
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఈ ఏడాది డాకు మహారాజ్‌తో టాలీవుడ్ ప్రియులను అలరించింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ఈ సినిమాలో దబిడి దిబిడి సాంగ్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించింది. అయితే ఈ పాటపై పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సాంగ్ కొరియోగ్రఫీపై పలువురు విమర్శలు చేశారు.
ఇవన్నీ పక్కన పెడితే తాజాగా బాలీవుడ్ భామను ఓ అవార్డ్ వరించింది. ఫ్యాన్స్ ఫేవరేట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్-2025కు ఎంపికైంది ముద్దుగుమ్మ. డాకు మహారాజ్ చిత్రంలో ప్రదర్శనకు గానూ గోల్డెన్ క్వీన్ అవార్డ్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అవార్డ్ చేతిలో పట్టుకుని ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అంతే కాకుండా తనకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది.