నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie). బాబీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జనవరి 12న థియేటర్లలో విడుదల కాగా తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. హీరోకు బాబీ ఇచ్చిన ఎలివేషన్స్, తమన్ బీజీఎమ్ అదిరిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
డాకు మహారాజ్‌లోని చిన్నారి ఎవరు?
ఈ సినిమాలో వైష్ణవిగా నటించిన చిన్నారి నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. ఈ పాప సినిమా సెట్స్‌లో బాలకృష్ణను పట్టుకుని ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఆ చిన్నారి ఎవరని పలువురూ ఆరా తీస్తున్నారు. ఈ బేబీ వైష్ణవి పేరు వేద అగర్వాల్ (Veda Agrawal). తను నటి మాత్రమే కాదు, సింగర్ కూడా! ప్రముఖ గాయకుడు మాధవ్ అగర్వాల్ కూతురే వేద.
(డాకు మహారాజ్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఉప్పొంగిపోయిన సింగర్
తన గారాలపట్టి ఇంత పెద్ద సినిమాలో భాగం కావడంతో తండ్రిగా ఉప్పొంగిపోయాడు మాధవ్. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. నేను ఆగ్రాలో పుట్టినా పెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నా ఎనిమిదేళ్ల కూతురు తెలుగులో నటించిన పెద్ద సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేను పెరిగిన హైదరాబాద్‌లోని థియేటర్లలో ఆడుతోంది. ఎంత యాదృచ్చికం.
కల నెరవేరినట్లుగా ఉంది
ఈ ప్రయాణం నాకు సంపూర్ణమైన అనుభూతినిస్తోంది. మా భావోద్వేగాలు ఆగడం లేదు. హైదరాబాద్ నగరంలో బిగ్ స్క్రీన్‌పై తనను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నా కల నెరవేరినట్లుగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. డాకు మహారాజ్‌లో వైష్ణవిగా కట్టిపడేసింది వేద. ఈ సినిమాతో తనకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
డాకు మహారాజ్ సినిమా విశేషాలు
డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌తో మెరిసింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సంక్రాంతి కానుకగా ముందుకు వచ్చిన ఈ మూవీకి తొలి రోజే సక్సెస్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి.
సక్సెస్ పార్టీ
పైగా జనవరి 10న రిలీజైన రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీకి వస్తున్న మిక్స్‌డ్ టాక్ డాకు మహారాజ్‌కు కలిసొచ్చినట్లైంది. తొలి రోజే బాలకృష్ణ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ఈ బ్యూటీ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. అటు ఆన్ స్క్రీన్‌లో, ఇటు ఆఫ్ స్క్రీన్‌లో బాలకృష్ణ.. ఊర్వశిని దబిడి దిబిడి ఆడేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment