బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) మరోసారి తన మాటలతో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో క్షమాపణలు చెప్పింది. తాజాగా గేమ్ ఛేంజర్( Game Changer) సినిమా రిజల్ట్ గురించి ఊర్వశి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సంక్రాంతి రేసులో పోటీ పడిన చిత్రాల్లో గేమ్ ఛేంజ్‌ర్ కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే అయినప్పటికీ ఊర్వశి చేసిన కామెంట్లు చరణ్ అభిమానుల్లో కోపాన్ని తెప్పించేలా ఉన్నాయి.
డాకు మహరాజ్(Daaku Maharaaj) సినిమాలో బాలకృష్ణతో స్టెప్పులేసిన ఊర్వశికి మంచి గుర్తింపు దక్కింది. దీంతో ఆమె తాజాగా బాలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలో తన పాత్రకు మంచి మైలేజ్ వచ్చిందని ఇలా మాట్లాడింది. 'బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయ్యింది. కానీ, నేను నటించిన డాకు మహరాజ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులో నా తప్పు అయితే లేదు. సినిమా బాగా లేకున్నప్పటికీ పెయిడ్ పీఆర్‌లు సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నా జనాలు తిప్పికోడతారు.' అని ఊర్వశి చెప్పుకోచ్చింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
(ఇదీ చదవండి: అదివారం నాడు ఒక సెంటిమెంట్ ఉంది.. ఈ పని మాత్రం చేయను:బాలకృష్ణ)
చాలామంది ఈ రెండు సినిమాల గురించి సోషల్‌మీడియాలో పలు కామెంట్లు చేస్తున్నారని ఊర్వశి పేర్కొంది. కియారా అద్వానీ నటించిన గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయిందని అంటూనే ఊర్వశి రౌటేలా నటించిన డాకు మహారాజ్ సూపర్ హిట్ అయిందని చాలామంది తెలుపుతున్నారని ఆమె తెలిపింది. శంకర్ సర్ చాలా ప్రసిద్ధ దర్శకుడని ఆమె చెప్పింది. ఆయనతో ఇండియన్ 2లో కూడా పనిచేశానని గుర్తుచేసింది. ఆ సినిమాకు కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. కానీ, అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేదని ఆమె అభిప్రాయపడింది.
వినయ విధేయ రామ సినిమా తర్వాత రామ్ చరణ్- కియారా అద్వానీ జంటగా గేమ్ ఛేంజర్ చిత్రంలో నటించారు. సుమారు రూ. 450 కోట్లతో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పరంగా పెద్దగా రాబట్టలేకపోయింది. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ (10రోజులు) ప్రపంచవ్యాప్తంగా రూ. 125 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు సక్నిల్క్ వెల్లడించింది. అయితే, తొలి రోజే ఈ చిత్రానికి రూ. 186 కోట గ్రాస్ వచ్చినట్లు మూవీ టీమ్ పేర్కొంది. దాంతో సోషల్‌మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కలెక్షన్స్ వివరాలను మూవీ టీమ్ వెల్లడించలేదు.
Kiara's #GameChanger is a disaster and my film #DaakuMaharaaj is a blockbuster.
- @UrvashiRautela pic.twitter.com/ieKUHB9UIP— Telugu Chitraalu (@TeluguChitraalu) January 19, 2025
Comments
Please login to add a commentAdd a comment