సల్మాన్ ఖాన్ సికందర్‌.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది! | Salman Khan and Rashmika Mandanna upcoming film Sikandar Song Out Now | Sakshi
Sakshi News home page

Sikandar Song: సల్మాన్ - రష్మిక సికందర్‌.. హోలీ సాంగ్ వచ్చేసింది!

Published Tue, Mar 11 2025 4:35 PM | Last Updated on Tue, Mar 11 2025 4:41 PM

Salman Khan and Rashmika Mandanna upcoming film Sikandar Song Out Now

బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తోన్న తాజా చిత్రం సికందర్. ఈ మూవీలో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ రష్మిక హవా కొనసాగుతోంది. ఇటీవలే ఛావా మూవీతో ప్రేక్షకులను పలకరించిన భామ.. రంజాన్ కానుకగా మరోసారి అభిమానులను అలరించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై  సాజిద్ నదియావాలా నిర్మిస్తున్నారు.

తాజాగా సికందర్ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను విడుదల చేశారు. భమ్ భమ్ భోలే అంటూ సాగే పాటను విడుదల చేశారు. హోలీ పండుగ రంగుల నేపథ్యంలో రూపొందించిన ఈ పాట సల్మాన్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, జోహ్రా జబీన్ పాటకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సాంగ్‌లో కాజల్ అగర్వాల్ కూడా అభిమానులను మెప్పించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రంజాన్ కాననుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement