ఎప్పుడొచ్చామన్నది కాదు హిట్టు కొట్టామా? లేదా? అన్నదే ముఖ్యం! ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు వచ్చాయి. అందులో మొట్ట మొదట రిలీజైన మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer Movie). రామ్‌చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు భారీగానే వసూళ్లు రాబట్టినా మిక్స్‌డ్ టాక్ వల్ల రెండో రోజు నుంచి డీలా పడిపోయింది.
దబిడి దిబిడి పాటపై ట్రోలింగ్
రెండు రోజుల గ్యాప్‌తో నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ (Daaku Maharaaj Movie)తో థియేటర్లలో అడుగుపెట్టాడు. ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు జోరందుకున్నాయి. దబిడి దిబిడి పాటలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాతో బాలయ్య చేసిన స్టెప్పులపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కానీ అవేవీ సినిమా విజయానికి అడ్డుగా నిలవలేదు.
సంక్రాంతి విన్నర్?
చివరగా జనవరి 14న విక్టరీ వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా (Sankranthiki Vasthunam)తో వచ్చాడు. వస్తూనే పండగ మోసుకొచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. మౌత్ టాక్‌తోనే ప్రేక్షకుల్ని థియేటర్ల వద్దకు రప్పించగలిగాడు. రూ.100 కోట్లు అందుకోవడానికి డాకు మహారాజ్‌కు నాలుగు రోజులు పడితే సంక్రాంతికి వస్తున్నాం మాత్రం మూడు రోజుల్లోనే సెంచరీ క్లబ్‌లో చేరింది.
(చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య)
అభిప్రాయాలు గౌరవిస్తా
ఇకపోతే దబిడి దిబిడి సాంగ్‌లోని స్టెప్పులపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. సక్సెస్ వెంట విమర్శలు కూడా ఉంటాయి. ఈ పాటపై జరుగుతున్న చర్చను నేను అర్థం చేసుకోగలను. నందమూరి బాలకృష్ణతో చేసిన డ్యాన్స్ విషయానికి వస్తే.. మా పర్ఫామెన్స్ గురించి పలువురూ పలురకాలుగా అభిప్రాయపడుతున్నారు. అందరి అభిప్రాయాలను నేను గౌరవిస్తాను.
అది ఒక కళ
ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో డ్యాన్స్ అంటే కేవలం పర్ఫామెన్స్ మాత్రమే కాదు.. కళపై నాకున్న గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంగా ఫీలవుతాను. ఇదంతా కళలో ఒక భాగం. . మేము వేసిన ప్రతి స్టెప్ కూడా మమ్మల్ని మరింత అందంగా చూపించింది. ఆయనతో పని చేయడం వల్ల నా కల నిజమైనట్లుగా ఉంది అని చెప్పుకొచ్చింది.
నేనేం చేయలేదు
కియారా అద్వానీ గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడుతూ.. మనం నటించిన సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ మనకంటూ ఓ క్రేజ్ తీసుకొస్తాయి. ఉదాహరణకు.. 2025లో రూ.100 కోట్లు రాబట్టిన ఫస్ట్ అవుట్‌సైడర్ నటిగా ఓ రికార్డు ఇచ్చారు. ఇది మనకు ఇండస్ట్రీ ఇచ్చే గుర్తింపు. దీనివల్ల మన యాక్టింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. నేను కొన్ని ట్వీట్స్ చూశాను.. కియారా అద్వానీ సినిమా డిజాస్టర్ అయింది. కానీ ఊర్వశి సినిమా బ్లాక్‌బస్టర్ అని రాశారు. అందులో నా హస్తం ఏమాత్రం లేదు అని ఊర్వశి చెప్పుకొచ్చింది.
చదవండి: సారీ చెప్పిన చైల్డ్ ఆర్టిస్ట్ బుల్లి రాజు.. ఎందుకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment