
Photo Courtesy: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ వేడుకలు అట్టహాసంగా సాగాయి. కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో బాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఆట, పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

Photo Courtesy: BCCI/IPL
డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మైదానంలో సందడి చేశౠడు. కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారథి రజత్ పాటిదార్‌లతో కాసేపు ముచ్చటించాడు.

Photo Courtesy: BCCI/IPL
అనంతరం వేదికపైకి వచ్చి తనదైన శైలిలో ప్రసంగించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన క్రికెట్ లీగ్‌గా వెలుగొందుతున్న ఐపీఎల్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని షారుఖ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన గాత్రంతో ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. హిందీ పాటలతో పాటు పుష్ప-2 సినిమాలోని పాపులర్ సాంగ్ ..‘‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’’.. తెలుగులో పాడటం విశేషం.ఆ తర్వాత స్టార్ హీరోయిన్ దిశా పటానీ హుషారైన స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించింది.
ఆ తర్వాత టీమిండియా, ఆర్సీబీ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లిని షారుఖ్ స్టేజీ మీదకు ఆహ్వానించాడు. కోహ్లితో ముచ్చటించిన అనంతరం.. కేకేఆర్ యువ తార రింకూ సింగ్‌ను కూడా వేదిక మీదకు పిలిచాడు. ముగ్గురూ కలిసి కాసేపు స్టెప్పులు వేశారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీతో పాటు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌లను వేదిక మీదకు ఆహ్వానించగా... ఐపీఎల్-18 కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

Photo Courtesy: BCCI/IPL
Comments
Please login to add a commentAdd a comment