషం. సినిమా ఆర్టిస్ట్‌గా రాణించాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరే ఆ కలను నిజం చేసుకుంటారు. నిరంతర కృషి, సినిమా పట్ల అంకితభావం, ఎప్పటికప్పుడు నటనలో మెలకువలు నేర్చుకోవడం వల్లే అది సాధ్యమవుతుందని అంటున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ భాను ప్రకాష్. ఐదేళ్ల ప్రాయం నుంచే కెమెరా ముందు తన నటనతో అందరినీ ఆకర్షించాడు. అలా అతితక్కువ సమయంలోనే టాలీవుడ్లో చైల్డ్ ఆర్టిస్ట్‌కి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారాడు భాను. కేజీఎఫ్‌లో ఓన్లీ వన్.. క్రేజీ ప్రాజెక్ట్ కేజీఎఫ్–2లో నటిస్తున్న తొలి తెలుగు నటుడు భాను కావడం విశేషం.. అంతేగాకుండా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కానున్న గమనం సినిమాలో నటించాడు. ఇందులో ప్రముఖ నటి శ్రియ శరన్‌తో పాటు ఒక ప్రత్యేక పాత్రలో భాను నటిస్తున్నాడు. ఈ మధ్యే గమనం తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్‌కి ఇప్పటికే 15 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో పాటు శేఖర్ కమ్ముల, నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న లవ్‌స్టోరీలో కూడా మెరుస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరు, వెంకీమామ, ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడుతో పాటు పలు హిట్ సినిమాల్లో నటించాడు. నాన్నే నడిపించాడు.. తండ్రి సురేష్ సినిమాలపై ప్రేమతోనే సిటీకి వచ్చాడని, తను చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించడం వెనుక నాన్న కృషి మాటల్లో చెప్పలేనిది గుర్తుచేసుకున్నాడు. ఐదేళ్ల వయసులోనే దానవీర శూర కర్ణ సినిమాలోని ‘ఏమంటివి ఏమంటివి.. లాంటి భారీ డైలాగ్స్‌ని సునాయాసంగా అభినయ సహితంగా చెప్పడం గమనించి నాన్న తనను బాగా ప్రోత్సహించాడని భాను చెప్పాడు. నటనలో ఓనమాలు నేర్పిందీ నాన్నే అంటున్నాడు. మొదట్లో ఎక్కడ ఆడిషన్స్ ఉన్నా తనని తీసుకెళ్లి ఎలా చేయాలి? ఎక్స్‌ప్రెషన్స్‌లో వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి తదితర అంశాల్లో మెలకువలు నేర్పేవాడని గుర్తు చేసుకున్నాడు. తనకు మెదటిసారిగా ‘ఒక్క క్షణం’ సినిమాలో అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకున్నాక అనేక సినిమాల్లో అవకాశాలు వెల్లువెత్తాయని ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తక్కువ సమయంలోనే క్రిష్, అనిల్ రావిపూడి లాంటి దిగ్గజ దర్శకుల సినిమాల్లో అవకాశాలు పొందడం, తద్వారా వారి పర్యవేక్షణలో నటనలో మంచి ప్రావీణ్యం సంపాదించానని చెబుతున్నాడు. ప్రస్తుతం తాను 3వ తరగతి చదువుతూ అటు సినిమాలను ఇటు చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా కష్టపడుతున్నాడు. ఔట్‌డోర్ షూటింగ్స్ ఉన్న సమయాల్లో ఆన్లైన్లో తన సబ్జెక్ట్‌ని నేర్చుకుంటున్నాడు. నటనలోనైనా, చదువులోనైనా అన్నింటికీ మార్గదర్శి మాత్రం నాన్నే అంటున్నాడు భాను. ఈ సందర్భంగా ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డ్ సాధించి నాన్నకు బహుమతిగా ఇవ్వాలన్నదే తన లక్ష్యమని వినయంగా తెలిపాడు. యాక్టర్.. ఆల్ రౌండర్.. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్, షార్ట్ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, యాడ్స్, టీవి షోలు, నాటకాలు ఇలా అన్ని ఫార్మాట్లలో భాను తనని తాను నిరూపించుకుంటున్నాడు. మెట్రో కథలు, గీతా సుబ్రహ్మణ్యం తదితర వెబ్ సిరీస్‌లు, జబర్దస్త్ షోలో సైతం కొన్ని ఎపిసోడ్స్‌లో చేశాడు. అంతేగాకుండా ఆహా వేదికగా సమంత చేస్తున్న సామ్‌జామ్ షోలోనూ మెరిశాడు. అతి చిన్న వయసులోనే ఇలా విభిన్న ఫార్మాట్లలో ప్రావీణ్యం చూపడం చాలా అరుదు. ‘దారి’ షార్ట్‌ఫిల్మ్‌లో తన నటనతో అందరి మన్ననలను పొందడమే కాకుండా ఏఎన్నార్ అవార్డ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. ఇదే ఫిల్మ్‌కి మినీమూవీ ఫెస్టివల్ అవార్డ్ కూడా వరించింది. ఇష్టపడి.. కష్టపడి.. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లోనూ, నటనలోనూ భాను ఉత్సాహం చూసి ముచ్చటేసేది. తనలో కళ ఉంది. దానికి మెళుకువలద్ది సరైన దారిలో పెట్టడమే నా భాధ్యతగా భావించా. వయస్సు చిన్నదే అయినా సినిమాలు, నటనలో డెడికేటివ్గా ఉంటాడు. ఉన్నతంగా ఆలోచించడం భాను మరో కోణం. మంచి సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే దానికి భాను పడిన కష్టం, తాపత్రయం నాకు మాత్రమే తెలుసు. కొన్ని ఆడిషన్స్‌లో వేల మంది పాల్గొన్నప్పటికీ భాను మాత్రమే సెలక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సినిమా నటుడిగా నిరూపించుకోవడం కొద్ది మందికి మాత్రమే సాధ్యమవుతుంది. అందులో భాను ఉండటం చాలా సంతోషాన్నిస్తోంది. – సురేష్ అమాస, భాను తండ్రి. -
అచ్చ తెలుగు అమ్మాయిని
కావ్య... ఈ పేరు బహుశా ఎవరికీ తెలియకపోచ్చు. కానీ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట...’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. ఇప్పుడు తను హీరోయిన్ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ – ‘‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిష¯Œ ్స చేస్తున్నాను. నిజానికి లాక్ డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. లాక్ డౌన్ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్ , ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు. -
ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఛత్తీస్గడ్ రాయ్‌పూర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో అనేక హిందీ టీవీ సీరియళ్లలో నటించిన శివలేఖ్ సింగ్ (14) దుర్మరణం పాలయ్యారు. గురువారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆరిఫ్ షేక్ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి లేఖ్నా సింగ్, తండ్రి శివేంద్రసింగ్ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కారులో బిలాస్పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తరువాత పారిపోయిన ట్రక్ డ్రైవర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. చత్తీస్‌గడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన శివలేఖ్ సింగ్ తల్లిదండ్రులతో ముంబైలో నివసిస్తున్నారు. ‘సంకట్ మోచన్ హనుమాన్’, ‘ససురాల్ సియర్ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో శివలేఖ్ కనిపించారు. -
అలా అమ్మ అయ్యాను
చైల్డ్ ఆర్టిస్ట్‌గా, టీవీ నటిగా భావన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. జీ తెలుగులో ప్రసారమవుతున్న కళ్యాణవైభోగం ద్వారా మోడ్రన్ మదర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆట, మాట, నటనలతో బోర్ లేకుండా రోజులు హ్యాపీగా గడిచిపోతున్నాయి అంటూ తన మనసులోని ముచ్చట్లను పంచుకున్నారు భావన. ఇప్పుడు చేస్తున్న సీరియల్స్? కళ్యాణ వైభోగం, పౌర్ణమి సీరియల్స్‌లో హీరోయిన్స్‌కి మదర్‌గా నటిస్తున్నాను. ఓ కుకరీ షోకి యాంకరింగ్ చేస్తున్నాను. డ్యాన్స్ షోస్‌లో పాల్గొంటున్నాను. వేటికవి భిన్నంగా అలాగే లుక్‌లోనూ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కడా బోర్ అనేది లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. చేస్తున్న పని వల్ల చాలా రిలీఫ్‌గా ఉంటుంది. టీవీ హీరోయిన్ నుంచి అమ్మ క్యారెక్టర్‌కి మారడం? (నవ్వుతూ) కొంచెం కష్టమే. అయితే, అమ్మ అనగానే ఇలాగే ఉంటుందనే ఒకలాంటి పిక్చర్ మన కళ్లముందు నిలుస్తుంది. దీనికి పూర్తి భిన్నంగా నేను చేసే సీరియల్స్‌లో అమ్మ వెస్ట్రన్ లుక్‌తో అందంగా ఉంటుంది. కళ్యాణవైభోగం సీరియల్లో నాది తల్లి పాత్ర అయినా హీరోయిన్ – నేను సిస్టర్స్‌లా ఉంటాం. హీరో, హీరోయిన్, తల్లి .. ఈ ముగ్గురి చుట్టూ కథ తిరుగుతుంది. అమ్మగా ఎలా మొదలు? ఏడేళ్ల క్రితం పుత్తడిబొమ్మ సీరియల్ నుంచి మదర్ క్యారెక్టర్ స్టార్ట్ అయ్యింది. మా ఇంట్లోవాళ్లు కూడా నన్ను తల్లి పాత్రల్లో అంగీకరించడానికి కొంత టైమ్ పట్టింది. అయితే కావాలని అమ్మ పాత్రలను నేను ఎంచుకోలేదు. అనుకోకుండా పుత్తడిబొమ్మ సీరియల్లో హీరోయిన్ చిన్నప్పుడు అమ్మగా ఉండటానికి ఓకే చేశాను. తర్వాత ఆ పాప పెద్దయ్యింది. అలా మదర్‌గా నేనే కంటిన్యూ అయ్యాను. దీంతో అమ్మ పాత్రలు చేస్తున్నాను. అలాగని బాధ లేదు. వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇండస్ట్రీకి ఎంట్రీ? చైల్డ్ ఆర్టిస్ట్‌గా నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాను. మా నాన్నగారి ఫ్రెండ్ ఇండస్ట్రీలో ఉండేవారు. వాళ్ల ద్వారా నా ఎంట్రీ సులువు అయ్యింది. చిక్కడు దొరకుడు, భారతంలో బాలకృష్ణుడు, స్వయంకృషిలో సుమలత చిన్నప్పుడు, విజృంభణ, లాయర్ సుహాసినిగా చిన్నప్పుడు.. ఇలా పద్నాలుగు సినిమాలు చేశాను. ఆ తర్వాత సీరియల్స్ చేస్తూ వచ్చాను. భవిష్యత్తు నటన గురించి? బాగా మాస్ క్యారెక్టర్ చేయాలని ఉంది. అలా అని అదొక కల కాదు. కాకపోతే అలా కూడా ప్రేక్షకుల్ని మెప్పించాలి అని ఉంది. నన్ను ఇప్పటివరకు పాజిటివ్‌గా – నెగిటివ్‌గా చూశారు. భావన మాస్‌గా కూడా బాగా నటించగలుగుతుందని తెలుస్తుంది. వర్క్‌లో ఇన్వాల్వ్మెంట్? మా భార్యా–భర్త ఇద్దరిలో ఎవరూ ఎవరి వర్క్‌ని డిస్ట్రబ్ చేసుకోం. ముందుగా ప్లాన్ చేసుకుంటాం. సజెషన్స్ కూడా పెద్దగా ఏమీ ఉండవు. అమ్మ, అత్తయ్య మాత్రం ఎమోషన్ సీన్స్ చేసినప్పుడు ఎలా యాక్ట్ చేశానో చెబుతారు. ముఖ్యంగా మా అత్తయ్య అలాంటి సీన్ చూసిన వెంటనే ఫోన్ చేస్తుంటుంది. పిల్లల ఆలనా పాలనా? నేను చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నప్పుడు స్కూల్‌కి వెళ్లడం కుదరలేదు. దీంతో ఇంట్లో ఉండే ప్రైవేట్‌గా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యాను. అందుకే మా పిల్లలకు చదువు మీదే కాన్సంట్రేషన్ చేస్తాను. గతంలో ఏదైనా ఇంగ్లీష్ మూవీకి వెళ్లినా మా వారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇప్పుడు నా కూతురు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. షాపింగ్‌కి ఏదైనా మర్చిపోతానేమో అని గతంలో నేను లిస్ట్ రాసుకునేదాన్ని. ఇప్పుడా పని మా అమ్మాయి చేస్తుంది. చాలా విషయాల్లో నా పిల్లలు నాకు తోడుంటున్నారు. నా ప్రపంచం వాళ్లే. ఉదయం షూటింగ్‌కి తిరిగి ఇల్లు చేరేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు గోల చేస్తే కొద్దిగా అరిచేస్తాను. అదే వాళ్లు అమ్మవాళ్లింటికి వెళ్లి, ఒక్కరోజు చూడకపోయినా బెంగ పెట్టేసుకుంటాను. సీరియల్స్ అన్నీ ఒకేలా.. జనాల చేతిలో రిమోట్ ఉంది. నచ్చలేదు అంటే చానెల్ మార్చేస్తారు. కానీ, ఎవరూ అలా చేయడం లేదు కదా! సీరియల్‌ని తిట్టుకుంటూనైనా చూసేస్తున్నారు. సీరియల్లో ఆ క్యారెక్టర్‌కి ఏది అవసరమైతే అదే చూపిస్తారు డైరెక్టర్. అత్త, అమ్మ క్యారెక్టర్లు ముందు విలన్ అన్నారు. ఇప్పుడు పాజిటివ్‌గా మారుతున్నాయి. – నిర్మలారెడ్డి ఇంట్లో అమ్మగా..? నాకు ఇద్దరు కూతుళ్లు. మా పెద్ద పాప పేరు గాయత్రి. రెండవది సరయు. ఇద్దరూ చదువుకుంటున్నారు. నెలలో 15–20 రోజులు షూటింగ్స్‌తో బిజీగా ఉన్నా మిగతా రోజులు పిల్లలతోనే ఉంటాను. మా వారు విజయ్‌కృష్ణ డైరెక్టర్. ప్రస్తుతం కథలో రాజకుమారికి వర్క్ చేస్తున్నారు. నాకు షూటింగ్స్ ఉన్నప్పుడు మా అత్తగారు, అమ్మ వాళ్ల సాయం ఉంటుంది.