నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'డాకు మహారాజ్ (Daaku Maharaaj)'. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన లభించింది. గురువారం (జనవరి 2న) మూడో పాట రిలీజైంది. 'డాకు మహారాజ్' చిత్రం నుంచి అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'దబిడి దిబిడి' సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
నందమూరి బాలకృష్ణ అంటే డైలాగ్‌లకు పెట్టింది పేరు. అలా బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్‌తో రూపుదిద్దుకున్న పాటే 'దబిడి దిబిడి'. ఈ సాంగ్‌లో ఊర్వశి రౌతేలా కాలు కదిపారు. గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను వాగ్దేవి ఆలపించారు. విజయ్ కార్తీక్ కన్నన్ అద్భుతమైన విజువల్స్, శేఖర్ వీజే అదిరిపోయే కొరియోగ్రఫీ ఈ పాటను మాస్ ట్రీట్‌లా మార్చింది.
డాకు మహారాజ్ మూవీ విషయానికి వస్తే.. దర్శకుడు బాబీ కొల్లి రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, నిరంజన్ దేవరమానే, రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025 న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. యాక్షన్, వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రూపొందిన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకులను గొప్ప సినిమా అనుభూతిని అందిస్తామని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
చదవండి: ఆ హీరో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగాడు: ఖుష్బూ
Comments
Please login to add a commentAdd a comment