స్మార్ట్ ఫోన్‌లు-ఇంటర్నెట్ వాడకం పెరిగాకే.. అడల్ట్ కంటెంట్ జనాలకు ఎక్కువగా రీచ్ అవుతోంది. ఈ తరుణంలో బిజినెస్ పెంచుకోవడం కోసం అడల్ట్ సైట్లు భారీ ఆఫర్లతో సెలబ్రిటీలను ఆకర్షిస్తుండగా.. సినిమా అవకాశాల కోసం ఈ రొంపిలోకి దిగుతున్న జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కొందరు. ఈ తరుణంలో క్రిప్టో కరెన్సీలను ప్రమోట్ చేసే ప్రపంచ కుబేరుడికి పో* సినిమాల్లో నటించే అవకాశం దక్కడం విశేషం.
టెస్లా సీఈవోగా నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఎలన్ మస్క్. క్రిప్టో కరెన్సీలు బిట్‌కాయిన్, డోజ్‌కాయిన్‌ల విలువను కేవలం ట్వీట్లతోనే శాసిస్తున్నాడు మస్క్. ఇది చాలదన్నట్లు ఆమధ్య అడల్ట్ థీమ్డ్ క్రిప్టో కరెన్సీలను సైతం ప్రమోషన్ చేసి.. వాటి విలువను అమాంతం పెంచాడు. ఈ నేపథ్యంలో నాఫ్టీ అనే కంపెనీ మస్క్‌కు బంపరాఫర్ ప్రకటించింది.
అడల్ట్ సినీ పరిశ్రమకు ఫైనాన్స్ సమకూర్చే నాఫ్టీ.. సుమారు 6.9 మిలియన్ డాలర్ల విలువైన సొమ్ము, నాఫ్టీ టోకెన్లను ఇచ్చేందుకు మస్క్‌కు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. మన కరెన్సీలో వాటి విలువ 51 కోట్ల రూపాయలకు పైనే. పైగా నచ్చిన టైంలో, నచ్చిన ప్లేసులో, తనకు నచ్చిన వాళ్లతో నటించే బంపరాఫర్ ప్రకటించింది.
చదవండి: ఆకాశమే హద్దుగా! ఏం చేయబోతున్నాడంటే..
ఆయన అడల్ట్ కాయిన్ల కోసం ఆయన చేసే ప్రమోషన్.. ఈ పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుంది. అందుకే నటించడం లేదంటే డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకు ఇస్తున్నాం అంటూ నాఫ్టీ సీఈవో రాబ్ కెమెనిఫై వెల్లడించాడు. మరి చావును మార్స్‌పై కోరుకునే ఈ ‘మూర్ఖపు మేధావి’ .. ఈ బంపరాఫర్‌పై ఎలా స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment