Adult
-
ఇప్పటికీ అలా పిలవడం బాధగా అనిపిస్తుంది: బాలీవుడ్ నటి ఆవేదన
బాలీవుడ్ నటి సన్ని లియోన్ బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకుంది. 2011లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హోస్లో అడుగుపెట్టిన ఆమె అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత జిస్మ్- 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఓ రియాలిటీ షోను హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సన్నీ లియోన్ గతంలో తన కెరీర్ గురించి వస్తున్న కామెంట్స్‌పై స్పందించింది. అలాంటివీ విన్నప్పుడు తనకు బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది.తాజా ఇంటర్వ్యూలో సన్నిలియోన్ మాట్లాడుతూ..' మొదట తాను ఇండియాకు వచ్చినప్పుడు నా గురించి పలు రకాలుగా మాట్లాడుకున్నారు. అడల్ట్ మూవీ స్టార్ అన్నారు. కానీ అప్పట్లో అది సాధారణ విషయమే. కానీ నేను వచ్చి ఇప్పటికీ 13 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు కూడా అలాంటి ట్యాగ్‌తోనే పిలుస్తుంటే బాధేస్తోంది. అలాంటి మాటలు విన్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పటికీ కూడా మీరు వాటిని వదలకపోతే.. మేము జీవితంలో ముందుకెలా వెళ్తాం. అది నా జీవితంలో జరిగిందని మీకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మన సొంత మార్గాల్లో ఎదుగుతున్నాం' అని అన్నారు.కాగా.. బాలీవుడ్లో జిస్మ్ 2తో ఎంట్రీ ఇచ్చిన సన్ని లియోన్.. ఆ తర్వాత జాక్‌పాట్, రాగిణి ఎంఎంఎస్ 2, హేట్ స్టోరీ 2, ఏక్ పహేలీ లీలా, కుచ్ కుచ్ లోచా హై, వన్ నైట్ స్టాండ్ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తోన్న థ్రిల్లర్ మూవీ కెన్నెడీలో కనిపించనుంది. ఈ చిత్రం కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రీమియర్ ప్రదర్శించారు. అంతే కాకుండా జాకీ ష్రాఫ్, ప్రియమణి, సారా అర్జున్ నటించిన తమిళ చిత్రం కొటేషన్ గ్యాంగ్‌లో నటిస్తోంది. వివేక్ కుమార్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగష్టు 30, 2024న విడుదల కానుంది. -
పోర్షే కారు కేసు: ‘నిందితుడిని మేజర్‌గా పరిగణించండి’
ముంబై: పుణెలో సంచలనం రేపిన పోర్షే కారు రోడ్డు ప్రమాదం ఘటన పూర్తి నివేదికను పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్టు(జేజేబీ)కి అందజేశారు. పూర్తిగా విచారించేందుకు నిందితుడిని మేజర్‌గా పరిగణించాలని పోలీసులు గతంలో జేజేబీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమ అభ్యర్థనకు మద్దతుగా కేసులోని పూర్తి వివరాలు, సాక్ష్యాధారాల నివేదికను క్రైం బ్రాంచ్ పోలీసులు జేజేబీకి అందజేశారు. చదవండి: రీల్‌ను మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. ఇవేం ట్విస్టులు బాబోయ్!‘‘ రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలను జేజేబీకి సమర్పించాం. ఈ రోడ్డు ప్రమాదంలో మైనర్ బాలుడే కీలకంగా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజు( మే 19) సాయంత్రం నుంచి ప్రమాదం జరిగే సమయంలో అన్ని సాక్ష్యాలు సేకరించాం. ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్ష్యుల వద్ద స్టేట్మెంట్ తీసుకున్నాం. మైనర్ బాలుడు కారు నడిపినట్లు ప్రత్యక్ష సాక్షి చూశాడు. విచారణ సమయంలో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించాం. కోసీ రెస్టారెంట్, బ్లాక్ క్లబ్ రెస్టారెంట్లో మద్యం సేవించినట్లు గుర్తించాము. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మరణానికి కారణం మైనర్ బాలుడే. ఇలా.. మైనర్ బాలుడికి సంబంధించి పూర్తి వివరాలు జేజేబీకి అందించాం’’ అని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. నిందితుడిని ఇప్పటికైనా మేజర్‌గా పరిగణించి విచారించేందుకు సహకరిచాలని జేజేబీని క్రైం బ్రాంచ్ అధికారి కోరారు.ఈ కేసులో మైనర్ బాలుడి బ్లడ్ శాంపిళ్లు తారుమారు చేయడానికి అతని తల్లిదండ్రులు, సాసూన్ హాస్పిటల్ డాక్టర్ల సాయం తీసుకున్నారు. దీంలో విచారణలో వారి నిర్వాకం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేయగా జైలులో ఉన్నారు. బ్లడ్ శాంపిళ్లను తారుమారు చేయడానికి ప్రయత్నించిన మైనర్ బాలుడి తండ్రికి, డాక్టర్లకు మధ్యవర్తులుగా పనిచేసిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: పుణె పోర్షే కేసు: ‘ నాకేం గుర్తు లేదు.. అప్పడు తాగి ఉన్నా..!’ -
టీకాలంటే పిల్లలకేనా?.. పెద్దల వ్యాక్సినేషన్‌కు.. పరేషాన్!
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల అంటురోగాల నివారణ కోసం పిల్లలకు వ్యాక్సిన్లూ వేయిస్తూ ఉంటాం. అలాగే పెద్దలకూ పలు రకాల జబ్బులు రాకుండా వ్యాక్సిన్లు ఉంటాయి. కానీ వాటిని తీసుకునేవారు చాలా తక్కువ. ఇలాంటి వ్యాక్సిన్లపై అవగాహన లేకపోవడం ఒక కారణమైతే.. టీకాలు అంటే కేవలం పిల్లలకేననే అభిప్రాయం మరో కారణం. ‘అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇన్ ఇండియా (ఏపీఐ)’, ప్రముఖ పరిశోధన సంస్థ ఇప్పోస్లు సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. భారతదేశంలో వయో జనుల వ్యాధి నిరోధక టీకాల స్వీకరణ తక్కువగా ఎందుకు ఉందన్న అంశంపై హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 16 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించారు. 50 ఏళ్లు దాటిన వయోజనులు, వారి సంరక్షకులు, వైద్యులను కలసి సర్వే చేశారు. ఈ సందర్భంగా.. 50 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో 71 శాతం మందికి వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉన్నా.. కేవలం 16 శాతం మంది మాత్రమే వయోజన వ్యాక్సిన్లను తీసుకున్నట్టు తేలింది. దీనికి రోగులు, వైద్యులు పలు రకాల కారణాలు చెప్తుండటం గమనార్హం. మార్గదర్శకాలుఏవీ లేక.. వయోజన ఇమ్యునైజేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం వల్ల.. వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో ఆసక్తి లేదని సర్వేలో పాల్గొన్నవారిలో 90 శాతానికిపైగా వైద్యులు చెప్పారు. తమకంటూ ఉన్న కొన్ని పరిమితుల వల్ల కూడా పెద్దలకు వ్యాక్సినేషన్ గురించి చర్చించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఇక నివారణ కంటే చికిత్సకు రోగులు ప్రాధాన్యత ఇస్తారని భావించడం కూడా ఒక కారణమేనని అంటున్నారు. పెద్దల్లో 69 శాతం మంది, వారి సంరక్షకుల్లో 76 శాతం మంది వయోజన టీకా గురించి వైద్యులను ఎప్పుడూ అడగలేదని.. అవసరమైతే వైద్యులే తమకు సిఫార్సు చేస్తారని భావిస్తున్నామని సర్వేలో వెల్లడించారు. వయోజనులు టీకా తీసుకోవడం పెరగాలంటే.. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం చేపట్టిన తరహాలో అవగాహన చర్యలు చేపడితే ప్రయోజనం ఉంటుందని వయోజనుల్లో 55 శాతం, వారి సంరక్షకుల్లో 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. అపోహలతోనూ దూరం.. వయోజన వ్యాక్సినేషన్ గురించి ఉన్న కొన్ని అపోహలు పెద్దలు టీకాలు తీసుకోకుండా నిరోధిస్తున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. దశలవారీగా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకుంటే.. తాము అతిగా టీకా లపై ఆధారపడేలా మారుతామని వయోజనుల్లో 50 శాతానికిపైగా నమ్ముతున్నారని తేలింది. వయోజనుల్లో 58%, వారి సంరక్షకుల్లో 62% మంది రోగాల నుంచి రక్షించుకోవడానికి టీకా కంటే మెరుగైన మార్గాలు ఉన్నాయని భావిస్తున్నారని వెల్లడైంది. ‘షింగిల్స్’పై అవగాహన లేదు పెద్దల్లో వచ్చే ప్రధానమైన, వ్యాక్సిన్ ద్వారా నివారించగల వ్యాధి షింగిల్స్. దీని నివారణ గురించి ప్రజల్లో అవగాహన తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఈ అంశంపై విడిగా సర్వే నిర్వహించారు. పిల్లల్లో చికెన్ఫాక్స్కు కారణమయ్యే వైరస్ వల్ల పెద్దవారిలో షింగిల్స్ వ్యాధి వస్తుంది. చర్మంపై కురుపులతో నొప్పి, బాధాకరమైన పరిస్థితి కొన్ని వారాల నుంచి నెలల పాటు ఉంటుంది. షింగిల్స్‌కు, ఇతర చర్మ సంబంధ సమస్యల మధ్య తేడాను గుర్తించడం కష్టం. దీంతో రోగ నిర్ధారణ ఆలస్యమై చికిత్స ప్రభావం తక్కువగా ఉంటుంది. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 72 శాతం మందికి ఈ వ్యాధి గురించి తెలియదు. ఒకవేళ దీనికి గురైనా, మళ్లీ వచ్చే అవకాశం ఉంటుందని.. వ్యాక్సిన్ల ద్వారా దీన్ని నివారించవచ్చని 73శాతం మందికి తెలియదని సర్వేలో తేలింది. హైదరాబాదీల్లో అవగాహన ఉన్నా.. హైదరాబాద్ నగరంలో 50 ఏళ్లు దాటిన వయోజనుల్లో 53% మంది తమకు వ్యాక్సినేషన్ గురించి అవగాహన ఉందని చెప్పారు. కానీ వారిలో కేవలం 4% మందే వయోజన వ్యాక్సిన్లు తీసుకున్నారు. హైదరాబాద్‌లో 67 శాతం మంది కోవిడ్ కాకుండా ఇతర వ్యాధులు టీకాలు వేయాల్సినంత తీవ్రంగా లేవని భావిస్తున్నారు. పెద్దల్లో 67 శాతం, వారి సంరక్షకుల్లో 82% మంది వయోజన వ్యాక్సిన్లు అందుబాటు ధరల్లో లేవని చెప్తున్నారు. ఇక 81శాతం మంది టీకాలు తీసుకోవాలని వైద్యులు చెప్తే విశ్వసిస్తామని చెప్పారు. కానీ తమకు వైద్యులు వ్యాక్సిన్లను సిఫార్సు చేశారని 7 శాతం మందే చెప్పడం గమనార్హం. జాతీయ స్థాయిలో సగటున 16 శాతం వైద్యులు వయోజన వ్యాక్సినేషన్‌ను సిఫార్సు చేస్తున్నట్టు సర్వేలో తేలగా.. దక్షిణాదిలో వారు 10 శాతమే. పెద్దల్లో అవగాహన కల్పించాలి పిల్లల్లో రోగనిరోధకత ఆవశ్యకతను ప్రజలు బాగానే అర్థం చేసుకున్నప్పటికీ పెద్దల్లో అవగాహన లేదు. సందర్భాన్ని బట్టి టెటనస్ టాక్సాయిడ్, యాంటీ–రేబిస్ టీకా వంటివి మినహా పెద్దలు ఇతర వ్యాక్సిన్లను అవసరాలకు తగ్గట్టుగా తీసుకోవడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది. – బిపిన్ కుమార్ సేథీ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి -
పబ్లిక్‌గా పరువు పోగొట్టుకున్న ఫుట్‌బాల్ టీం
వైరల్: ఓవైపు ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదు అవుతున్నాయి. సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా ఓటమిపాలు అయ్యింది. అదే సమయంలో ఓ ఫుట్‌బాల్ టీం చేసిన పని.. సోషల్ మీడియాలో వాళ్ల పరువును తీసేస్తోంది. అమెరికా నేషనల్ ఫుట్‌బాల్ టీగ్లోని ఓ జట్టు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆదివారం మిన్నెసోటా వైకింగ్స్, డల్లాస్ కౌబాయ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు సాకర్ అభిమానుల్ని ఓ కోరిక కోరింది మిన్నెసోటా వైకింగ్స్. మీ కుటుంబంలోగానీ, స్నేహితుల్లోగానీ ఎవరైనా ఆర్మీలో పని చేస్తే.. ఆ రియల్ హీరోల గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేయాలని కోరింది. అలా వచ్చిన పోస్టుల్లో ఎంపిక చేసిన అభిమానికి రెండు టికెట్లు పంపడంతో పాటు.. అతని పోస్ట్‌ను వీడియో బోర్డుపై ప్రదర్శిస్తామని తెలిపింది. అది చూసి చాలామంది #SkolSalute హ్యాష్‌ట్యాగ్‌తో వైకింగ్స్‌కు పోస్ట్‌లు చేశారు. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు.. కైలే అనే ట్విటర్ హ్యాండిల్ పేరుతో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. తన కజిన్ జోయెల్ ఆర్మీలో పని చేశాడంటూ అతని ఫొటోతో సహా పోస్ట్ ఉంచాడు ఆ యూజర్. అంతేకాదు.. ఇతను నా కజిన్. ఆర్మీలో పని చేసేవాడు. అతని హీరోయిజం నాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. అంతేకాదు.. వైకింగ్స్‌కు అతను పెద్ద అభిమాని కూడా అంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. అయితే.. అందులో ఉంది కట్టుకథే అని కనిపెట్టడానికి అక్కడున్న ప్రేక్షకులకు ఎంతో టైం పట్టలేదు. అందులో ఉంది పో*స్టార్ జానీ సిన్స్. వెంటనే గ్రౌండ్లో విజిల్స్, అరుపులు వినిపించాయి. అది గమనించిన టీం నిర్వాహకులు వెంటనే దానిని తొలగించారు. అసలు ఆ కథను ఆ ఫుట్‌బాల్ ఎలా నమ్మిందో అర్థం కావడం లేదంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. జరిగిన ఘటనపై వైకింగ్స్ మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పగా.. సంబంధిత విభాగ సిబ్బందిపై చర్యలకు ఉపక్రమించింది కూడా. -
అపర కుబేరుడికి ‘అడల్ట్’ సినిమాల ఆఫర్!
స్మార్ట్ ఫోన్లు-ఇంటర్నెట్ వాడకం పెరిగాకే.. అడల్ట్ కంటెంట్ జనాలకు ఎక్కువగా రీచ్ అవుతోంది. ఈ తరుణంలో బిజినెస్ పెంచుకోవడం కోసం అడల్ట్ సైట్లు భారీ ఆఫర్లతో సెలబ్రిటీలను ఆకర్షిస్తుండగా.. సినిమా అవకాశాల కోసం ఈ రొంపిలోకి దిగుతున్న జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఈ తరుణంలో క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసే ప్రపంచ కుబేరుడికి పో* సినిమాల్లో నటించే అవకాశం దక్కడం విశేషం. టెస్లా సీఈవోగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీలు బిట్‌కాయిన్, డోజ్కాయిన్ల విలువను కేవలం ట్వీట్లతోనే శాసిస్తున్నాడు మస్క్. ఇది చాలదన్నట్లు ఆమధ్య అడల్ట్ థీమ్డ్ క్రిప్టో కరెన్సీలను సైతం ప్రమోషన్ చేసి.. వాటి విలువను అమాంతం పెంచాడు. ఈ నేపథ్యంలో నాఫ్టీ అనే కంపెనీ మస్క్‌కు బంపరాఫర్ ప్రకటించింది. అడల్ట్ సినీ పరిశ్రమకు ఫైనాన్స్ సమకూర్చే నాఫ్టీ.. సుమారు 6.9 మిలియన్ డాలర్ల విలువైన సొమ్ము, నాఫ్టీ టోకెన్లను ఇచ్చేందుకు మస్క్‌కు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మన కరెన్సీలో వాటి విలువ 51 కోట్ల రూపాయలకు పైనే. పైగా నచ్చిన టైంలో, నచ్చిన ప్లేసులో, తనకు నచ్చిన వాళ్లతో నటించే బంపరాఫర్ ప్రకటించింది. చదవండి: ఆకాశమే హద్దుగా! ఏం చేయబోతున్నాడంటే.. ఆయన అడల్ట్ కాయిన్ల కోసం ఆయన చేసే ప్రమోషన్.. ఈ పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. అందుకే నటించడం లేదంటే డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకు ఇస్తున్నాం అంటూ నాఫ్టీ సీఈవో రాబ్ కెమెనిఫై వెల్లడించాడు. మరి చావును మార్స్‌పై కోరుకునే ఈ ‘మూర్ఖపు మేధావి’ .. ఈ బంపరాఫర్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి. -
ప్లీజ్.. గర్భవతిని! నా పోర్న్ వీడియోల్ని తీసేయండి
కెరీర్లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్ లాంటి మాజీ పోర్న్ స్టార్స్ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్. చికాగో ఇల్లినాయిస్లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్ స్టార్ అసలు పేరు అమరా మాపుల్. టీనేజీలోనే పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్ సంపాదించుకుంది. మొదట మోడలింగ్, యూట్యూబ్, ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది. కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్ ‘టాప్ ఇన్’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది. ‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్ వెబ్సైట్లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా. చదవండి: అడల్ట్ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా? ఇంతకీ తండ్రెవరు? మైక్ మజ్లక్ అమెరికన్ నటుడు, పాపులర్ వ్లోగర్. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్షిప్ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది. చదవండి: పాక్ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్ -
అది ఎలన్ మస్క్‌కే సాధ్యం!
న్యూయార్క్: లక్షల కోట్లు సంపాదించాలన్న.. అలాంటి లక్షల కోట్లను క్షణాల్లో ముంచేయాలన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసే ఒక్క ట్వీట్ చాలు. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ ఫేట్‌ను మార్చేస్తున్న ఈ టెక్ బిలియనీర్.. తాజాగా చేసిన ఓ చిలిపి పని వైరల్ అవుతోంది. అడల్ట్ క్రిఫ్టో కరెన్సీ కోసం మస్క్ పోస్ట్ చేసిన ట్వీట్లు డిజిటల్ కరెన్సీ మార్కెట్లో అలజడిని సృష్టించాయి. తాజాగా మస్క్ చేసిన రెండు ట్వీట్లతో పోర్న్-థీమ్డ్ క్రిప్టో కరెన్సీ కమ్రాకెట్ కాయిన్ విలువ ఒకే రోజులో 352 శాతానికి పెరిగింది. అది కూడా ప్రారంభంలో కేవలం పది నిమిషాల్లో నాలుగు వందల రెట్లు పెరిగి.. నిదానంగా 352 శాతం దగ్గర ముగియడం విశేషం. ముందుగా ఎలన్ మస్క్ ‘కెనడా, యుఎస్ఎ, మెక్సికో’ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఈ మూడు దేశాల మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే క్రిప్టోకరెన్సీలను సూచిస్తున్నారని నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు అడల్ట్ సిగ్నేచర్స్‌తో చేసిన ట్వీట్స్ ఈ పోర్న్ థీమ్డ్ క్రిఫ్టో కరెన్సీ విలువ దూసుకుపోతోందని స్పష్టత ఇచ్చాడు. చదవండి: స్పేస్ఎక్స్కి ఇండియాలో ఎదురుదెబ్బ Canada USA Mexico — Elon Musk (@elonmusk) June 4, 2021 కమ్రాకెట్.. అడల్ట్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా పుట్టుకొచ్చిన క్రిప్టోకరెన్సీ. దీనితో పాటే కమ్మీ, కమ్మీన్స్ అనే మరో రెండు క్రిఫ్టో కాయిన్స్ చెలామణిలో ఉన్నాయి. ఎలన్ మస్క్ ట్వీట్స్ తర్వాత వాటి విలువలు కూడా 45 శాతం, 19 శాతం పెరగడం విశేషం. అసలే క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంటేనే గందరగోళం.. ఎలోన్ మస్క్ తన ట్వీట్లతో ఆ మార్కెట్‌ను మరింత గందరగోళంగా మార్చేస్తూ వస్తున్నాడు. 💦🚀 –> 🌙 — Elon Musk (@elonmusk) June 5, 2021 -
అడల్ట్ సినిమాలో సాయి పల్లవి?
సాక్షి, సినిమా : మళయాళంలో ఒక్క సినిమా(ప్రేమమ్)తో సెన్సేషన్‌గా మారిపోయిన సాయి పల్లవి.. తెలుగులోనూ ఫిదాతో అదే స్థాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది. తర్వాత ఎంసీఏతో కూడా ఫర్వాలేదనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతిలో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. బైలింగువల్ కణం(కరు) రిలీజ్‌కు రెడీగా ఉండగా.. తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళ్లో సూర్య ఎన్జీకే, ధనుష్ మారి-2 సినిమాల షూటింగ్లలో పాల్గొంటోంది. ఇవిగాక ఇప్పుడు కొత్తగా ఆమె చేతికి ఓ ప్రాజెక్టు వెళ్లినట్లు తెలుస్తోంది. విలక్షణ చిత్రాలను అందించే కోలీవుడ్ దర్శకుడు మిస్కీన్ త్వరలో ఓ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నాడు. దర్శక నటుడు భాగ్యరాజ్ తనయుడు శాంతను హీరోగా నటిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇందులో నిత్యా మీనన్‌తోపాటు సాయి పల్లవి కూడా నటించబోతోందన్న వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. నిత్యా ఇప్పటికే ఒకే చెప్పిందని.. పల్లవితో ఇంకా చర్చలు సాగుతున్నాయన్నది దాని సారాంశం. అయితే ఈ చిత్రంలో హర్రర్‌తోపాటు బోల్డ్ సన్నివేశాలు ఓ రేంజ్‌లోనే ఉంటాయని దర్శకుడు మిస్కీన్ మొన్నీమధ్యే మీడియాకు వెల్లడించాడు. ఈ నేపథ్యంలో హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న సాయి పల్లవి ఈ సినిమాకు ఓకే చెబుతుందా? అన్నది కాస్త అనుమానంగానే మారింది. -
లివర్ దెబ్బతింటే...
లివర్ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. గృహిణిని. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్ పూర్తిగా పాడైపోయిందనీ, అందువల్లనే నేను తరచుగా అనారోగ్యం పాలవుతున్నట్లు తెలిపారు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - అంజలి, వైజాగ్ లివర్ పాడవడానికి అనేక కారణాలున్నాయి.ఎక్కువ శాతం మంది హెపటైటిస్- బీ, హెపటైటిస్-సి వైరస్ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్ బ్లడ్ టెస్ట్స్ నిర్వహించి మీ లివర్ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి. ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్గ్రూప్కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్ డోనార్’ ప్రక్రియ అంటారు. ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్ ఆర్గాన్ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్ లభించే అవకాశం ఉంది. కెడావర్ ఆర్గాన్ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్ డోనార్’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్ రేటు 90 శాతం ఉంటుంది. కాకపోతే లివర్ అనేది చాలా సున్నితమైన అవయవం. కాబట్టి అధునాతనమైన సదుపాయాలు ఉన్న ఆసుపత్రిలో, నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ నిర్వహిస్తే రిస్క్‌లు చాలా తక్కువగా ఉంటాయి. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్ స్పెషలిస్ట్‌ను కలవండి. డాక్టర్ బాలచంద్రమీనన్ చీఫ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆయుర్వేద కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. ఎత్తు ఐదు అడుగులు. బరువు 92 కేజీలు. నా బరువు తగ్గడానికి ఆయుర్వేద మందులు, ఆహారం గురించి తెలియజేయగలరు. - అరుణాగాయత్రి, హైదరాబాద్ భౌతిక లక్షణాల్లో మనిషి మనిషికీ తేడాలు కనిపిస్తుంటాయి. ఆయుర్వేద సూత్రాలరీత్యా ఇవి వారి ‘ప్రకృతి, సార, సత్వం’ లాంటి అంశాల మీద ఆధారపడి ఉంటాయి. (అంటే శరీరతత్వం, సప్తధాతువుల్లోని భేదం, మానసిక తత్వం). మీ ఎత్తునుబట్టి మీరు ఉండాల్సిన దానికంటే సుమారు 35 కేజీల బరువు ఎక్కువగా ఉన్నారు. హైపోథైరాయిడిజం కుషింగ్ సిండ్రోమ్, పీసీఓడీ, రక్తహీనతల వంటి ప్రాథమిక రోగాలు, కొన్ని మందుల దుష్ర్పభావాలు కూడా అధిక బరువుకు కొన్ని కారణాలు. అవి లేనప్పుడు మన బరువు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉంటుంది. స్థౌల్య కారణాలు: శారీరక శ్రమ లేకుండటం, పగటిపూట అధిక నిద్ర, కఫవృద్ధికర ఆహార సేవన... అంటే గుర్వాహారం (కొవ్వులు, మధుర ద్రవ్యాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తినడం) (మాధవ నిదానం: అవ్యాయామ దివాస్వప్న శ్లేష్మలాహార సేవినః మధురోన్న రసః ప్రాయః స్నేహాత్ మేదః ప్రవర్ధయేత్) లక్షణాలు: ఆకలి, దప్పిక ఎక్కువగా ఉండటం, శరీరం లావెక్కడం, ఉత్సాహం లేకపోవడం వంటివి. చికిత్స: ఈ చికిత్స నియమాలు రోగికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎలాగంటే... ఉదాహరణకు గుర్వాహారం తినకూడదు, వ్యాయామం చాలా అవసరం (స్థూలకాయం వల్ల ఇది ప్రాణసంకటంగా ఉంటుంది). స్థౌల్యం తగ్గాలనే ప్రగాఢ కాంక్ష రోగికి కలిగేట్టు స్ఫూర్తినివ్వాలి (నిరుత్సాహం స్థూలకాయుల్లో ప్రధాన లక్షణం). అందుకే చరక మహర్షి స్థౌల్యాన్ని అత్యంత నిందితావస్థగా ఉటంకించాడు. ఈ సందర్భంలో వాగ్భటుడు ‘స్థౌల్యం కంటే కృశత్వమే వరం, స్థూలునికి మందుల్లేవు’ అని అతిశయోక్త్యలంకారంలో చెప్పాడు. (కార్శ్య మేవ వరం స్థౌల్యాత్, నహి స్థూలస్య భేషజం). ఈ చికిత్సలో ఆహార విహారాలు అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఔషధాలది మూడో స్థానం మాత్రమే. 1. ఆహారం: పోషక విలువలుండాలి; కొవ్వులు మధురరసాయలు ఉండకూడదు. కాబట్టి ఉడికించని పచ్చి ఆహారం మంచిది. అవి... మొలకలు, క్యారట్, బీట్రూట్, దోసకాయ, టమాటా వంటి సలాడ్సు, తాజా ఫలాలు, కూరగాయల పచ్చిరసాలు. 2. వండిన ఆహారం: ఉప్పు, నూనెలు లేకుండా ఉడికించిన కూరగాయలు, పుల్కాలు, ముడిబియ్యపు అన్నం, పొట్టుతో కూడిన పప్పులు, ఆకుకూరలు. 3. పానీయాలు: గంజి, జావలు, ఉలవచారు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని నీరు. ఇలాంటి లఘ్వాహారంతో ఆకలిని నియంత్రించి జయించాలేగానీ... ఆకలిని అణచివేసే ద్రవ్యాల్ని ప్రయోగించడం శాస్త్రవిరుద్ధం. ఉప్పుని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. స్థౌల్యహర ద్రవ్యాలు: పసుపు, వెల్లుల్లి, గోధుమలు, బార్లీ, ఉలవలు, వేడినీరు. విహారం: ఏదో ఒక రూపంలో చెమట పట్టేలా తగినంత పరిశ్రమ చేయాలి. క్రమక్రమేణా వ్యాయామాలను పెంచాలి. పగలు నిద్రపోవద్దు. ప్రాణాయామం రెండుపూటలా తప్పనిసరిగా చేయాలి. ఔషధాలు: త్రిఫల / నవక గుగ్గులు (మాత్రలు) : ఉదయం 2, రాత్రి 2 మేదోహర విడంగాది లోహం (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 తిప్పతీగ, తుంగముస్తలు, శొంఠి త్రవ్యాలతో చేసిన కషాయం రోజూ పరగడుపున 30 మిల్లీలీటర్లు తాగాలి. పంచకర్మలు: ఉద్వర్తనం (చూర్ణాలతో నలుగుపెట్టడం) స్వేదకర్మ (చెమట పట్టేట్టు చేయడం) అవసరాన్ని బట్టి వమన, విరేచన, వస్తికర్మల వల్ల గణనీయమైన ఫలితాలు కనిపిస్తాయి. కానీ ఇవి మాత్రం తప్పనిసరిగా వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే జరగాలి. గమనిక: బరువు తగ్గడమనేది క్రమబద్ధంగా జరగాల్సిన దీర్ఘకాలపు ప్రక్రియ. రాత్రికి రాత్రి బరువు తగ్గించుకోవాలనుకోవడం సరికాదు. అది అశాస్త్రీయం, ప్రమాదభరితం. అధికబరువు వల్ల గుండెపోటు, పక్షవాతం రావచ్చు. ఆయాసం, నీరసం, సంభోగశక్తి తగ్గిపోవడం వంటి ఉపద్రవాలుంటాయి. బరువు పెరగకుండా జాగ్రత్తవహించడం శ్రేయస్కరం. అది మన చేతుల్లోనే ఉంది. మొండిగా, అదేపనిగా ఉపవాసాల వల్ల ప్రయోజనం ఉండదు. డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్