RCB vs KKR
-
‘ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని విరాట్ సర్ చెప్పారు’
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.ఒకరోజు జైలులోఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం. అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు. PC: BCCI/IPLపశ్చాత్తాపం లేదుఅయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెద్ద మనసుతో క్షమించండిఅయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.శుక్లా తీరుపై విమర్శలు‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉కోల్‌కతా- 174/8 (20)👉ఆర్సీబీ- 177/3 (16.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపుచదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్ -
’పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశాను.. రహానే ఆ ట్రిక్ మిస్సయ్యాడు’
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కెప్టెన్‌గా టీమిండియా వెటరన్ క్రికెటర్ అజింక్య రహానేకు శుభారంభం లభించలేదు. అతడి సారథ్యంలో డిఫెండింగ్ చాంపియన్ తమ తొలి మ్యాచ్‌లోనే ఘోర ఓటమిని చవిచూసింది. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.ఇక కేకేఆర్ సారథిగా అజింక్య రహానే ఈ మ్యాచ్‌తో తన ప్రయాణం మొదలుపెట్టగా.. ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌కు కూడా ఇదే తొలి మ్యాచ్ కావడం విశేషం. అయితే, సీనియర్ అయిన రహానే.. పాటిదార్ పన్నిన వ్యూహాల ముందు తేలిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్ ఆరంభంలో తాను పాటిదార్‌ను తక్కువగా అంచనా వేశానని.. అయితే, రహానే తన చెత్త నిర్ణయాలతో అతడి ముందు తలవంచాడని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘రజత్ పాటిదార్ కెప్టెన్‌గా రాణించగలడా? అనే సందేహం ఉండేది.కేకేఆర్‌తో మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లు ఆర్సీబీకి బాగానే సాగింది. కానీ నాలుగో ఓవర్లో పాటిదార్.. రసిఖ్ సలామ్‌ను తీసుకువచ్చాడు. ఐదో ఓవర్లో కృనాల్ పాండ్యాను బరిలోకి దించాడు. దయచేసి ఇలా చేయకు పాటిదార్ అని మనసులో అనుకుంటూనే ఉన్నాను.రహానే బ్యాట్‌తో చెలరేగడంతో కేకేఆర్ పది ఓవర్లలో వంద పరుగుల మార్కు అందుకుంది. నిజానికి ఆ జట్టు 200కు పైగా స్కోరు చేయాల్సింది. కానీ పాటిదార్ వ్యూహాలు అప్పుడే పని చేయడం మొదలుపెట్టాయి. తొలి పది ఓవర్లలో పాటిదార్‌కు కెప్టెన్‌గా అసలు మార్కులేమీ వేయలేకపోయాను.నిజానికి ఆర్సీబీ బలహీనత స్పిన్నర్లు. కానీ కృనాల్ సేవలను పాటిదార్ ఉపయోగించుకున్న తీరు అద్బుతం. స్పిన్నర్లనే జట్టుకు బలంగా మార్చాడు. కృనాల్ తొలి ఓవర్లో భారీగా పరుగులు ఇచ్చినా.. తర్వాత మూడు వికెట్లు తీశాడు. సూయశ్ లూజ్ బాల్స్ వేసినా.. రసెల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకున్నాడు.దీంతో కేకేఆర్ కనీసం 175 పరుగుల మార్కు కూడా దాటలేకపోయింది. నేను పాటిదార్ గురించి ఏమనుకున్నానో.. అది రహానే విషయంలో నిజమైంది. నిజానికి నరైన్‌ను ఆరంభంలోనే బౌలింగ్ చేయించాల్సింది. ఆర్సీబీ బ్యాటర్లు పరుగులు పిండుకుంటున్నా.. నరైన్‌ను రహానే ఆలస్యంగా పిలిపించడం ప్రభావం చూపింది.రహానే ట్రిక్ మిస్సయ్యాడు. దానిని ఆర్సీబీ క్యాష్ చేసుకుంది. కెప్టెన్‌గా పాటిదార్ హిట్టయితే.. రహానే మాత్రం గతంలో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నా తేలిపోయాడు. ఇక బ్యాటర్‌గానూ పాటిదార్ అదరగొట్టాడు. సునిల్ నరైన్ బౌలింగ్‌లో అతడు మూడు సిక్సర్లు బాదడం మామూలు విషయం కాదు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని నరైన్ బౌలింగ్‌ను చాలాసార్లు ఎదుర్కొన్నారు. అయితే, ముగ్గురూ కలిసి అతడి బౌలింగ్‌లో కేవలం నాలుగు సిక్సర్లే కొట్టారు. అయితే, పాటిదార్ మాత్రం ఇక్కడే తన సుప్రిమసీ చూపించాడు. కెప్టెన్‌గా గొప్ప ఆరంభం అందుకున్నాడు’’ అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు. కాగా రహానే గతంలో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్(ఇప్పుడు లేదు), రాజస్తాన్ రాయల్స్ జట్లకు సారథిగా పనిచేశాడు.ఐపీఎల్-2025: కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ స్కోర్లుకేకేఆర్- 174/8 (20)ఆర్సీబీ- 177/3 (16.2)ఫలితం: ఏడు వికెట్ల తేడాతో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలుపు -
KKR VS RCB: అప్పుడే మ్యాచ్ చేజారింది.. మంచు కూడా వారికి కలిసొచ్చింది: రహానే
ఆర్సీబీతో జరిగిన సీజన్ ఓపెనర్‌లో (IPL 2025) డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ఓటమి చవి చూసింది. సొంత మైదానంలో (ఈడెన్ గార్డెన్స్) జరిగిన మ్యాచ్ అయినా కేకేఆర్‌కు పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే 10 ఓవర్ తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మూడు బంతుల వ్యవధిలో నరైన్, రహానే ఔటయ్యారు. దీంతో పరుగులు రావడం చాలా కష్టమైంది. ఈ దశలో ఆర్సీబీ స్పిన్నర్లు రెచ్చిపోయారు. పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. ఫలితంగా 200 దాటుతుందనుకున్న కేకేఆర్ స్కోర్ 174 పరుగులకే పరిమితమైంది. ఛేదనలో ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నందించారు. వీరిద్దరూ పవర్ ప్లేలో 80 పరుగులు చేసి కేకేఆర్ చేతిలో నుంచి మ్యాచ్‌ను అప్పుడే లాగేసుకున్నారు. సాల్ట్, కోహ్లితో పాటు పాటిదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఆర్సీబీ మరో 22 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ గెలుపులో బౌలర్లు ప్రధాన పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ సామర్థ్యం మేరకు రాణించి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. యశ్ దయాల్ (3-0-25-1) పర్వాలేదనిపించాడు. సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఓటమి అనంతరం కేకేఆర్ కెప్టెన్ రహానే ఇలా అన్నాడు. 13వ ఓవర్ వరకు మంచి స్కోర్ సాధిస్తామని అనుకున్నాను. కానీ ఆ దశలో వికెట్లు కోల్పోవడంతో తామనుకున్నది జరగలేదు. వరుస క్రమాల్లో వికెట్లు కోల్పోవడం తమ జోరుకు అడ్డుకట్ట వేసింది. నా తర్వాత (ఇన్నింగ్స్‌లో) వచ్చిన బ్యాటర్లు వారి శక్తి మేరకు ప్రయత్నించినప్పటికీ వర్కౌట్ కాలేదు. నేను, వెంకీ (అయ్యర్) బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200-210 పరుగులు సాధించవచ్చని చర్చించుకున్నాం. కానీ వరుస వికెట్లు తమ జోరును నీరుగార్చాయి. పవర్ ప్లేలో సాల్ట్, కోహ్లి అద్భుతంగా ఆడారు. అప్పుడే మ్యాచ్ మా నుంచి చేజారింది. మంచు కూడా వారి గెలుపుకు సహకరించింది. 200 పైబడిన స్కోర్ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఓవరాల్‌గా క్రెడిట్ ఆర్సీబీ ఆటగాళ్లకు దక్కుతుంది. కీలక దశలో తమను కట్టడి చేయడంతో పాటు పవర్ ప్లేలో వారి బ్యాటింగ్ అద్భుతంగా ఉండింది. ఈ మ్యాచ్ గురించి ఇంకా డిస్కస్ చేయాలని అనుకోవడం లేదు. కొన్ని అంశాల్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. కాగా, కేకేఆర్ కెప్టెన్‌గా రహానేకు ఇది తొలి మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే ఓటమితో రహానే కాసింత నిరాశకు లోనైనట్లు కనిపించాడు. వ్యక్తిగతంగా అతను రాణించినా కేకేఆర్‌కు అది వర్కౌట్ కాలేదు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆర్సీబీ బ్యాటర్ల ముందు వారు తేలిపోయారు. ముఖ్యంగా వారి జట్టులో ఒక్క అనుభవజ్ఞుడైన పేసర్ కూడా లేడు. ఈ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. గత సీజన్లో కేకేఆర్ విజయాల్లో పేసర్లు ప్రధాన పాత్ర పోషించారు. కానీ ఈ సీజన్లో ఆ జట్టు పేసర్లను కాకుండా స్పిన్నర్లనే ఎక్కువ నమ్ముకుంది. మరి స్పిన్నర్లు కేకేఆర్‌ను టైటిల్ నిలబెట్టుకునేలా చేస్తారో లేదో వేచి చూడాలి.కాగా, ఈ సీజన్లో కేకేఆర్ తమ తదుపరి మ్యాచ్‌ను మార్చి 26న ఆడుతుంది. గౌహతి వేదికగా నాడు జరిగే మ్యాచ్‌లో కేకేఆర్ రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. -
IPL 2025: ఇలాగే గెలుస్తూ పోతే టైటిల్ మాదే: ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్
ఆర్సీబీ నయా కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తన కెరీర్‌ను గెలుపుతో ప్రారంభించాడు. నిన్న (మార్చి 22) జరిగిన సీజన్ ఓపెనర్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాటిదార్ కెప్టెన్‌గా తన ఖాతాను ఓపెన్ చేయడంతో పాటు ఈ సీజన్లో ఆర్సీబీకి తొలి విజయాన్నందించాడు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలుండగానే ఛేదించే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి కొత్త జోష్‌తో టైటిల్ వేటను ప్రారంభించింది.కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (59 నాటౌట్) తన సహజశైలిలో అద్భుతంగా ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. హాజిల్‌వుడ్, యశ్ దయాల్, పాటిదార్ ఆర్సీబీ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. సుయాశ్ శర్మ (4-0-47-1), రసిక్ సలామ్ (3-0-35-1) తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి మ్యాచ్‌లో గెలుపు అనంతరం పాటిదార్ ఇలా అన్నాడు. ఇలాగే గెలుస్తూ పోతే ఈ సీజన్లో టైటిల్ తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. మొత్తంగా ఇది తనకు మంచి రోజని అన్నాడు. సుయాష్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై స్పందిస్తూ.. తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. సుయాష్ తమ ప్రధాన వికెట్ టేకింగ్ బౌలరని అన్నాడు. కెప్టెన్‌గా అతనికి మద్దతు ఇచ్చానని తెలిపాడు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను పొగడ్తలతో ముంచెత్తాడు. గెలుపు క్రెడిట్లో కృనాల్, సుయాష్‌కు మెజార్టీ వాటా దక్కుతుందని తెలిపాడు. 13 ఓవర్ల తర్వాత వారు ధైర్యం, దృఢ సంకల్పం చూపించారని కితాబునిచ్చాడు. వారిలో వికెట్లు తీయాలనే తపన అద్భుతంగా ఉండిందని కొనియాడాడు.కోహ్లి గురించి మాట్లాడుతూ.. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమని అన్నాడు. కోహ్లి లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుందని తెలిపాడు. క్రీడలో గొప్ప ఆటగాడి (కోహ్లి) నుంచి నేర్చుకోవడానికి ఇది తనకు గొప్ప అవకాశమని అన్నాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌పై స్పందిస్తూ.. అది ముందుగా నిర్ణయించుకుని ఆడిన షాట అని తెలిపాడు. కాగా, 2021 సీజన్ నుంచి కేకేఆర్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఆరింట ఓడింది. గత రెండు సీజన్లలో నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమిపాలైంది. తాజా గెలుపుతో ఆర్సీబీ కేకేఆర్‌పై తమ ట్రాక్ రికార్డు కాస్త మెరుగుపర్చుకుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో సీఎస్కే ఢీకొంటుంది. మార్చి 28న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక నేటి (మార్చి 23) మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్‌లో).. రాత్రి మ్యాచ్‌లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ (చెన్నై) ఢీకొంటాయి. -
IPL 2025: కేకేఆర్, ఆర్సీబీ మ్యాచ్‌లో వివాదాస్పద ఘటన
ఐపీఎల్ 2025 సీజన్ ఘనంగా ప్రారంభమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న (మార్చి 22) జరిగిన ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను ఆర్సీబీ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించి, సీజన్‌ను విజయంతో ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వెటరన్లు సునీల్ నరైన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), అజింక్య రహానే (31 బంతుల్లో 56; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి కేకేఆర్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరు మినహా కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ 30 పరుగులు చేసినా నిదానంగా ఆడాడు. డికాక్ 4, వెంకటేశ్ అయ్యర్ 6, రింకూ సింగ్ 12, రసెల్ 4 పరుగులకు ఔటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్ సామర్థ్యం మేరకు రాణించి 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. యశ్ దయాల్ (3-0-25-1) పర్వాలేదనిపించాడు. సుయాశ్ శర్మ, రసిక్ సలామ్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి నయా ఓపెనింగ్ జోడి ఫిల్ సాల్ట్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లి (36 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించింది. వీరిద్దరు పవర్ ప్లేలో (తొలి 6 ఓవర్లలో) చెలరేగి పోయి 80 పరుగులు సాధించారు. మంచి పునాది పడటంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ సునాయాసంగా విజయం సాధించింది. సాల్ట్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (10 బంతుల్లో 10) నిరాశపర్చినా ఆతర్వాత వచ్చిన రజత్ పాటిదార్ (16 బంతుల్లో 34; 5 ఫోర్లు, సిక్స్) ఆర్సీబీని వేగంగా గెలుపుతీరాలకు చేర్చాడు. ఆఖర్లో లివింగ్‌స్టోన్ (5 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో సునీల్ నరైన్ (4-0-27-1) మినహా కేకేఆర్ బౌలర్లందరినీ ఆర్సీబీ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. ఛేదనలో ఆర్సీబీకి డ్యూ ఫ్యాక్టర్ కలిసొచ్చింది. తొలి 10 ఓవర్లలోనే కేకేఆర్ విషయంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఓ వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 7వ ఓవర్లో సునీల్ నరైన్ బ్యాట్ వికెట్లకు తాకింది. బెయిల్స్ కూడా కింద పడ్డాయి. అయితే అంపైర్లు మాత్రం నరైన్‌ను హిట్ వికెట్‌గా ప్రకటించలేదు. pic.twitter.com/wcHGSw8Svz— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025సదరు బంతిని అంపైర్ వైడ్ బాల్‌గా సిగ్నల్ ఇవ్వడం.. అప్పటికే వికెట్ కీపర్ జితేష్ శర్మ బంతిని సేకరించడం, నరైన్ తన డెలివరీ యాక్షన్‌ను పూర్తి చేయడంతో అంపైర్ నరైన్‌ను హిట్‌వికెట్‌గా ప్రకటించలేదు.ఎంసీసీ నియమాల ప్రకారం, ఒక బ్యాటర్ బంతిని ఆడుతున్నప్పుడు లేదా పరుగు కోసం స్టార్ట్ అవుతున్నప్పుడు లేదా వికెట్‌ను కాపాడుకోవడానికి రెండవ హిట్ చేస్తున్నప్పుడు బ్యాట్ స్టంప్‌లను తగిలితే అప్పుడు ఆ బ్యాటర్‌ను ఔట్ హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. షాట్ ఆడిన తర్వాత లేదా డెలివరీ పూర్తయిన తర్వాత బ్యాట్ స్టంప్‌లను తాకితే అది ఔట్ హిట్ వికెట్‌గా పరిగణించబడదు. తాజా ఉదంతంలో బంతి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత నరైన్ బ్యాట్ స్టంప్‌లను తాకినందున, ఎంసీసీ లా 35.2 ప్రకారం దానిని నాటౌట్‌గా ప్రకటించారు. -
RCB Vs KKR: కృనాల్ సూపర్ బాల్.. రూ.23 కోట్ల ఆటగాడికి ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్-2025లో ఈడెన్‌గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ తీవ్ర నిరాశపరిచాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్.. కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా అద్భుతమైన బంతితో అయ్యర్‌ను బోల్తా కొట్టించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన కృనాల్.. తొలి బంతిని వెంకటేశ్‌కు లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని అయ్యర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ కృనాల్ ఎక్కువ వేగంతో బంతిని సంధించడంతో.. అది అయ్యర్ బ్యాట్, ప్యాడ్ మధ్యలో నుంచి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ తర్వాత రింకూ సింగ్‌ను కూడా ఇదే తరహా బంతితో పాండ్యా బోల్తా కొట్టించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో పాండ్యా మూడు వికెట్లు పడగొట్టాడు.అయ్యర్‌పై భారీ ధర..కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌పై కేకేఆర్ భారీ ధర వెచ్చింది. అతడిని ఏకంగా రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. కేకేఆర్ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా తమ జట్టు వైస్ కెప్టెన్సీని కూడా కేకేఆర్ అప్పగించింది. కానీ వెంకటేశ్ మాత్రం మొదటి మ్యాచ్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు.ఆర్సీబీ ఘనవిజయం..కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు.ఇక తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(44),రఘువంశీ(30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, సుయాష్ శర్మ, సలీం తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: అజింక్య రహానే విధ్వంసం.. కేవలం 25 బంతుల్లోనే! వీడియో వైరల్pic.twitter.com/b5mlBsskAg— kuchnahi123@12345678 (@kuchnahi1269083) March 22, 2025 -
RCB Vs KKR: అజింక్య రహానే విధ్వంసం.. కేవలం 25 బంతుల్లోనే! వీడియో వైరల్
ఐపీఎల్-2025లో తొలి హాఫ్ సెంచరీ నమోదైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. తొలి ఓవర్లోనే క్రీజులోకి వచ్చిన రహానే.. ఆరంభం నుంచే ఆర్సీబీ బౌలర్లపై విరుచుపడ్డాడు.తనదైన శైలిలో స్టైల్లో షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రహానే కేవలం 25 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 31 బంతులు ఎదుర్కొన్న రహానే.. 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.రహానే అరుదైన రికార్డు..కాగా ఈ మ్యాచ్‌తో రహానే ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు ఫ్రాంచైజీలకు సారథిగా వ్యవహరించిన తొలి భారత ఆటగాడిగా రహానే రికార్డులకెక్కాడు. రహానే తొలిసారిగా 2017 ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్ (RPS) జట్టుకు సారథిగా వ్యవహరించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2019లో రాజస్తాన్ రాయల్స్‌కు నాయకత్వం వహించిన రహానే.. ఇప్పుడు మళ్లీ కేకేఆర్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. దీంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఐపీఎల్-2025లో మెగా వేలంలో రహానేను కేవలం రూ. 1.5 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి రౌండ్లో అమ్ముడుపోని రహానే ఆఖరి రౌండ్లో కేకేఆర్ సొంతం చేసుకుంది. Proud of You My Man Sir AJINKYA RAHANE 🥹❤️🫡 pic.twitter.com/VeNXSmW2n1— Malay 🇮🇳❤ (@malay_chasta) March 22, 2025 -
IPL 2025: ఈసారి ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలు వీరే!
పదిహేడు సీజన్లు విజయంతంగా పూర్తి చేసుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్ క్రికెట్లోని అసలైన మజాను అందించేందుకు.. రెండు నెలలకు పైగా వినోదం అందించేందుకు సిద్ధంగా ఉంది. కోల్‌కతా- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో మార్చి 22న మొదలుకానున్న ఐపీఎల్-2025 సీజన్ మే 25న ఫైనల్‌తో ముగియనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరే జట్లు, విజేత, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విజేతలపై మాజీ క్రికెటర్లు తమ అంచనాలు తెలియజేస్తున్నారు. ఈసారి ముంబై ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంచనా వేశాడు.మరోవైపు.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరతాయని సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ జోస్యం చెప్పాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ విజేతలపై తన అంచనా తెలియజేశాడు.‘‘ఐపీఎల్ సందడి మొదలైపోయింది. మీ ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ విన్నర్లు ఎవరు? నేనైతే ఐపీఎల్-2025లో సాయి సుదర్శన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు ఓటు వేస్తా’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. కాగా తమిళనాడుకు చెందిన సాయి సుదర్శన్ గతేడాది గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు.ఐపీఎల్-2024లో ఈ 23 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్.. 12 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 527 పరుగులు రాబట్టాడు. ఇందులో ఓ శతకం కూడా ఉండటం విశేషం. టైటాన్స్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలవడంతో పాటు.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.ఈ మేర అద్భుత ప్రదర్శన కనబరిచిన చెన్నై చిన్నోడు సాయి సుదర్శన్‌ను మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ ఏకంగా రూ. 8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరోవైపు.. టీమిండియా టీ20 స్పెషలిస్టు, భారత్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్ల వీరుడిగా ఉన్న అర్ష్‌దీప్ సింగ్.. గతేడాది పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు.మొత్తంగా 14 మ్యాచ్‌లలో కలిపి 10.03 ఎకానమీ రేటుతో ఏకంగా పందొమ్మిది వికెట్లు కూల్చాడు. కానీ.. మెగా వేలానికి ముందు పంజాబ్ ఈ లెఫ్టార్మ్ పేసర్‌ను రిటైన్ చేసుకోలేదు. అయితే, వేలంపాటలో రూ. 18 కోట్ల మొత్తానికి రైట్-టు- మ్యాచ్ కార్డు (వేరే ఫ్రాంఛైజీ సొంతం చేసుకునే ముందు.. అంతే మొత్తానికి తిరిగి దక్కించుకునే అవకాశం) ఉపయోగించి మళ్లీ అతడిని తమ జట్టులో చేర్చుకుంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోగా.. హర్షల్ పటేల్(పంజాబ్ కింగ్స్) 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అంతకుముందు శుబ్‌మన్ గిల్(గుజరాత్ టైటాన్స్) 890 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా నిలవగా.. మహ్మద్ షమీ (గుజరాత్ టైటాన్స్) తరఫున 28 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. -
IPL 2025: తారలు దిగొచ్చిన వేళ.. అంగరంగ వైభవంగా.. అట్టహాసంగా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఆట, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.Photo Courtesy: BCCI/IPLడిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మైదానంలో సందడి చేశౠడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారథి రజత్ పాటిదార్లతో కాసేపు ముచ్చటించాడు.Photo Courtesy: BCCI/IPLఅనంతరం వేదికపైకి వచ్చి తనదైన శైలిలో ప్రసంగించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్లో భాగం కావడం సంతోషంగా ఉందని షారుఖ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన గాత్రంతో ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. హిందీ పాటలతో పాటు పుష్ప-2 సినిమాలోని పాపులర్ సాంగ్ ..‘‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’’.. తెలుగులో పాడటం విశేషం.ఆ తర్వాత స్టార్ హీరోయిన్ దిశా పటానీ హుషారైన స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది.ఆ తర్వాత టీమిండియా, ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లిని షారుఖ్ స్టేజీ మీదకు ఆహ్వానించాడు. కోహ్లితో ముచ్చటించిన అనంతరం.. కేకేఆర్ యువ తార రింకూ సింగ్‌ను కూడా వేదిక మీదకు పిలిచాడు. ముగ్గురూ కలిసి కాసేపు స్టెప్పులు వేశారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌లను వేదిక మీదకు ఆహ్వానించగా... ఐపీఎల్-18 కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.Photo Courtesy: BCCI/IPL