1/15
అథిరా పటేల్.. బాలనటిగానే ఎంట్రీ ఇచ్చింది కానీ, కనిపించింది మాత్రం పరిణతిగల పాత్రలో! పోషించే పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి నటించటం ఆమెకు అలవాటు.
2/15
అందుకే, అనతికాలంలోనే మంచినటిగా పేరుతెచ్చుకుంది. ఆమె గురించి కొన్ని విషయాలు..
3/15
అథిరా స్వస్థలం కేరళలోని కోళికోడ్ జిల్లా, తిరువంబాడి. తన చదువును అక్కడే పూర్తి చేసింది.
4/15
ఆమెకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. టీవీలో వచ్చే సినిమాలు చూస్తూ నటన మీద ఆసక్తి పెంచుకుంది. అలా తను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే నటనారంగంలోకి అడుగుపెట్టింది.
5/15
‘అంగమలై డైరీస్’లో హీరోకి చెల్లెలుగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
6/15
ఆమె.. కథానాయికగా మెప్పించిన చిత్రం ‘కాంటెస్సా’. ‘ఆడు 2’, ‘విలన్’, ‘భూతకాలం’ వంటి పెద్ద సినిమాల్లోనూ నటించింది.
7/15
తొలిసారి ‘వుజా డె’ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. అదే ఆమెను వెండితెరకు పరిచయం చేసింది.
8/15
‘ఇష్ఠి’ అనే సంస్కృత సినిమాలో నెడుముడి వేణుకు మూడో భార్యగా, చిన్న పాత్రలో వెండితెరపై మెరిసింది.
9/15
మోడలింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంది. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.
10/15
∙ఆమె తాజా చిత్రం ‘బోగన్‌విల్లా’ సోనీ లివ్‌లో స్ట్రీమ్ అవుతూ, వీక్షకులను అలరిస్తోంది.
11/15
నా ఇంట్రెస్ట్‌ను గ్రహించి ఆ వైపుగా ప్రోత్సహించారు మా పేరెంట్స్.
12/15
అందుకే ఇప్పుడు ఇక్కడున్నాను.
13/15
14/15
నేను బడి ఎగ్గొట్టడానికి ఆడిన డ్రామాల నుంచే నా యాక్టింగ్ మొదలైంది (నవ్వుతూ)! : అథిరా పటేల్.
15/15