ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం కాస్త ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయేంత వరకు వెళ్లింది. దీంతో అల్లరిమూకలు చెలరేగిపోతున్నాయి. ప్రధాని అధికారిక నివాసంలో వస్తువుల్ని ఎలా పట్టుకెళ్లిపోయారో వీడియోలు చూస్తూనే ఉన్నాయి. ఇలా జరుగుతున్న అల్లర్లలో బంగ్లా ప్రముఖ హీరోతో పాటు అతడి తండ్రి చనిపోవడం ఇండస్ట్రీలో విషాదం నింపింది.
(ఇదీ చదవండి: బాలీవుడ్ చేయలేనిది.. 'దేవర' చేసి చూపించాడు!)
పలు బంగ్లా సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నిర్మాత సలీం ఖాన్.. కొన్నేళ్ల క్రితం కొడుకు షాంటో ఖాన్‌ని హీరోగా పరిచయం చేశాడు. ఇప్పుడు వీళ్లిద్దరినీ అల్లరిమూకలు దారుణంగా చంపేశాయి. బంగ్లాదేశ్ ఫస్ట్ లైన్ మీడియా కథనం ప్రకారం.. సోమవారం సాయంత్రం చాంద్‌పూర్ అనే ప్రాంతం నుంచి పారిపోతుండగా.. బలియా యూనియన్‌లోని ఫరక్కాబాద్ మార్కెట్‌లో ప్రజలు వీళ్లపై ఆగ్రహానికి గురయ్యారు. పిస్టర్ పేల్చి అక్కడి నుంచి తండ్రి కొడుకు తప్పించుకున్నారు. కానీ దగ్గర్లోని బగారా మార్కెట్‌కి వచ్చేసరికి జనాలు పోగయ్యారు. వీళ్లిద్దరినీ కొట్టి చంపేశార.
షాప్లా మీడియా అనే నిర్మాణ సంస్థని స్థాపించిన సలీం ఖాన్.. అగ్ర నటీనటులతో సినిమాలు కూడా తీశారు. ఇక సలీం అతడి కుమారుడి మరణంపై నటుడు దేవ్ స్పందించాడు. 'నిన్న రాత్రి నాకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. సలీం చనిపోయారనే విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. బంగ్లాదేశ్‌లో శాంతి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను' అని తన బాధని వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: ఇప్పటికీ అలా పిలవడం బాధగా అనిపిస్తుంది: సన్నీ లియోన్)
Comments
Please login to add a commentAdd a comment