పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారని కథనాలు వచ్చాయి. ఈమేరకు సోషల్‌మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బన్నీ రాజకీయ ప్రవేశం తప్పకుండా ఉంటుందని ఈమేరకు ఆయన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఈ విషయంపై అల్లు అర్జున్ టీమ్ తాజాగా రియాక్ట్ అయింది.
'అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారు అనేవి రూమర్స్ మాత్రమే. బన్నీ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు పూర్తిగా అవాస్తవం. ఇలాంటి నిరాధారమైన వాటిని ఎవరూ ప్రచారం చేయకండి. మేము ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియా సంస్థలు, ప్రజలను అభ్యర్థిస్తున్నాము. అల్లు అర్జున్ నుంచి ఖచ్చితమైన అప్‌డేట్‌ల కోసం ఆయన టీమ్ నుంచి మాత్రమే అధికారిక ప్రకటనలు వస్తాయి. వాటిని మాత్రమే అందరూ నమ్ముతారని ఆశిస్తున్నాం.' అని ఒక నోట్‌ను ఆయన టీమ్ విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment