
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్‌గా రాణిస్తోంది అవనీత్ కౌర్ (Avneet Kaur). అయితే అప్పటికి, ఇప్పటికీ అవనీత్ చాలా మారిపోవడంతో తను ఏదైనా సర్జరీ చేయించుకుందన్న పుకార్లు కూడా వచ్చాయి. వీటన్నింటికీ ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో చెక్ పెట్టింది. అవనీత్ కౌర్ మాట్లాడుతూ.. చిన్నప్పటినుంచి నేను కెమెరా చూస్తూనే పెరిగాను. చాలామంది నా గురించి విచిత్రంగా మాట్లాడుతుంటారు.
ప్లాస్టిక్ సర్జరీ.. గట్రా!
చిన్నప్పుడు ఎలా ఉండేది.. ఇప్పుడెలా అయింది.. చాలా మారిపోయింది. కచ్చితంగా తన ముఖానికి ఏదో ట్రీట్‌మెంట్ చేయించుకుంది అంటుంటారు. ఈ తరహా కామెంట్లు చదివినప్పుడు కోపమొస్తుంది. ఎందుకంటే ఏడెనిమిదేళ్ల వయసులో నేను చిన్న పిల్లను. ఎదుగుతూ ఉండేకొద్దీ శరీరంలో మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు నాకు 23 ఏళ్లు. చిన్నప్పటిలా ఎలా ఉంటాను?

కేవలం అది మాత్రమే..
నేను ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదు. ఏ ఫిల్లర్స్ వేయించుకోలేదు. కాకపోతే ముఖానికి ఫేషియల్ మాత్రం చేయించుకుంటాను. చర్మసంరక్షణ కోసం ఆమాత్రమైనా చేయాలి కదా! చర్మం వదులుగా కాకుండా బిగుతుగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అవనీత్ కౌర్ జన్మస్థలం పంజాబ్. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే పలు స్టేజ్ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టీవీ షోల నుంచి సినిమాల దాకా..
‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్’, ‘డాన్స్ కీ సూపర్ స్టార్స్’, ‘ఝలక్ దిఖ్‌లా జా 5’ తదితర డ్యాన్స్ షోలలో పాల్గొంది. ‘మేరీ మా’, ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్‌లో యాస్మిన్ పాత్రతో ఫేమస్ అయింది. అలా మర్దానీ సినిమాలో నటించింది. ‘దోస్త్’, ‘బ్రూనీ’, ‘ఏక్తా’, ‘మర్దానీ 2’, 'టీకూ వెడ్స్ షెరూ', 'లవ్‌కీ అరేంజ్ మ్యారేజ్' చిత్రాల్లో యాక్ట్ చేసింది.
చదవండి: నిజం ఎంతోకాలం దాగదు, ఈ రోజు వస్తుందని తెలుసు: మంచు లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment