హీరోయిన్లు డేటింగ్‌లో ఉంటే ఇట్టే తెలిసిపోతుంది. వాళ్లు గడప దాటి బయటకు వస్తే చాలు కెమెరాలు వారిని నిరంతరం వెంటాడుతూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నా, బ్రేకప్ చెప్పుకున్నా, పెళ్లికి రెడీ అవుతున్నా అన్నీ వాళ్లు చెప్పకుండానే లీకైపోతుంటాయి. అయితే హీరోయిన్ కీర్తి సురేశ్ (Keerthy Suresh) మాత్రం ఏళ్ల తరబడి తన ప్రేమ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడింది. ప్రియుడు ఆంటోని తటిల్ (Antony Thattil)ని పెళ్లి చేసుకుని షాకిచ్చింది.
మొదట్లో సరదాగా చాటింగ్
తాజాగా తన ప్రేమ కథను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొత్త సంవత్సరంతో మా ప్రేమకు 15 ఏళ్లు పూర్తయ్యాయి. మొదట్లో ఓ నెలరోజులు సరదాగా చాటింగ్ చేసుకున్నాం. ఓరోజు నేను నా కుటుంబంతో రెస్టారెంట్‌కు వెళ్లాను. అతడు కూడా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఉండటంతో కలవలేకపోయాను. ఆ తర్వాత మాత్రం నీకు దమ్ముంటే ప్రపోజ్ చేయ్ డ్యూడ్ అన్నాను. అలా 2010లో నాకు ప్రపోజ్ చేశాడు. 2016 నుంచి అది సీరియస్ రిలేషన్‌షిప్‌గా మారింది. నాకు ఓ ఉంగరం కూడా తొడిగాడు. పెళ్లయ్యేవరకు దాన్ని నేను తీయలేదు. నా సినిమాల్లో కూడా మీరు గమనించవచ్చు.
నా అదృష్టం
తటిల్ నాకంటే ఏడేళ్లు పెద్ద. ఖత్తర్‌లో పని చేస్తూ ఆరేళ్లపాటు నాకు దూరంగా ఉన్నాడు. పన్నెండో తరగతి నుంచి మేము ప్రేమించుకుంటున్నాం. కరోనా సమయంలో కలిసి జీవించాం. నన్ను ఎంతో సపోర్ట్ చేస్తాడు. నన్ను చేసుకోవడం అతడి అదృష్టం అని అంటున్నారు కానీ అతడు దొరకడం నా అదృష్టం. నా ప్రేమ రహస్యం ఇండస్ట్రీలో సమంత (Samantha), విజయ్, అట్లీ, కళ్యాణి ప్రియదర్శన్, ఐశ్వర్య లక్ష్మి సహా కొంతమందికే తెలుసు.
ముహూర్తం బాగోలేదని..
ఎక్కడ చూసినా ఇంకా పసుపుతాడుతోనే కనిపిస్తున్నానంటున్నారు. మంచి ముహూర్తం చూసుకుని దాన్ని బంగారు తాళిగా మార్చుకుంటాను. జనవరి నెలాఖరువరకు బాగోలేదు. అందుకే ఇలా పసుపుతాడుతోనే ఉంటున్నాను అని కీర్తి చెప్పుకొచ్చింది. కాగా కీర్తి డిసెంబర్ 12న హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంది. తర్వాత గోవాలో క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి వివాహం చేసుకున్నారు. ఈ బ్యూటీ ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బేబీ జాన్ సినిమాతో హిందీ చిత్రపరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది.
చదవండి: రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్‌పై ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment