టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ఏం చేసినా అది వార్తల్లో నిలుస్తుంటుంది. అంతేనా ఆయన వ్యాఖ్యలే కాదు ట్వీట్‌లు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తుంటాయి. గత వారంలో మస్క్ ట్విటర్ డీల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మస్క్ పేరు మారుమోగుతోంది. తాజాగా భారత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఎలాన్ మస్క్‌పై చేసిన సెటైరికల్ ట్వీట్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఏముంది ఆ ట్విట్‌లో..
స్పామ్ అకౌంట్లకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైనందు వల్ల మస్క్ ట్విటర్ డీల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ఎలాన్ ఒక భారతీయ రైలులో ప్రయాణిస్తుంటే, కండక్టర్(TC) అతన్ని టీటీ (టిక్కెట్‌లెస్ ట్రావెలర్) అని ముద్రవేస్తాడు. అయితే అప్పుడప్పుడు ఆ టికెట్ లేని ప్రయాణికుడు కూడా వార్తల్లో నిలుస్తుంటాడని ట్విట్ చేశాడు. రూపాయి ఖర్చు పెట్టకుండానే మస్క్ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు అంటూ తనదైన శైలిలో మహీంద్రా చమత్కరించారు.
ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ కాగా దీని చూసిన ఓ నెటిజన్ స్పందిస్తూ.. మస్క్‌కి బదులు మీరే కొనొచ్చు కదా ? పశ్చిమ దేశాలచే నియంత్రించబడే ఈ సోషల్ మీడియాపై మనము ఎక్కువగా ఆధారపడుతున్నామని కామెంట్ చేశాడు.
If Elon was traveling on an Indian train, the conductor would label him a “TT” Ticketless Traveler. But TT could now also become a term for any headline grabbing bid that implodes: A Twitter Tease. https://t.co/Pn8ikF4NxF
— anand mahindra (@anandmahindra) July 9, 2022
చదవండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత?
Comments
Please login to add a commentAdd a comment