-
కేన్స్ 2024: బాలీవుడ్ హీరోయిన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!
భారతీయులు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. తాజాగా అవనీత్ కూడా ఒకింత సంతోషంగా మరింత గర్వంగా ఉంది.ఎర్ర తివాచీపై వయ్యారంగా..తొలిసారి ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంది. ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్ చలనచిత్రోత్సవాలలో రెడ్ కార్పెట్‌పై నడిచింది. మే 23న ఎర్ర తివాచీపై వయ్యారంగా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ తనకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకుగానూ నేలకు నమస్కరించి తర్వాత అక్కడ రెడ్ కార్పెట్‌పై హొయలు పోయింది. అచ్చమైన భారతీయురాలుఇది చూసిన జనాలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే.. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మర్దాని సినిమాతో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టిన అవనీత్ బ్రూనీ, ఏక్తా, చిడియాఖన్నా, టికు వెడ్స్ షెరు వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె లవ్ కీ అరేంజ్ మ్యారేజ్, లవ్ ఇన్ వియత్నాం సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: కేన్స్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్ -
దంగల్ ఆడిషన్.. నన్ను సెలక్ట్ చేయలేదు: హీరోయిన్
ఎక్కువ ఏళ్లు ఇండస్ట్రీలో నెట్టుకురావడం అనేది అంత ఈజీ కాదు! కానీ అది అసాధ్యమేమీ కాదని, తలుచుకుంటే సుసాధ్యమవుతుందని నిరూపించింది బాలీవుడ్ నటి అవనీత్ కౌర్. చిన్నప్పుడు 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్' షోలో చిన్ని డ్యాన్సర్‌గా అలరించింది. ఎనిమిదేళ్ల వయసులోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొంది. తర్వాతి కాలంలో డ్యాన్సర్‌గానే కాకుండా నటిగానూ అలరిస్తూ వస్తోంది. ఆ సినిమాలకు రిజెక్ట్.. మేరీ మా, సావిత్రి ఏక్ ప్రేమ్ కహాని సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. అలాద్దీన్ సీరియల్లో హీరోయిన్గా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించింది. అలా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. బ్రూనీ, ఏక్తా, మర్దానీ 2 వంటి సినిమాలతో పాటు పలు సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది. అయితే కొన్ని ఆడిషన్స్‌లో తనను రిజెక్ట్ చేశారంటోందీ బ్యూటీ. తాజాగా ఆమె స్టార్ హీరో నిర్మించిన లాల్పట్టా లేడీస్ సినిమా ప్రీమియర్‌కు హాజరైంది. ఈ క్రమంలో అక్కడున్న ఆమిర్‌ను కలిసింది. ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు కలిశా అయితే ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి కాదని చెప్పుకొచ్చింది. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాల ఆడిషన్స్‌కు వెళ్లానని, అప్పుడు ఆయన్ను కలిశానంది. ఆ రెండు సినిమాలకు ఆడిషన్ ఇచ్చానని, వర్క్‌షాప్‌కు కూడా వెళ్లానని కానీ తనను సెలక్ట్ చేయలేదని తెలిపింది. అయితే ఆమిర్ మాత్రం తనను మెచ్చుకున్నాడని చెప్తూ ఉబ్బితబ్బిబైపోయింది. అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: మనసు మార్చుకున్న బ్యూటీ.. బోల్డ్ సీన్స్‌కు పచ్చజెండా.. ఆ సీన్ అందుకే చేశానంటూ.. -
8 ఏళ్లకే ఇండస్ట్రీలోకి.. టీవీ నుంచి సినిమాల్లోకి.. హీరోయిన్గా క్రేజ్
'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్‌లో డ్యాన్సర్‌గా అలరించిన చిన్నారి ఇప్పుడేకంగా సినిమాల్లో హీరోయిన్గా రాణిస్తోంది. తన ఎనిమిదో ఏట ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. నేడు వరుస సినిమాలు, సీరియల్స్, సిరీస్‌లతో దూసుకుపోతున్న నటి అవనీత్ కౌర్ గురించి కొన్ని విషయాలు.. అవనీత్ కౌర్ జన్మస్థలం పంజాబ్. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అలా ఎనిమిదేళ్ల వయసు నుంచే పలు స్టేజ్ షోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్’, ‘డాన్స్ కీ సూపర్ స్టార్స్’, ‘ఝలక్ దిఖ్లా జా 5’ తదితర డ్యాన్స్ షోలో పాల్గొని సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది. పలు బాలీవుడ్, పంజాబీ మ్యూజిక్ వీడియోల్లోనూ ఆడిపాడింది. ఒకవైపు డ్యాన్స్ షోల్లో పొల్గొంటూనే.. టీవీ సీరియల్స్‌లోనూ నటించేది. అలా ‘మేరీ మా’, ‘సావిత్రి ఏక్ ప్రేమ్ కహానీ’, ‘హమారీ సిస్టర్ దీదీ’ వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. ‘అలాద్దీన్’ సీరియల్లో హీరోయిన్ యాస్మిన్ పాత్రతో అవనీత్ పాపులర్ అయింది. ఆ పాపులారిటీయే అవనీత్కి సినిమా అవకాశాన్నిచ్చింది. తొలిసారి వెండితెర మీద.. ‘మర్దానీ’లో మీరా పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ‘దోస్త్’, ‘బ్రూనీ’, ‘ఏక్తా’, ‘మర్దానీ 2’ సినిమాల్లో నటించింది. వెబ్తెరపై ‘బాబర్ కా తాబర్’, ‘బందిశ్ బండిట్స్’ వెబ్ సిరీస్‌లతో వీక్షకులనూ పలకరించింది అవనీత్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న ‘టీకూ వెడ్స్ శేరూ’ సినిమాతో అలరిస్తోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నిర్మించారు. ముంబైకి వచ్చినప్పుడు నాకసలు ఇంగ్లిష్ రాదు. ఇండస్ట్రీనే నాకు మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషలనూ నేర్పింది. – అవనీత్ కౌర్ View this post on Instagram A post shared by Avneet Kaur Official (@avneetkaur_13) చదవండి: రష్మిక లక్ మామూలుగా లేదుగా.. క్రేజీ ప్రాజెక్టులో