ఆ హీరో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగాడు: ఖుష్బూ | Khushbu Sundar Reveals This Hero Addicted To Alcohol | Sakshi
Sakshi News home page

Khushbu Sundar: ఆ హీరో మందుకు బానిసై ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు

Published Thu, Jan 2 2025 4:52 PM | Last Updated on Thu, Jan 2 2025 5:47 PM

Khushbu Sundar Reveals This Hero Addicted To Alcohol

నటి ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) స్నేహితుల్లో రాజీవ్‌ కపూర్‌ ఒకరు. ఈయన హీరో మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా! తండ్రి రాజ్‌ కపూర్‌ 1985లో చివరిసారి దర్శకత్వం వహించిన రామ్‌ తేరీ గంగ మైలి సినిమా (Ram Teri Ganga Maili Movie)లో ఇతడు హీరోగా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఖుష్బూ నటించాల్సింది. తనతో ఫోటోషూట్‌ కూడా చేశారు. కానీ చివరకు ఆమెను ఎంపిక చేయలేదు.

భయపడినట్లే జరిగింది
దాని గురించి ఖుష్బూ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజ్‌కపూర్‌ (Raj Kapoor) మొదట నన్నే గంగ పాత్రలో ఊహించుకున్నారు. అ‍ప్పుడు నా వయసు పద్నాలుగేళ్లు. నేనే చిన్నపిల్లలా ఉన్నాను. అలాంటిది ఓ పాపను ఎత్తుకుని యాక్ట్‌ చేస్తే బాగోదని వద్దన్నారు అని చెప్పుకొచ్చింది. రాజీవ్‌ కపూర్‌ (Rajiv Kapoor) గురించి మాట్లాడుతూ.. తనకు హృదయ సమస్య ఉంది. అయినా పట్టించుకోకుండా ఎప్పుడూ మందు తాగుతూ ఉండేవాడు. ఇది ఏదో ఒక రోజు పెద్ద సమస్యకు దారి తీస్తుందని మేము భయపడ్డాం. తనతో ఎలాగైనా మద్యపానం మాన్పించాలని ప్రయత్నించాం, కానీ మా వల్ల కాలేదు. తర్వాత చాలా డల్‌ అయిపోయాడు.

ఎన్ని సర్జరీలు చేసినా..
ఆయన మోకాలికి ఏదో సమస్య వచ్చినప్పుడు పలు సర్జరీలు చేశారు. కానీ నయం కాలేదు. చింపు (రాజీవ్‌) ఆరోగ్యం క్షీణిస్తోందని మాకు తెలుసు. తను చనిపోయినప్పుడు నేను ముంబైలో ఉన్నాను. బోనీ కపూర్‌ ఫోన్‌ చేసి విషయం చెప్పగానే షాకయ్యాను. తను చనిపోవడానికి ముందు రోజే మాట్లాడాను. విపరీతమైన జ్వరం ఉంది. అయినా తన అలవాట్లు మార్చుకోలేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. త్వరలోనే కలుస్తానని మాటిచ్చాడు. అంతలోనే ఈ విషాదం జరిగింది అని ఖుష్బూ చెప్పుకొచ్చింది. కాగా రాజీవ్‌ కపూర్‌ 2021 ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించాడు.

చదవండి: 15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్‌ లవ్‌ స్టోరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement