
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్భుతమైన బంతితో అయ్యర్‌ను బోల్తా కొట్టించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన కృనాల్.. తొలి బంతిని వెంకటేశ్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.
ఆ బంతిని అయ్యర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కృనాల్ ఎక్కువ వేగంతో బంతిని సంధించడంతో.. అది అయ్యర్ బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత రింకూ సింగ్‌ను కూడా ఇదే తరహా బంతితో పాండ్యా బోల్తా కొట్టించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు.
అయ్యర్‌పై భారీ ధర..
కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌పై కేకేఆర్ భారీ ధర వెచ్చింది. అతడిని ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. కేకేఆర్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా తమ జట్టు వైస్ కెప్టెన్సీని కూడా కేకేఆర్ అప్పగించింది. కానీ వెంకటేశ్ మాత్రం మొదటి మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.
ఆర్సీబీ ఘనవిజయం..
కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు.
ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(44),రఘువంశీ(30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, సుయాష్ శర్మ, సలీం తలా వికెట్ సాధించారు.
చదవండి: IPL 2025: అజింక్య రహానే విధ్వంసం.. కేవలం 25 బంతుల్లోనే! వీడియో వైరల్
— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025
Comments
Please login to add a commentAdd a comment