
న్యూయార్క్: లక్షల కోట్లు సంపాదించాలన్న.. అలాంటి లక్షల కోట్లను క్షణాల్లో ముంచేయాలన్న టెస్లా సీఈవో ఎలన్ మస్క్ చేసే ఒక్క ట్వీట్ చాలు. ఈ మధ్య క్రిప్టోకరెన్సీ ఫేట్‌ను మార్చేస్తున్న ఈ టెక్ బిలియనీర్.. తాజాగా చేసిన ఓ చిలిపి పని వైరల్ అవుతోంది. అడల్ట్ క్రిఫ్టో కరెన్సీ కోసం మస్క్ పోస్ట్ చేసిన ట్వీట్లు డిజిటల్ కరెన్సీ మార్కెట్లో అలజడిని సృష్టించాయి.
తాజాగా మస్క్ చేసిన రెండు ట్వీట్లతో పోర్న్-థీమ్డ్ క్రిప్టో కరెన్సీ కమ్రాకెట్ కాయిన్ విలువ ఒకే రోజులో 352 శాతానికి పెరిగింది. అది కూడా ప్రారంభంలో కేవలం పది నిమిషాల్లో నాలుగు వందల రెట్లు పెరిగి.. నిదానంగా 352 శాతం దగ్గర ముగియడం విశేషం. ముందుగా ఎలన్ మస్క్ ‘కెనడా, యుఎస్ఎ, మెక్సికో’ అర్థం వచ్చేలా ఒక ట్వీట్ చేశాడు. దీంతో ఈ మూడు దేశాల మొదటి అక్షరంతో ప్రారంభమయ్యే క్రిప్టోకరెన్సీలను సూచిస్తున్నారని నెటిజన్స్ అర్థం చేసుకున్నారు. ఆ మరుసటి రోజు అడల్ట్ సిగ్నేచర్స్‌తో చేసిన ట్వీట్స్ ఈ పోర్న్ థీమ్డ్ క్రిఫ్టో కరెన్సీ విలువ దూసుకుపోతోందని స్పష్టత ఇచ్చాడు. చదవండి: స్పేస్ఎక్స్కి ఇండియాలో ఎదురుదెబ్బ
Canada
— Elon Musk (@elonmusk) June 4, 2021
USA
Mexico
కమ్రాకెట్.. అడల్ట్ ఇండస్ట్రీకి సపోర్ట్‌గా పుట్టుకొచ్చిన క్రిప్టోకరెన్సీ. దీనితో పాటే కమ్మీ, కమ్మీన్స్ అనే మరో రెండు క్రిఫ్టో కాయిన్స్ చెలామణిలో ఉన్నాయి. ఎలన్ మస్క్ ట్వీట్స్ తర్వాత వాటి విలువలు కూడా 45 శాతం, 19 శాతం పెరగడం విశేషం. అసలే క్రిప్టోకరెన్సీ మార్కెట్ అంటేనే గందరగోళం.. ఎలోన్ మస్క్ తన ట్వీట్లతో ఆ మార్కెట్‌ను మరింత గందరగోళంగా మార్చేస్తూ వస్తున్నాడు.
💦🚀 –> 🌙
— Elon Musk (@elonmusk) June 5, 2021
Comments
Please login to add a commentAdd a comment