
టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్న తెలంగాణ ఆల్‌రౌండర్
సీనియర్ మహిళల చాలెంజర్ ట్రోఫీ
న్యూఢిల్లీ: జాతీయ సీనియర్ మహిళల చాలెంజర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం జట్లను ప్రకటించింది. డెహ్రాడూన్ వేదికగా ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వరకు ఈ టోర్నీ నిర్వహించనున్నారు. మూడు రోజుల ఫార్మాట్‌లో ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తుండగా, ఇందులో 4 జట్లు పాల్గొంటున్నాయి. స్టార్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ టోర్నీనకి దూరం కాగా... యంగ్ ప్లేయర్లకు అవకాశం దక్కింది.
‘సీనియర్ మహిళల మల్టీ డే చాలెంజర్ ట్రోఫీ కోసం మహిళల సెలెక్షన్ కమిటీ 4 జట్లను ఎంపిక చేసింది. ఎర్రబంతితో జరగనున్న ఈ టోర్నీని డెహ్రాడూన్‌లోని రెండు వేదికల్లో నిర్వహిస్తాం’ అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించాడు. మిన్ను మణి, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ్ రాణా నాలుగు జట్లకు సారథ్యం వహించనుండగా... భారత మహిళల అండర్–19 జట్టుకు రెండోసారి ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఆల్‌రౌండర్ గొంగడి త్రిషకు టీమ్ ‘డి’లో చోటు దక్కింది.
జట్ల వివరాలు
టీమ్ ‘ఎ’: మిన్ను మణి (కెప్టెన్), రిచాఘోష్, శిప్రా గిరి, సుభ సతీశ్, శ్వేతా షెహ్రావత్, వృందా దినేశ్, ముక్తా మగ్రే, హెన్‌రిట్టా పెరీరా, తనూజ కన్వర్, వాసవి పావని, ప్రియా మిశ్రా, అరుంధతి రెడ్డి, సయాలీ సత్‌ఘరే, అనాడీ తగ్డే, ప్రగతి సింగ్.
టీమ్ ‘బి’: హర్లీన్ డియోల్ (కెప్టెన్), యస్తిక భాటియా, మమత, ప్రతీక రావల్, ఆయుశ్ సోని, ఆరుశీ గోయల్, కనిక అహూజ, మితా పాల్, శ్రీ చరణి, మమత పాస్వాన్, ప్రేమ రావత్, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అక్షర, టిటాస్ సాధు.
టీమ్ ‘సి’: జెమీమా రోడ్రిగ్స్ (కెప్టెన్), ఉమా ఛెత్రి, రియా చౌదరి, షఫాలీ వర్మ, త్రిప్తి సింగ్, తనుశ్రీ సర్కార్, తేజల్ హసబ్నిస్, సుశ్రీ దివ్యదర్శిని, సుచి ఉపాధ్యాయ, రాజేశ్వరి గైక్వాడ్, శరణ్య గద్వాల్, జోషిత, శబ్నమ్, సైమా ఠాకూర్, గరిమా యాదవ్.
టీమ్ ‘డి’: స్నేహ్ రాణా (కెప్టెన్), నందిని కశ్యప్, శివంగి యాదవ్, గొంగడి త్రిష, జిన్సీ జార్జ్, రాఘవి, ధార గుజ్జర్, సంస్కృతి గుప్తా, యమున రాణా, వైష్ణవి శర్మ, కీర్తన, అమన్‌జ్యోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, మనాలీ దక్షిణి, మోనిక పటేల్.
Comments
Please login to add a commentAdd a comment