అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో చై మత్య్సకారుడిగా నటిస్తున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య.. మత్య్సకారుల జీవితాల్ని దగ్గరి నుంచి పరిశీలించి తనను తాను మలుచుకున్నాడు. ఈ క్రమంలోనే మీరు వండినట్లే నేను కూడా ఎప్పటికైనా చేపల పులుసు రుచిగా వండి పెడతాను అని షూటింగ్ ప్రారంభంలో మత్య్సకారులకు మాటిచ్చాడట! అన్నట్లుగానే మాట మీద నిలబడ్డాడు.
చేపల పులుసు వండిన చై
కట్టెల పొయ్యిపై మట్టి పాత్ర పెట్టాడు. అందులో శుభ్రంగా కడిగిన చేప ముక్కల్ని వేసి వాటికి పసుపు, ఉప్పు, కారం దట్టించాడు. తర్వాత నూనె వేసి, కాస్త చింతపండు పులుసు పోసి వంట కానిచ్చాడు. మధ్యలో కాస్తంత రుచి చూసి బాగుందని తనకు తానే కితాబిచ్చుకున్నాడు. చివర్లో కొత్తిమీర చల్లి.. చేపల పులుసు సిద్ధం చేశాడు. మత్య్సకారులకు ఆ చేపల పులసుతో భోజనం పెట్టాడు. తన చేతి వంట బాగుందా? అని అడగ్గా తిన్నవారందరూ అదిరిపోయిందని మెచ్చుకున్నారు.
ఏమీ అనుకోవద్దంటూ..
అయితే తన వంటపై తనే డౌట్ పడ్డ చై.. చేపల పులుసు వండటం ఇదే తొలిసారి. బాగోలేకపోతే ఏమీ అనుకోవద్దని నవ్వుతూ చెప్పాడు. మత్య్సకారులతో కలిసి చేపల పులుసుతో అన్నం తింటూ ఆస్వాదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే తండేల్ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment