సలార్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. రవితేజ బంధువా? నటుడు ఏమన్నాడంటే? | Salaar: Part 1 Movie Child Artist Karthikeya Dev Reacts On Rumors About Ravi Teja's Relation To His Family - Sakshi
Sakshi News home page

Salaar: పృథ్వీరాజ్‌ చిన్నప్పటి క్యారెక్టర్‌ చేసింది ఇతడే! రవితేజతో రిలేషన్‌పై క్లారిటీ!

Published Wed, Dec 27 2023 12:36 PM | Last Updated on Wed, Dec 27 2023 1:16 PM

Salaar Child Artist Karthikeyan About Relation with Ravi Teja - Sakshi

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతకు ముందు వరకు డార్లింగ్‌ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా హీరో అయిపోయాడు. ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్‌ దగ్గర నిలదొక్కుకోలేకపోయిన ప్రభాస్‌.. సలార్‌ మూవీతో జెండా పాతాడు. ఈ మూవీ కేవలం నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

సినిమాలంటే చాలా ఇష్టం..
ఇదిలా ఉంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ చిన్నప్పటి పాత్రను కార్తికేయ దేవ్‌ అనే కుర్రాడు పోషించాడు. జూనియర్ వరదరాజ మన్నార్‌గా ఇతడు నటించగా తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ పిల్లాడు మరెవరో కాదు.. రవితేజ బంధువే అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై కార్తికేయ దేవ్‌ స్పందిస్తూ.. 'నాకు సినిమాలంటే చాలా ఇష్టం. మూవీస్‌ ఎక్కువగా చూస్తుంటాను. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాను. నేను సలార్‌ సినిమాలో నటిస్తున్నానని చెప్పినప్పుడు మా స్కూల్‌లో ఎవరూ నమ్మలేదు. ఇప్పుడు వాళ్లంతా కూడా భలే చేశావ్‌ అంటున్నారు.

నాకెవరూ తెలియదు
సినీ ఇండస్ట్రీలో నాకెవరూ తెలియదు. అయితే కొందరు.. నాకు, రవితేజకు దగ్గరి పోలికలున్నాయన్నారు.. మరికొందరేమో అడివి శేష్‌ పోలికలు ఉన్నాయన్నారు. పోలికలున్నంత మాత్రాన వారికి బంధువైపోతానా? పృథ్వీరాజ్‌ చిన్నప్పటి పాత్ర చేస్తే అతడికి చుట్టమైపోతానా? పెద్ద సినిమాలో కనిపించేసరికి కచ్చితంగా నాకు ఏదో బ్యాగ్రౌండ్‌ ఉందనుకుంటున్నారు. కానీ అలాంటిదేమీ లేదు. మా కుటుంబానికి సినిమా ఇండస్ట్రీతో ఎటువంటి పరిచయం లేదు. నేను రవితేజ బంధువుని అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు' అని క్లారిటీ ఇచ్చాడు కార్తికేయ.

చదవండి: హీరోయిన్‌గా చేస్తూనే ఆ రిస్క్ చేయబోతున్న కీర్తి సురేశ్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement