
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పుష్ప బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ సికందర్. ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్, సల్మాన్ ఫిల్మ్ ఖాన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్లపై సాజిద్ నదియావాలా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ సికందర్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. తనతో నటిస్తోన్న హీరోయిన్లతో వయస్సు అంతరంపై ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. నాకు, హీరోయిన్‌కి మధ్య 31 ఏళ్ల వయస్సు గ్యాప్ ఉందని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.. హీరోయిన్ రష్మికకు, ఆమె తండ్రికి నా వయస్సుతో ఎలాంటి సమస్య లేదు.. మీకేంటి ప్రాబ్లమ్ అన్నయ్యా? అంటూ ఫన్నీగా ఆన్సరిచ్చారు. భవిష్యత్తులో రష్మికకు కూతురు పుడితే తనతో కూడా కలిసి పనిచేస్తా అని అన్నారు. రష్మిక అనుమతి తీసుకుంటానని నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
(ఇది చదవండి: సల్మాన్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్.. ట్రైలర్ వచ్చేసింది)
కాగా.. ఆదివారం ముంబయిలో ఏర్పాటు చేసిన గ్రాండ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సికందర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మన్ జోషి, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment