నమ్మించి మోసం చేసిన ప్రముఖ సీరియల్ నటి! | Avneet Kaur Accused Fraud By Jewellery Brand | Sakshi
Sakshi News home page

Avneet Kaur: ప్రముఖ నటికి ఇదేం బుద్ధి? మరీ ఇంత మోసమా!

Aug 7 2024 1:08 PM | Updated on Aug 7 2024 1:08 PM

Avneet Kaur Accused Fraud By Jewellery Brand

ప్రముఖ సీరియల్ నటి నమ్మించి మోసం చేసింది. జ్యూవెల్లరీ బ్రాండ్‌తో ముందే డీల్ మాట్లాడుకున్న ఈమె.. సదరు సంస్థతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు కాకుండా వాళ్లని పూర్తిగా  విస్మరించింది. ఒకటి రెండుసార్లు అడిగి చూసినా సరే లాభం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా జ్యూవెల్లరీ సంస్థ తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?)

హిందీలో అవనీత్ కౌర్ అని నటి ఉంది. పలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇన్ స్టాలో 32 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె చాలా బ్రాండ్లని ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అలా కొన్నాళ్ల క్రితం 'రాంగ్-ఆకాంక్షనేగీ' అనే బ్రాండ్‌తో డీల్ మాట్లాడుకుంది. ఇందులో భాగంగా యూరప్ ట్రిప్‌లో వీళ్ల ఆభరణాలు ధరించాలి. తద్వారా ప్రమోషన్ జరుగుతుందని సంస్థ భావించింది.

కానీ అవనీత్ కౌర్ మాత్రం జ్యూవెలరీ సంస్థ ఇచ్చిన ఆభరణాలు వేసుకుని బోలెడన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. కానీ ఎక్కడా కూడా సంస్థ పేరుని ప్రస్తావించలేదు. ఇదే విషయమై అవనీత్‌ని ప్రశ్నించగా.. సంతృప్తికర సమాధానం రాలేదు. సరికదా జ్యూవెల్లరీ రేటు ఎంతో చెబితే చెల్లిస్తానని అంటోంది. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్స్ కొన్నింటిని జ్యూవెల్లరీ సంస్థ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇదంతా చూసిన నెటిజన్లు.. అవనీత్‌పై కౌంటర్లు వేస్తున్నారు.

(ఇదీ చదవండి: నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement