నయనతార కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు మళ్లీ ఓటీటీలోకి | Nayanthara Annapoorani Movie Returned Into OTT | Sakshi
Sakshi News home page

Annapoorani OTT: ఓటీటీలో వివాదాస్పద సినిమా.. కానీ చిన్న ట్విస్ట్

Aug 7 2024 9:58 AM | Updated on Aug 7 2024 11:00 AM

Nayanthara Annapoorani Movie Returned Into OTT

నయనతార ప్రధాన పాత్రలో నటించిన వివాదాస్పద సినిమా దాదాపు ఏడు నెలల తర్వాత తిరిగి ఓటీటీలోకి వస్తోంది. అధికారికంగా స్ట్రీమింగ్ డేట్ కూడా ప్రకటించేశారు. కాకపోతే ఈ సినిమాని మన దేశం తప్పితే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతకీ ఏంటా మూవీ? ఏంటా గొడవ?

(ఇదీ చదవండి: బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు!)

నయనతార 75వ సినిమా 'అన్నపూరణి'. గతేడాది డిసెంబరు 1న థియేటర్లలో రిలీజైంది. అదే నెల చివర్లో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చింది. అయితే ఇందులో ఓ బ్రహ్మణ అమ్మాయిని నాన్ వెజ్ వంటలు వండే చెఫ్‌గా చూపించడం పలువురి మనోభావాలు దెబ్బతీసింది. దీంతో పెద్ద రచ్చ అయింది. నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీని తమ ఓటీటీ నుంచి తొలగించగా.. నయనతార క్షమాపణలు చెప్పింది.

ఇప్పుడు ఈ సినిమా దాదాపు ఏడు నెలల తర్వాత సింప్లీ సౌత్ అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటించారు. ఇండియా తప్పితే మిగతా అన్ని చోట్ల అందుబాటులోకి వస్తుందని అన్నారు. బహుశా మళ్లీ ఏదైనా వివాదం అవుతుందనేమో ఇక్కడ ఓటీటీ రిలీజ్ చేయలేదు. చెఫ్ అనే వృత్తిని చాలామంది చులకనగా చూస్తుంటారు. ఈ క్రమంలోనే బ్రహ్మణ అమ్మాయి చెఫ్‌గా ఎలా మారింది? ఎన్ని సవాళ్లు ఎదుర్కొందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యువ హీరోని కొట్టి చంపిన దుండగులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement