అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో కుబేర, చావ, సికిందర్, ద గర్ల్‌ఫ్రెండ్, థామ సినిమాలున్నాయి. ఇకపోతే సికిందర్ సినిమా విశేషాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రష్మిక.
ఆరోగ్యం బాగోలేకపోయినా..
ఆమె మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్‌తో నటించడమనేది గొప్ప విషయం. ఆయన చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అలాగే ఎంతో హుందాగా ఉంటాడు. ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా షూటింగ్‌కు వెళ్లాను. నా పరిస్థితి తెలిసిన సల్మాన్ సర్ ఎలా ఉంది? అంతా ఓకేనా? అని ఆరా తీశాడు.
స్పెషల్ కేర్
మంచి హెల్తీ ఫుడ్, వేడి నీళ్లు అన్నీ ఏర్పాటు చేయమని అక్కడున్నవారికి చెప్పాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. స్పెషల్ కేర్ చూపించాడు. దేశంలోనే బడా స్టార్స్‌లో ఒకరైనప్పటికీ ఎంతో అణుకువతో ఉంటాడు. సికిందర్ నాకెంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిట్‌గా ఉన్నాను అని రష్మిక చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment