ఇప్పటికీ అలా పిలవడం బాధగా అనిపిస్తుంది: బాలీవుడ్ నటి ఆవేదన | Sunny Leone Reveals Being Bothered By Judgements For Being 18 Plus Star | Sakshi
Sakshi News home page

Sunny Leone: 'ఇండియాకు వచ్చి 13 ఏళ్లు.. ఇంకా అలా పిలిస్తే ఎలా?'

Published Tue, Aug 6 2024 7:59 PM | Last Updated on Tue, Aug 6 2024 8:09 PM

Sunny Leone Reveals Being Bothered By Judgements For Being 18 Plus Star

బాలీవుడ్ నటి సన్ని లియోన్ బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకుంది. 2011లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హోస్‌లో అడుగుపెట్టిన ఆమె అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత జిస్మ్- 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ రియాలిటీ షోను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సన్నీ లియోన్ గతంలో తన కెరీర్ గురించి వస్తున్న కామెంట్స్‌పై స్పందించింది. అలాంటివీ విన్నప్పుడు తనకు బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.

తాజా ఇంటర్వ్యూలో సన్నిలియోన్ మాట్లాడుతూ..' మొదట తాను ఇండియాకు వచ్చినప్పుడు నా గురించి పలు రకాలుగా మాట్లాడుకున్నారు.  అడల్ట్ మూవీ స్టార్ అన్నారు. కానీ అప్పట్లో అది సాధారణ విషయమే. కానీ నేను వచ్చి ఇప్పటికీ 13 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు కూడా అలాంటి ట్యాగ్‌తోనే పిలుస్తుంటే బాధేస్తోంది. అలాంటి మాటలు విన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు వాటిని వదలకపోతే.. మేము జీవితంలో ముందుకెలా వెళ్తాం. అది నా జీవితంలో జరిగిందని మీకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సొంత మార్గాల్లో ఎదుగుతున్నాం'  అని అన్నారు.

కాగా.. బాలీవుడ్‌లో జిస్మ్ 2తో ఎంట్రీ ఇచ్చిన సన్ని లియోన్.. ఆ తర్వాత జాక్‌పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా, కుచ్ కుచ్ లోచా హై, వన్ నైట్ స్టాండ్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె అనురాగ్ కశ్యప్‌ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ కెన్నెడీలో కనిపించనుంది. ఈ చిత్రం కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రీమియర్‌ ప్రదర్శించారు. అంతే కాకుండా జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్ నటించిన తమిళ చిత్రం కొటేషన్ గ్యాంగ్‌లో నటిస్తోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30, 2024న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement